మోడీని టార్గెట్ చేస్తూ సిద్ద రామయ్య అస్త్రాలు

Publish Date:Jul 22, 2023

Advertisement

 ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల వల్లే రాష్ట్రాలు దివాళా తీస్తున్నాయంటూ మోడీ సర్కార్ చేస్తున్న ప్రచారాన్ని విమర్శలను బీజేపీ యేతర పార్టీలు తప్పుపడుతున్నాయి. మోడీ విధానాల కారణంగానే రాష్ట్రాలు దివాళా బాట పడుతున్నాయని ఎదురు దాడికి దిగుతున్నాయి. ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్రాల ఆదాయాన్ని కుదించేసే విధానాలను మోడీ సర్కార్ అవలంబిస్తోందని దుయ్యబడుతున్నాయి. ఇప్పుడు తాజాగా కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే రీతిన మోడీ సర్కార్ పై విరుచుకుపడింది. కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య  మోడీని టార్గెట్ చేస్తూ అస్త్రాలను సంధించారు.  దేశం దివాళా తీసింది రాష్ట్రాలు అమలు చేసిన సంక్షేమ పథకాలతో కాదని, ప్రధాని నరేంద్రమోదీ చేసిన అప్పులతోనే అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్థికమంత్రి హోదాలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సీఎం సిద్దరామయ్య విధానపరిషత్‌లో సమగ్ర వివరణ ఇచ్చారు. శుక్రవారం కార్యకలాపాల చివరిరోజు బడ్జెట్‌పై ముఖ్యమంత్రి రెండున్నర గంటలకుపైగా ప్రసంగించారు. ప్రతిపక్ష సభ్యులు లేక, ప్రశ్నించేవారు లేక ఉత్సాహమే లేదన్నారు. రాష్ట్రంలో మూడున్నరేళ్ల బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో తొమ్మిదేళ్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనపై ప్రతి అంశంలోనూ విరుచుకుపడుతూ వచ్చారు. సోషలిజానికి బీజేపీ వ్యతిరేకమన్నారు. వారికి నిప్పు పెట్టడమే పని అన్నారు. ప్రజల జేబు నుంచి చాకచక్యంగా డబ్బులు దోచేయడంలో వారే ప్రముఖులన్నారు. ప్రజా సమస్యలపై సభలో ప్రతిపక్ష సభ్యులు నిలదీయాలని, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపాలన్నారు. కానీ ప్రతిపక్షనేతను ఎంపిక చేయడంలో విఫలమైన బీజేపీ సభకు గైర్హాజరైందన్నారు. బడ్జెట్‌పై పరిషత్‌లో 15మంది సభ్యులు మాట్లాడితే అందులో 10 మంది కాంగ్రె్‌సవారే ఉన్నారని, ఇరువురు బీజేపీ, ముగ్గురు జేడీఎస్‌ సభ్యులు ఉన్నారన్నారు. అందులోనూ జేడీఎస్‌ మరితిబ్బేగౌడ, బీజేపీ విశ్వనాథ్‌ సాంకేతికంగా మాత్రమే ఆ పార్టీలో కొనసాగుతున్నారన్నారు. బడ్జెట్‌లో చర్చించి పేదలకు అనుకూలమయ్యే సలహాలు ఇవ్వడం ప్రతిపక్షాల బాధ్యత అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని అప్పులు చేసి దివాళా తీయించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐదు గ్యారెంటీలు ప్రకటిస్తే దివాళా తీస్తుందని ప్రధాని ఆరోపించారన్నారు. 2014-15 నాటికి కేంద్రం చేసిన అప్పులు రూ.5.31 లక్షల కోట్లు కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అప్పులను తొమ్మిదేళ్లలో రూ.17 లక్షల కోట్లకు పెంచారన్నారు. దీన్నిబట్టి 11.8 లక్షల కోట్లు అప్పులు చేశారని, ఇది మోదీ సాధన అని, దేశానికి కానుక అన్నారు. కర్ణాటకలో 2018 వరకు 2.45 లక్షల కోట్లు అప్పుగా ఉండేదని, గత ఐదేళ్లలో 5.71 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. 2013 - 18 మధ్యకాలంలో 1.16 లక్షల కోట్లు అప్పు చేశామని, ఇటీవల బీజేపీ 2.30 లక్షలకోట్లు అప్పు చేసిందన్నారు. అయినా ఎక్కడా అభివృద్ధి అమలు చేయలేదన్నారు. ప్రధానమంత్రి కార్పొరేట్‌ బిజినెస్‌ ట్యాక్స్‌ను 30 నుంచి 22 శాతానికి తగ్గించారని, తద్వారా ఏటా 2 లక్షల కోట్లు కేంద్రానికి నష్టమన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్‌ దిగ్గజాలకు 12 లక్షల కోట్ల రుణమాఫీ చేశారన్నారు. పేదలు, రైతులు, కార్మికులు, రైతు కూలీలకు ఎటువంటి ప్రయోజనం లేదన్నారు.

