Publish Date:May 21, 2024
సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవ్వడం వల్ల ఓ వ్యక్తి మరణించారు. మరో 30 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న విమానంలో మంగళవారం ఈ ఘటన జరిగినట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంస్థ వెల్లడించింది.
సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం మే 20న మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో బ్రిటన్ రాజధాని లండన్ నుంచి సింగపూర్‌కు బయల్దేరింది. మార్గమధ్యలో ఫ్లైట్ తీవ్ర కుదుపులకు లోనుకావడం వల్ల దాన్ని థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయానికి మళ్లించారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారని సంస్థ వెల్లడించింది. మరో 30 మందికి గాయాలైనట్లు సమాచారం.ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ప్రయాణికులకు అవసరమైన వైద్య సాయం అందించేందుకు థాయ్‌లాండ్ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఓ బృందాన్ని బ్యాంకాక్‌కు పంపుతున్నట్లు తెలిపింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/shock-in-singapore-airlines-planeone-dead-39-176524.html
ఇన్ని వేల కోట్లు పంచిపెట్టినా జనం తనను మోసం చేశారని అంటూ ఒక దశలో జగన్ కన్నీరు పెట్టుకున్నారని కూడా సమాచారం.
రేవ్ పార్టీ ఉచ్చు బిగుస్తోంది. బెంగుళూరు నుంచి తప్పించుకుని వచ్చినట్లు చెబుతున్న పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తల్లి ఆదివారంరాత్రి మృతి చెందింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ ముఖ్య భూమిక వహించారు.
‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు’ ఈ పదాన్ని మళ్ళీ వినడానికి ఇంకా ఎంతో సమయం పట్టదు. ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి హోదా వచ్చేసింది.
చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. నియోజకవర్గ పరిధిలో ఫారం 17ఏ, ఇతర డాక్యుమెంట్లను మళ్లీ స్కృటినీ చేయాలనీ, అలాగే నియోజకవర్గ పరిధిలోని నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఆన సుప్రీం ను ఆశ్రయించారు.
ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది వైసీపీ నాయకులు జైలుకు వెళ్ళడం ఖాయంలా కనిపిస్తోంది. అలా చిప్పకూడు తినే వైసీపీ నాయకులలో మొట్టమొదటి స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి వుండబోతున్నారు.
నాలుగు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గాలలో తెలుగుదేశం వినా మరో జెండా ఎగిరిందే లేదు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ఆ రెండు నియోజకవర్గాలూ తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలుగానే ఉన్నాయి.
అబ్ కీ బార్ 400 బాహర్ అనే నినాదంతో సార్వత్రిక ఎన్నికల బరిలో దిగిన బిజెపి తెలంగాణలో డబుల్ డిజిట్ సాధిస్తుందని వివిధ ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. అయితే కౌంటింగ్ కు 24 గంట ముందు రెండు ప్రముఖ ఎగ్జిట్ పోల్ సర్వేల్లో మాత్రం హైదరాబాద్ లోకసభ బిజెపి కైవసం చేసుకుంటుందని వెల్లడైంది.
పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తున్న జగన్ పార్టీకి సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది.
కొన్ని శక్తులు పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని తపస్సు చేస్తున్నాయి.
వైసీపీ నుంచి అధికార పగ్గాలు చేజారిపోతున్నాయనడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లుగా తన మౌఖిక ఆదేశాలతో పోలీసు శాఖను ఉరుకులు పరుగులు పెట్టించిన సజ్జలపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పు పట్టింది.
కల్వకుంట్ల కవిత ఇప్పుడప్పుడే జైలు నుంచి బయటకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం తీహార్ జైల్లో వున్న కవిత రిమాండ్‌ని జులై 3వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.