రాటుదేలిన షర్మిల రాజకీయం.. ప్రతి అడుగులోనూ అన్న జగన్ కు చెక్!

Publish Date:Nov 6, 2022

Advertisement

ఏదీ ఏమైనా వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు  షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్ టీపీ) పార్టీని స్థాపించి ఆ రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర  ద్వారా సాధించిన గుర్తింపు కంటే.. తెరాస అధినాయకత్వంపై విమర్శలు, కేసీఆర్ కుటుంబ అవినీతిపై చేసి ఫిర్యాదుల ద్వారానే ప్రాచుర్యం పొందారని చెప్పారు. అయితే.. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఆమె ప్రస్థానాన్ని గమనిస్తే ఆమె ప్రతి మాటలోనూ, ప్రతి అడుగులోనే తన తండ్రి రాజశేఖరరెడ్డిని స్ఫురింప చేస్తున్నారన్న చర్చ అయితే రాకీయ వర్గాలలోనూ, జన బాహుల్యంలోనూ జోరుగా సాగుతోంది.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆహార్యాన్ని పుణికి పుచ్చుకోవడమే కాకుండా.. ఆయన ప్రదర్శించిన రాజకీయ చాణక్యాన్ని సైతం ఆమె ప్రదర్శిస్తున్నారన్న భావన ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ వ్యక్తమౌతోంది.   షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో కొత్త పార్టీ స్థాపించి.. పాదయాత్ర ప్రారంభించడం.. అలాగే రైతులు, నిరుద్యోగుల కోసం దీక్షలు చేపట్టడాన్ని తొలుత అంతా  లైట్‌ తీసుకున్నప్పటికీ, ఇటీవల వైయస్ షర్మిల దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో కేసీఆర్ ప్లస్ మెగా కృష్ణారెడ్డిల అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేసి రావడం... ఆ తర్వాత అంటే పక్షం రోజులకే  షర్మిల హస్తినకు పోయి ఇదే అంశంపై ఫిర్యాదు చేయడాన్ని జనం ప్రస్తావిస్తున్నారు.

అలాగే ఢిల్లీ పర్యటనలో భాగంగానే వైయస్ వివేకా హత్య కేసులో సీబీఐకి  షర్మిల స్వయంగా వాంగ్మూలం ఇవ్వడంపై  ఆమె ధైర్యాన్ని, చిత్తశుద్ధని, పట్టుదలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. షర్మిల వాంగ్మూలం ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకం కానుందని.. ఈ నేపథ్యంలో   జగన్ ఫ్యామిలీలో చోటు చేసుకొన్న పరిణామాలను   చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ షర్మిల తరువాత ఏం చేయబోతోందన్న ఆసక్తి కూడా అందరిలో నెలకొంది. షర్మిల తండ్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి... నమ్మితే ప్రాణాలు ఇస్తారని.. అదే తోక జాడిస్తే మాత్రం కత్తిరించేస్తారని..షర్మిల తీరు కూడా  అచ్చు గుద్దినట్లు.. తండ్రి లాగే ఉందన్న మాట ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో వినిపిస్తోంది. 

 జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయకోసం జగనన్న వదిలిన బాణం అంటూ ఆమె పాదయాత్ర చేయడమే కాదు.. బై బై బాబు లాంటి నినాదాలు ఇచ్చిన షర్మిలను ఆ తర్వాత   జగన్.. ముఖ్యమంత్రి అయిన తరువాత ఆమెను దూరం పెట్టడాన్ని వారీ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.  ఇక సొంత బాబాయ్ వివేకా హత్య కేసు దర్యాప్తు నీరు గార్చే ప్రయత్నం సోదరుడు జగన్ చేస్తున్నారన్న విషయంపై   షర్మిల వాంగ్మూలం ఇవ్వడం నిజంగా సాహసమేననీ, అదే సమయంలో వాస్తవాలు వెలికిరావాలన్న ఆమె పట్టుదలకు నిదర్శనమని అంటున్నారు. వైఎస్ వివేకా కేసులో సీబీఐకి షర్మిల వాంగ్మూలం ఇవ్వడం జగన్ గట్టి దెబ్బేనని కడప జిల్లా వాసులు పేర్కొంటున్నారు. ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్లు.. రాబోయే రోజుల్లో ఈ ఇంటి గుట్టు తాడేపల్లి ప్యాలెస్‌కు చేటు అన్నట్లుగా ఉండవచ్చునని జిల్లా వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మటికి మహానేత రాజకీయ చతురత అని చెబుతున్నారు. దీంతో సోదరుడిని సీఎం పీఠం ఎక్కించడమే కాదు.. అవసరమైతే ఆ పీఠం మీద నుంచి కిందకు దింపడం కూడా..  షర్మిలకు తెలుసుననే గుసగుసలు ఇప్పటికే కడప జిల్లాలో వివవస్తున్నాయి.  

మరోవైపు తెలంగాణలో వైయస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైయస్ షర్మిలలోని పోరాట పటిమను.. పట్టుదలను ఈ సందర్భంగా ఆమె తల్లి వైయస్ విజయమ్మ గుర్తు చేసిన విషయాన్ని సైతం ఉమ్మడి కడప జిల్లా వాసులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 

గతేడాది జులై 8న వైయస్ఆర్ తెలంగాణ పార్టీని వైయస్ షర్మిల స్థాపించి.. అదే ఏడాది అక్టోబర్ 20వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి వైయస్ షర్మిల తన పాదయాత్రను ప్రారంభించారు. కానీ వైయస్ షర్మిల పాదయాత్రకు ప్రజల్లో మైలేజ్ రావడం లేదని.. ప్రజల్లో ఆమెకు అదరణ కరువైందనే ఓ చర్చ అయితే నిన్న మొన్నటి వరకు తెలంగాణ సమాజంలో కొనసాగింది. 

కానీ ప్రస్తుతం వైయస్ షర్మిల పాదయాత్రే కాదు.. ఢిల్లీ యాత్రను సైతం తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం చాలా ఆసక్తిగా గమనిస్తున్నారనే వారు పేర్కొంటున్నారు. ఏదీ ఏమైనా మహానేత తనయగా.. షర్మిల తన రాజకీయాన్ని మరింత పదును పెడుతోందని.. అందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని ఉమ్మడి కడప జిల్లా వాసులు చెబుతున్నారు. అలాగే కాళేశ్వరం అవినీతిపై ఫిర్యాదు నుంచి వైఎస్ వివేకా హత్య కేసులో వాంగ్మూలం వరకూ ఆమె వేస్తున్న అడుగులు జగన్ కు చెక్ పెట్టేవిగా ఉన్నాయని కూడా అంటున్నారు. అన్నిటికీ మించి హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నిర్వహిస్తున్న టాక్ షోకు ఆమె హాజరు కావడానికి అంగీకరించడం అంటే జగన్ తో అమీతుమీ తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.