Publish Date:Mar 20, 2023
దేశ రాజధానిలో మహిళలపై దాడులు పెచ్చరిల్లాయి అన్నందుకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కీలక నేత రాహుల్ గాంధీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆధారాలు చూపమని, అలాగే తెలంగాణలో టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజిపై అధికార పార్టీ అగ్రనేతలపై ఆరోపణలు చేసిన రేవంత్ కు నోటీసులు ఇచ్చారు పేపర్ లీకేజీ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు. హస్తినలో మహిళల భద్రత ప్రమాదంలో ఉందన్న మాట కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొత్తగా చెప్పలేదు.
అలాగే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిపై ఆరోపణలు చేసినది రేవంత్ ఒక్కరే కాదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఇవే ఆరోపణలు చేశారు. అయినా ఆరోపణలపై దర్యాప్తు చేసి నిగ్గు తేల్చాల్సిన పోలీసులు ఆరోపణలు చేసిన వారికే నోటీసులు ఇచ్చి ఆధారాలు ఇవ్వాలనడం, తాము చేయాల్సిన పనిని వదిలేయడం గానే భావించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు తమపై ఆరోపణల విషయంలో స్పందించిన తీరు ఒకలాగే ఉండటం ఎంతమాత్రం కాకతాళీయం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పోతే సిట్ నోటీసులకు భయపడేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారించాలన్న తన డిమాండ్ ను పునరుద్ఘాటించారు.
సిట్ దర్యాప్తుపై విశ్వాసం లేదన్న ఆయన తన వద్ద ఉన్న ఆధారాలను సీట్ కు ఇచ్చే ప్రశక్తే లేదన్నారు. స్వయంగా కేసీఆర్ కేంద్రం వద్ద సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలుంటే తమకు రాష్ట్ర దర్యాప్తు సంస్థలున్నాయని ప్రకటించారనీ, అటువంటి సిట్ ను నమ్మి ఆధారాలెలా ఇస్తామని రేవంత్ అన్నారు. పేపర్ లీకేజీపై సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపిస్తే అప్పుడు తన వద్ద ఉన్న ఆధారాలను బయటపెడతానని స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sit-notice-to-revanth-25-152752.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.