భావసారూప్యత ఓ బ్రహ్మ పదార్ధం!

Publish Date:Feb 27, 2023

Advertisement

కాంగ్రెస్ పార్టీ చక్కటి నిర్ణయం తీసుకుంది. భావసారూప్యత ఉన్న పార్టీలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. పార్టీ 85వ ప్లీనరీ సందర్భంగా రూపొందించిన ‘రాయపూర్‌ డిక్లరేషన్‌’లో ఈ విషయాన్ని వెల్లడించింది. రాజ్యాంగాన్ని పరిరక్షించడంతో పాటు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకుగాను ఉమ్మడి, నిర్మాణాత్మక కార్యక్రమం కింద భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంచేసింది.

నిజానికి, ప్లీనరీకి ముందు నుంచి కూడా బీజేపీని ఒంటరిగా ఓడించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొదలు కాంగ్రెస్ దిగ్గజ నేతలు అందరూ అంగీకరిస్తూనే ఉన్నారు. ఖర్గే అయితే భావసారూప్యత కలిగిన అన్ని పార్టీలతో తాము చర్చలు జరుపుతున్నామని, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిదే విజయమని ప్లీనరీ ప్రారంభానికి ముందే ప్రకటించారు. నిజానికి, రాయపూర్‌ డిక్లరేషన్‌లోనే కాదు  రాజకీయ తీర్మానంలోనూ, పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు ఇతర ముఖ్య నాయకుల ప్రసగాలలోనూ కూడా కాంగ్రెస్‌ ఇతర పార్టీలతో కలిసి పోరాడేందుకు సన్నద్ధంగా ఉందని ఒకటి పది సార్లు ప్రకటించారు. 

అయితే, ఇంతకీ ఈ భావసారూప్యత అంటే ఏమిటి? బీజేపీ నియంతృత్వ, మతతత్వ, క్రోనీ క్యాపిటలిజం దాడి నుంచి రాజకీయ విలువల్ని కాపాడేందుకు పోరాడతామని, అదే భావసారుప్యత కాంగ్రెస్ అంటోంది. పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, తీవ్రమవుతున్న సామాజిక విద్వేషాలు, రాజకీయ నియంతృత్వం.. ఈ మూడు దేశానికి ప్రధాన సవాళ్లని కాంగ్రెస్‌ అభివర్ణించింది. వీటిని ఎదుర్కొనేందుకు భావసారూప్యత కలిగిన బీజేపీయేతర పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చింది. అయితే కాంగ్రెస్ ఒకటే కాదు, ఈ లక్షణాలు (నియంతృత్వ, మతతత్వం, క్రోనీ క్యాపిటలిజం)  అంటని పార్టీ ఏదీ లేదు. నిజానికి, పద గాంభీర్యం కోసం  ఎంత పదునైన పదాలను ప్రయోగించినా  అసలు భావసారుప్యత అది కాదు.  అసలు సిసలు భావసారూప్యతఅధికారమే. ఇది చరిత్ర చెపుతున్న సత్యం.

 ఒకప్పుడు బీజేపీతో జట్టు కట్టిన పార్టీలు ఆ తర్వాత కాంగ్రెస్ తో చేతులు కలిపాయి. కాంగ్రెస్ తో చేతులు కలిపిన పార్టీలు మళ్ళీ ఎన్నికల నాటికీ కమలం గూటికి చేరాయి. తమిళనాడు విషయాన్నే తీసుకుంటే ఉభయ ద్రవిడ పార్టీలు ( డిఎంకే, అన్నా డిఎంకే) ఉభయ జాతీయ కూటములు (ఎన్డీఎ, యూపీఎ) లతో జట్టు కట్టాయి. విడిపోయాయి.  కుండమార్పిడి పద్దతిలో పొత్తులు మార్చుకున్నాయి. ఒక సారి కమలంతో చేతులు కలిపిన పార్టీ మళ్ళీ ఎన్నికల నాటికీ హస్తం చెయ్యందుకుంది. హస్తం చెయ్యందుకున్న పార్టీ మళ్ళీ ఎన్నికల ఆనాటికి కమలం గూటికి చేరింది. చిత్రం, ఏమంటే ఒక్క ఓటు తేడాతో అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం కూల్చి వేయడంలో కీలక పాత్ర పోషించిన జయలలిత( ఎఐఎడిఎంకే) తదనంతర కాలంలో బీజేపీ మిత్ర పక్షమయ్యింది. అలాగే, మహారాష్టంలో సుదీర్ఘ కాలంపాటు బీజేపీతో కలిసి సాగిన శివసేన ముఖ్యమంత్రి పీఠంకోసం కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టు కట్టింది.

ఎన్నికలలో బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ తో కలిసింది. అలాగే బీహార్ లో నితీష్ కుమార్, బీజేపీతో కలిసి పోటీచేసి గెలిచి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపారు.  జమ్మూ కశ్మీర్ లో పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నడిపాయి, అంతకు ముందు నేషనల్ కాన్ఫరెన్స్ వాజపేయి ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా వుంది. అలాగే వామ పక్ష పార్టీలు (సిపిఐ, సిపిఎం)బెంగాల్లో కాంగ్రెస్’ పార్టీతో భావసారూప్యత ఉన్న మిత్ర పక్షాలు, కేరళలో భావ వైరుధ్య శత్రు పక్షాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే... అదో రామాయణమే అవుతుంది. అధికార ఆకాంక్షకు అదొక ముసుగు. అందుకే భావసారూప్యత అన్నది.. అదొక బ్రహ్మ పదార్ధం అంటారు.

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.