ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీని విచారించిన సీట్.!

Publish Date:Jul 14, 2026

Advertisement

తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న  సిట్ ఇప్పటికే   పలువురు రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీసు అధికారుల వాంగ్మూలాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా  మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ మాజీ ఐపీఎస్ అధికారిని విచారించింది. 
 ఆంధ్రప్ర దేశ్ ఇంటెలిజెన్స్ మాజీ  చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సిట్ అధికారులు విచారణ కు పిలిచి ఆయన వాంగ్మూలం రికార్డు చేశారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఇతర రాష్ట్రానికి చెందిన సీనియర్ బ్యూరోక్రాట్‌ను విచారించ డం ఇదే తొలిసారి.

సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ప్రాథమిక వివరాల ప్రకారం...  2023లో దాదాపు ఏడాది పాటు ఏబీ వెంకటేశ్వరరావు కాల్ డేటా రికార్డులను  నిందితులు అక్రమంగా సేకరించినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయనను ఈ కేసులో బాధితుడిగా, కీలక సాక్షిగా పరిగణించిన సిట్  వెంకటేశ్వరరావును విచారణకు పిలిచి ఆయన వాంగ్మూలం నమోదు చేశారు.

విచారణ సందర్భం గా ఏబీవీ కాల్ డేటా సేకరణ కు సంబంధించిన అంశాలు, ఆ సమయంలో  ఆయన  నిర్వహించిన అధికారిక బాధ్యతలు, తదితర అంశాలపై సిట్ అధికారులు ఏబీ వెంకటే శ్వరరావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది.  ఏబీవీ కాల్ డేటా సేకరణ వెనుక ఉన్న ఉద్దేశం,   దాన్ని ఎవరెవరు ఉపయోగిం చారు, ఏ విధంగా దుర్విని యోగం చేశారనే కోణాల్లో  దర్యాప్తు కొనసాగుతోంది.  

SIT, Former AP Intelligence Chief ABV in the phone-tapping case, telangana Phone Tapping Case 

By
en-us Political News

  
సోషల్ మీడియా ప్రపంచంలో ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు.
ఐఏఎస్, ఐపీఎస్‌ల ఫ్యాక్టరీగా మారిన నేతర్‌హాట్ బడి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలన శకం ముగిసింది.
టీటీడీలోని వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పిస్తున్న ప్రివిలేజెస్‌లో పలు మార్పులు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ నివాసంలో సోదాలు ముగిశాయని ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ వెల్లడించారు.
కన్న కొడుకు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్న ఆ తల్లి గుండె, నేడు శోకసంద్రమై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది.
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాల తర్వాత ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్ హోదా దక్కించుకున్న మూడవ విమానాశ్రయంగా భోగాపురం నిలిచింది. ఈ పరిణామం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఈ ఎయిర్‌పోర్ట్ ఏరోడ్రోమ్ లైసెన్స్ పొందిన తర్వాత కొన్ని రోజులకే చోటుచేసుకోవడం గమనార్హం.
ప్రకాశం జిల్లా సింగరాయ కొండలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
నటుడు జూనియర్ ఎన్టీఆర్ పేరును ఉపయోగిస్తూ RAW NTR (రా-ఎన్టీఆర్) పేరుతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు సంస్థను నిర్వహిస్తూ అది ఎన్టీఆర్ అధికారిక సంస్థ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు
తెలంగాణ విమానయాన రంగంలో సరికొత్త అధ్యాయం లిఖించబడబోతోంది.
రూ.2 లక్షల లంచంతో ఏఈ దొరికేశాడు..
సార్, ఒకసారి హగ్ చేసుకోవచ్చా.. యువ వైద్యుడి కోరిక తీర్చిన ముఖ్యమంత్రి విజయ్..!
ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో హైదరా బాద్‌తో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నానక్‌రామ్‌గూడ లోని సుమధుర అక్రోపోలిస్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉన్న రవీందర్ ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన పలు ప్రదేశా ల్లో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.