రాను రానంటూనే షర్మిల..?

Publish Date:Jul 3, 2023

Advertisement

షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక విషయంలో చాలా క్లియర్ గా ఉన్నారు.  నాలుగేళ్ల పాటు వైఎస్సార్ సీపీ కోసం, అన్న జగన్ వదిలిన బాణంగా ఏపీలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఒక విధంగా అప్పట్లో జగన్ అరెస్టయిన సమయంలో పార్టీ పతనం కాకుండా షర్మిల నిలబెట్టారనే చెప్పాలి. అయితే ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత షర్మిలను ఆయన కూరలో కరివేపాకులా తీసేశారు. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎటువంటి ప్రాధాన్యతా ఇవ్వకుండా దూరం పెట్టారు. దీంతో షర్మిల ఏపీని వదిలి..  తెలంగాణలో తండ్రిపేరిట వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి రాజకీయంగా బిజీ అవ్వడానికి ప్రయత్నించారు.

ఆ క్రమంలో ఆమె సుదీర్ఘ పాదయాత్ర చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ పై, కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక విధంగా చెప్పాలంటే.. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ను ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ ల కంటే తీవ్రంగా దుమ్మెత్తి పోశారు.  అయితే ఆమె తెలంగాణలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ ఎదురౌతున్న ప్రశ్న ఏపీని వదిలి తెలంగాణ రాజకీయాలలోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? అన్నదే. 

జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో విభేదించి  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన సమయంలో షర్మిల అన్నకు అండగా ఉన్నారు. అక్రమాస్తుల కేసులో  జగన్ రెడ్డి జైలుకు వెళ్ళినప్పుడు... ఆమె ‘నేను జగనన్న వదిలిన బాణం’ అంటూ మూడు వేల కిలోమీటర్ల పాద యాత్ర చేశారు. వైసీపీని బతికించారు. అయితే, ఏపీలో  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న వదిలిన బాణాన్ని జగనన్న వదిలేశారో .. ఆమే జగనన్నను వదిలేశారో తెలియదు, కానీ, పుట్టింటిని వదిలి మెట్టి నింటికి చేరుకున్నారు. తెలంగాణలో వైఎస్సార్ జెండా ఎగరేశారు.అప్పటి నుంచి ఆమె తెలంగాణ రాజకీయాల్లో,ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసేఆర్ కుటుంబ పాలనకు వ్యతిరకంగా ప్రత్యేక పంథాలో పోరాటం సాగిస్తున్నారు.పాదయాత్రలు చేస్తున్నారు. 

అయితే, ఇప్పుడు షర్మిల త్వరలోనే, వైఎస్సారు టీపీని  కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేస్తారనే  ప్రచారం జోరుగా సాగుతోంది.   ఆమె ఖండించినా ఆ ప్రచారం ఆగడం లేదు.  అసలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్న ప్రచారం కర్నాటకలో కాంగ్రెస్ ఘన విజయం తరువాత నుంచే ప్రారంభమైంది. అందుకు ఆమె ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను స్వల్ప వ్యవధిలో మూడు సార్లు కలవడంతో ఆమె రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ వైపు అన్న ప్రచారం జోరందుకుంది.  కాంగ్రెస్ కు కూడా వైఎస్సార్ బ్రాండ్ రూపంలో షర్మిలను చేర్చుకునేందుకు, ఆమెకు పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే పార్టీకి ఆమె సేవలు తెలంగాణలో అవసరం లేదన్న విషయంలో కాంగ్రెస్ స్పష్టంగా  ఉంది. ఇక్కడే షర్మిల పార్టీ విలీనం విషయంలో జాప్యం జరుగుతోంది.

ఆమె ఏ కారణం చేత ఏపీ వదిలి వచ్చేసినా.. ఇప్పటికీ ఆమె ఏపీలో అన్న జగన్ కు ఎదురు వెళ్లేందుకు సుముఖంగా లేరు. అందుకే తాను కాంగ్రెస్ గూటికి చేరతాను కానీ, తన కార్యక్షేత్రం మాత్రం తెలంగాణే కావాలని అంటున్నారు. ఈ విషయంలో ఆమె ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లైన జానా రెడ్డి వంటి వారిని కలిసి చర్చించారు. అయితే టీపీసీసీ చీఫ్ మాత్రం ఆమె తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో వేలు పెట్టడానికి కూడా అంగీకరించేది లేదంటున్నారు. అదే సమయంలో బట్టి విక్రమార్క వంటి నేతలు మాత్రం బయటి పార్టీలలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోసిన వారు ఇప్పుడు పార్టీలో ఉండగా లేనిది షర్మిల వస్తే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. కాగా  కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం వైఎస్ బ్రాండ్ తెలంగాణలో పార్టీకి పెద్దగా ప్రయోజనకరం కాదనీ, షర్మిల సేవలు ఏపీలో అయితే అక్కడ పార్టీ బలోపేతమయ్యే అవకాశాలున్నాయని భావిస్తోంది.

ఈ నేపథ్యంలో వైఎస్సార్ ఆత్మగా అందరూ పేర్కొనే  కేవీపీ రామచంద్రరావు షర్మిల కాంగ్రెస్ లో చేరికపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ గూటికి చేరితే షర్మిలకు కర్నాటక నుంచి రాజ్యసభ సభ్యత్వం ఖాయమని చెబుతున్నారు. అంతా సరే కానీ షర్మిల ఏపీలో కాంగ్రెస్ ప్రచార సారథిగా కీలక బాధ్యతలు చేపట్టాలన్న కాంగ్రెస్ కండీషన్ కు ఆమె అంగీకరిస్తారా? తెలంగాణను వీడనంటూ షర్మిల కండీషన్ ను కాంగ్రెస్ హై కమాండ్ అంగీకరిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. 

By
en-us Political News

  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.