గ్యాంగ్ రేప్ కేసులో సంచలనాలు!

Publish Date:Feb 11, 2021

Advertisement

హైదరాబాద్ శివారులో బుధవారం సాయంత్రం జరిగిన ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్, సామూహిక అత్యాచారం కేసులో షాకింగ్  నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఆటో ఎక్కిన యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు విషయం తెలియకుండా హత్య చేయాలని భావించారని తెలుస్తోంది. అయితే అప్పటికే పోలీసులు వస్తున్న విషయం తెలయడంతో విద్యార్థినిని వదలి పరారయ్యారని చెబుతున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఓ ముఠా అని, గతంలో మరికొందరిపైనా అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలిందని తెలుస్తోంది.

కీసర మండలం రాంపల్లి చౌరస్తా వద్ద కాలేజీ బస్సు దిగే బాధిత యువతి.. అక్కడి నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలోని ఇంటికి ఆటోలో వెళ్లేది. ఈ క్రమంలో నిందితుడి ఆటోలో పలుమార్లు ఎక్కింది. దీంతో అతడి కన్ను ఆమెపై పడింది. విషయాన్ని తన స్నేహితులైన మిగతా ముగ్గురికి కూడా చెప్పి కిడ్నాప్‌కు పథకం వేశాడు.బుధవారం సాయంత్రం కూడా మామూలుగానే యువతి అతడి ఆటో ఎక్కడంతో కిడ్నాప్‌ పథకం అమలు చేయాలని నిర్ణయించాడు. స్నేహితులకు ఫోన్ చేసి ‘మ్యాటర్ రెడీగా ఉంది’ అని సమాచారం ఇచ్చాడు. బాధితురాలు ఆటో ఎక్కిన తర్వాత అప్పటికే ఉన్న ఇద్దరు మహిళలు, ఓ యువకుడు కొంతదూరం తర్వాత దిగిపోయారు.ఆ తర్వాతి స్టాపులోనే యువతి దిగాల్సి ఉండగా నిందితుడు ఆటోను ఆపకుండా యంనంపేట వైపు వేగంగా పోనిచ్చాడు. దీంతో భయపడిన యువతి తల్లికి ఫోన్ చేసి ఆటో ఆపకుండా ఎటో తీసుకెళ్తున్నాడని, తనకు భయంగా ఉందని చెప్పింది. దీంతో ఆమె బంధువుల సాయంతో సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది.

మరోవైపు యంనంపేట వద్ద ఇద్దరు వ్యక్తులు ఆటో ఎక్కి ఆమెకు చెరోపక్క కూర్చున్నారు. మరో వ్యక్తి ఘట్‌కేసర్ శివారులో వ్యాన్‌తో సిద్ధంగా ఉన్నాడు. ఆటో అక్కడికి చేరుకోగానే బాధిత యువతిని అందులోకి ఎక్కించి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారు. అయితే అప్పటికే పోలీసులు రంగంలోకి దిగారు. అమ్మాయిని ఆటోలో కిడ్నాప్ చేశారని, ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ మైక్‌లో చేస్తున్న అనౌన్స్‌మెంట్ నిందితులకు వినిపించింది. దీంతో దొరికితే ఎన్‌కౌంటర్ చేస్తారని భావించిన నిందితులు యువతిని వ్యాన్ నుంచి కిందికి దించి పక్కనే ఉన్న పొదల్లో పడేసి పరారయ్యారు.సెల్ సిగ్నల్ ఆధారంగా అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గుర్తించిన పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై అత్యాచారం, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. గురువారం ఉదయం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

 విచారణలో మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులందరికీ నేరచరిత్ర ఉందని,  కాలేజీ, ఉద్యోగాలకు ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుంటారని పోలీసులు తెలిపారు. ఓ 15 రోజులపాటు వారిని గమనించిన తర్వాత ప్రణాళిక అమలు చేస్తారని వివరించారు. కిడ్నాప్ చేసిన అనంతరం తమకు సహకరిస్తే హాని చేయకుండా వదిలేస్తామని, లేదంటే చంపేస్తామని బెదిరించి అత్యాచారానికి పాల్పడేవారు. గతంలో మరో నలుగురు మహిళలపైనా అత్యాచారానికి తెగబడినట్టు నిందితులు అంగీకరించారని తెలుస్తోంది.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.