Publish Date:Feb 27, 2023
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటగా మూడవ సారి ముఖ్యమంత్రి అవుతారా? బీఆర్ఎస్ నాయకులు ఏ ఇద్దరు కలసిన ఇదే విషయం చర్చకు వస్తోంది. నిజానికి సర్వేలు ఏమి చెపుతున్నప్పటికీ, ఎన్నికలు ఎప్పుడు జరిగినా, బీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటీ వచ్చినా రాకున్నా కాంగ్రెస్ సహకారంతో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని కొందరు నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటీ వస్తే మాత్రం కేసీఆర్ హ్యాట్రిక్ మిస్సవుతారని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.అవును బీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటీ వస్తే, కేసీఆర్ స్థానంలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, కేసీఆర్ జాతీయ రాజకీయాలకు పరిమితం అవుతారని అంటున్నారు.
అయితే, ప్రస్తుత పరిస్థితిలో బీఆర్ఎస్ కు పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు అంతగా లేవని, అదుకే 2014లో వచ్చిన అత్తెసరు మెజారిటీ కూడా ఈసారి రాక పోవచ్చని అంటున్నారు. అదుకే, కేటీఆర్ లో అసహనం పెరుగుతోందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కేటీఆర్ ఎక్కడ మాట్లాడినా, విపక్షాల మీద విరుచుకు పడుతున్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టార్గెట్ గా కేటీఆర్ చేస్తున్న విమర్శలు శృతి మించుతున్నాయని విమర్శకులు అంటున్నారు. చివరకు ప్రధాని మోడీని, తెలంగాణకు పట్టిన శని అనే స్థాయిలో విమర్శించారు. అదే విధంగా రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్రను ఉద్దేశించి,కొందరు పనికిమాలిన పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని అంటున్నారని, యాభై ఏళ్లు అధికారంలో ఉండి ఏం పీకారని దుయ్యబట్టారు.
అలాగే వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)కి చెందిన పీజీ మొదటి సంవత్సరం విద్యార్థిని ప్రీతి మరణం ఘటనను రాజకీయం చేస్తున్నారని విపక్షాలను తప్పుబట్టారు. ప్రీతిని హత్య చేసిన వారిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు సైఫ్ అయినా సంజయ్ (బండి సంజయ్?) అయినా ఎవరినీ వదలమని కేటీఆర్ హెచ్చరించారు. ఇది ఆయనలో అసహనానికి నిదర్శనం కావచ్చునని బీఆర్ఎస్ నాయకులే అంటున్నారు. సీఎం కుర్చీ దూరమౌతోందన్న భావనతోనే ఆయన విమర్శలు శృతి మించుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/impatience-in-ktr-39-151976.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.