కేసీఆర్ కు వరుస షాకులు! అసలు కారణం ఇదేనట?

Publish Date:Dec 12, 2020

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు షాకుల మీద షాకులు జరుగుతున్నాయి. కొన్ని నెలలుగా పరిపాలనలో ఆయనకు ఏది కలిసి రావడం లేదు. ప్రభుత్వం కొత్తగా తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలన్నిఫెయిలవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెరిగిపోతోంది. మంచి కోసం పోతే తమ కొంప ముంచేలా పథకాలు తయారయ్యాయని అధికార పార్టీ నేతలే చెబుతున్నారు. అటు పార్టీ పరంగానూ గతంలో ఎప్పుడు లేనంతగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వరుస పరాజయాలతో పార్టీలో అలజడి పెరిగిపోతోంది. సొంత గడ్డలోనూ  కేసీఆర్ పై వ్యతిరేకత కనిపించడం కారు పార్టీ నేతలను కలవరపెడుతోంది. 

 

కేసీఆర్ కు, టీఆర్ఎస్ కు వరుసగా తగులుతున్న షాకులపై ఆసక్తి కర చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఆధ్యాత్మిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. భక్త విశ్వాసాలను పాటిస్తూ యాగాలు, హోమాలు ఎక్కువగా చేస్తారు. అయితే ఆయన చేసిన యాగంలో తేడా వల్లే... ఆయనకు గడ్డు కాలం వచ్చిందనే చర్చ పండితుల నుంచి వస్తోంది. 2019 జనవరి 21వ తేదీన తలపెట్టిన చండీయాగం నుంచే కేసీఆర్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయని చెబుతున్నారు. 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు  అనుకున్నదానికంటే ఎక్కువ సీట్లే వచ్చాయి. ఆ సంతోషం, కృతజ్ఞతతోనే  2019 జనవరి 21 నుంచి ఆయన యాగాన్ని నిర్వహించారు. అయితే జనవరి 22వ తేదీన కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కుమారుడు మయాంక్ పెళ్ళి రిసెప్షన్ కార్యక్రమానికి ఢిల్లీకి వెళ్ళారు. ఆ సమయానికి చండీయాగం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీక్ష తీసుకున్న తర్వాత పూర్తిచేయకుండా మధ్యలో ఢిల్లీ వెళ్ళిడం వల్లే ఆయనకు చెడు జరుగుతుందని కొందరు పండితుల మాట.
  

యాగం మొదలుపెట్టిన తర్వాత అది పూర్తిగా ముగిసేంత వరకు ఆ పరిధి దాటి బైటకు వెళ్ళరాదన్నది నియమం. కానీ కేసీఆర్ ఢిల్లీ వరకు విమానంలో వెళ్ళి  వచ్చారు. ఇది యాగ సంప్రదాయానికి విరుద్ధమని  వేద పండితులు చెబుతున్నారు. అప్పటి నుంచే ఆయనకు కాలం కలిసి రావడం లేదని వారు స్పష్టం చేస్తున్నారు.  నిజంగానే కేసీఆర్ కు 2019 జనవరి నుంచి కలిసి రావడం  లేదు. 2019 మేలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో  ఆయన కూతురు కవిత నిజామాబాద్ ఎంపీగా ఓటమి పాలయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లు వస్తాయని చెప్పిన కారు పార్టీ.. అనూహ్యంగా సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఇటీవలే టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలాగా ఉన్న దుబ్బాక అసెంబ్లీ కారు ఫల్టీ కొట్టింది.  జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ  గతంలో కంటే భారీగా నష్టపోయింది టీఆర్ఎస్. 

 

పార్టీ పరంగానే కాక పాలనలోనూ ఏడాదిన్నరగా కేసీఆర్ ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తాయి. అకాల వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోలేదనే విమర్శలు వచ్చాయి. దీంతో రైతు బంధు ఇచ్చినా అన్నదాతల్లో కేసీఆర్ పై వ్యతిరేకత వచ్చింది. గత అక్టోబర్ కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయింది. వందల కోట్ల రూపాయల్లో నష్టం జరిగింది. వరద బాధితులను ఆదుకోవడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. వరద బాధితులకు సాయంగా అందించిన 10 వేల రూపాయల సాయం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో  సర్కార్ కు ప్రతికూలంగా మారింది. కొత్త రెవిన్యూ చట్టం, ఎల్ఆర్ఎస్ స్కీం అమలుతో ప్రభుత్వం ప్రజల్లో విలన్ గా మారిపోయిందనే చర్చ జరుగుతోంది. 

 

మొదటి నుంచి కేసీఆర్‌ ఏ పని తలపెట్టినా పండితుల సలహాలు తీసుకుంటారు. ఆలయాల సందర్శన తర్వాతనే ముందడుగు వేస్తారు. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొన్ని రోజులకే  2015లో ఎర్రవల్లిలోని తన సొంత ఫామ్ హౌజ్‌లో ఆయుత చండీయాగాన్ని నిర్వహించారు. ఆ తర్వాత 2018లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళేముందు అధికారంలోకి మళ్లీ రావాలంటూ రాజశ్యామల యాగాన్ని జరిపించారు. గెలిచిన తర్వాత 2019 జనవరిలోనూ అదే తరహా యాగాన్ని నిర్వహించారు. అయితే  ఆ యాగ సమయంలో చేసిన తప్పిదం వల్లే కేసీఆర్ కు గతంలో ఎప్పుడు లేనంతగా సమస్యలు వచ్చాయని పండితులు పక్కాగా చెబుతున్నారు. మళ్ళీ యాగం చేసి పరిహారం సమర్పించుకుంటే తప్ప కేసీఆర్ కు మంచి రోజులు రావంటున్నారు.

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.