ధరలు ఆకాశాన్నంటాయి

నిత్యావసర ధరలు పెరిగేందుకు మూలకారణమైన పెట్రోల్‌ ఉత్పత్తులు, వంట గ్యాస్‌ ధరలను అమాంతంగా పెంచారని సీఎం సిద్దరామయ్య అన్నారు. 2011-12లో బ్యారెల్‌ ముడిచమురు 125.45 డాలర్లుగా ఉండేదని, అప్పుడు పెట్రోల్‌ రూ.45గా ఉండేదని 2016లో రూ.46.17 డాలర్లకు తగ్గిందని ప్రస్తుతం 79 డాలర్లుగా ఉందని అయినా పెట్రోల్‌ లీటరు రూ.102గా ఉందన్నారు. ఎక్సైజ్‌ డ్యూటీని భారీగా విధించడంతోనే సామాన్యులకు కష్టం వచ్చిందన్నారు. దేశంలో సెస్సు, సర్‌ చార్జీలు కర్ణాటక నుంచి అత్యధికంగా కేంద్రానికి వెళ్తున్నా రాష్ట్రవాటా ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కర్ణాటకకు నిరంతరంగా అన్యాయం జరుగుతోందన్నారు. మధ్యంతర నివేదిక ప్రకారం రాష్ట్రానికి రూ.5,495 కోట్లు రాకుండా రాష్ట్రం నుంచి ఎంపీగా కొనసాగుతున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ అడ్డుకున్నారని ఆరోపించారు. 25 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా ఒక్కరూ రాష్ట్ర వాటా గురించి పార్లమెంటులో లేవనెత్తలేదని, ప్రధాని వద్ద ప్రస్తావించలేదన్నారు. డబుల్‌ ఇంజన్‌ కాస్త ట్రబుల్‌ ఇంజన్‌గా మారి డబ్బా ఇంజన్‌ అయిందని ఎద్దేవా చేశారు. గ్యారెంటీలతో ప్రతి కుటుంబానికి ఆర్థికంగా చేయూతను ఇస్తున్నామన్నారు. గృహజ్యోతి ద్వారా విద్యుత్‌ బిల్లుల ఆదా, శక్తి గ్యారెంటీ ద్వారా ఉచిత ప్రయాణం, గృహ లక్ష్మి ద్వారా నిత్యావసర వస్తువుల ధరలకు కొంత ఉపశమనం, అన్నభాగ్య ద్వారా 4.42 కోట్ల మంది కడుపు నింపుకొనే సౌలభ్యం కల్పించామన్నారు. గ్యారెంటీలు అమలు చేయడం ద్వారా పేద వర్గాల వద్ద నగదు బదిలీ అవుతుంటుందని, తద్వారా జీడీపీ పెరుగుతుందన్నారు.

By
en-us Political News

  
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.