వైఎస్ ది హత్య.. నా ప్రాణాలకూ ముప్పు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

Publish Date:Sep 18, 2022

Advertisement

వైఎస్ షర్మిల దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తెగా, ఏపీ సీఎం జగన్ సోదరిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఆమెది పరిచయం అక్కర్లేని పేరు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలు పాలైన సందర్భంగా జగనన్న విడిచిన బాణాన్ని అంటూ ఆమె చేసిన పాదయాత్ర, ఆ సందర్భంగా ఆమె ప్రసంగాలూ అప్పట్లో ప్రజలను విపరీతంగా ఆకర్షించాయి, ఆకట్టుకున్నాయి.

ఏపీలో 2019 ఎన్నికలలో వైసీసీ విజయం సాధించి అధికారంలోకి రావడానికి షర్మిల ప్రచారం కూడా ఓ కారణం అని అనడానికి సందేహించాల్సిన అవసరం లేదు. అయితే ఆ తరువాత కారణా లేమైనా ఆమెకు ఏపీ సీఎం జగన్ కూ మధ్య దూరం పెరిగింది. దీంతో ఆమె ఆంధ్రను వదిలేసి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ సొంత కుంపటి పెట్టుకున్నారు.

ప్రజా సమస్యలపై  నిరంతర యాత్రలలో ఆమె జనం మధ్యే ఉంటున్నారని చెప్పాలి. అయితే తెలంగాణలో ఆమె యాత్రను అసలెవరైనా పట్టించుకుంటున్నారా? అంటే అనుమానమే. తీవ్ర పదజాలంతో ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులపై చేస్తున్న విమర్శలకు ఎవరూ స్పందిస్తున్న దాఖలాలు లేవు. ఆమెపై చర్యలు తీసకోవాలంటూ మంత్రులు తెలంగాణ స్పీకర్ కు ఫిర్యాదు చేసినా అదేమంత పెద్ద విషయంగా ప్రజలెవరూ భావించలేదు.

అయితే ఇప్పడు ఆమె గురించి ఈ ప్రస్తావన ఎందుకంటే..తాజాగా ఆమె తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత కాలం మౌనంగా ఉండి ఇప్పుడు తన తండ్రి వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కాదని బాంబు పేల్చారు.  హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించిన మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిది  ప్రమాదవశాత్తూ జరిగిన మరణం కాదంటూ ఆయన కుమార్తె, వైఎస్సార్ టీపీ అదినేత్రి చేసిన వ్యాఖ్యలు ఒక్క సారిగా సంచలనం రేపాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి, జగన్ ముఖ్యమంత్రి కావడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం, తద్వారా వచ్చిన సానుభూతే కారణమని పరిశీలకులు అంటారు.

ఇప్పుడు అన్నతో విభేదించి తెలంగాణ రాజకీయాల్లో ఒంటరి పోరు సాగిస్తున్న షర్మిల తన తండ్రి మరణం అనుమానాస్పద స్థితిలో సంభవించిందంటూ చేసిన వ్యాఖ్యలు మామూలుగా తీసుకోవడానికి వీల్లేదు. కేవలం తన సోదరుడిలా తన తండ్రి మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించు కోవాలని ఆమె భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఏపీలో తన సోదరుడికి కలిసి వచ్చిన ఈ సెంటిమెంట్ తెలంగాణలో తనకు కలిసి వస్తుందని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. వైఎస్ హెలికాప్టర్ వెనుక కుట్ర ఉందని చెప్పిన షర్మిల తన ప్రాణాలకూ ముప్పు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.  అయితే   వైఎస్ మరణాన్ని రాజకీయంగా వాడుకోవడం ఆయన పిల్లలైన జగన్, షర్మిలలకు ఇదే మొదటి సారి కాదు.  

గతంలో   ఏపీలో ప్రచార సమయంలో జగన్, షర్మిలలు రిలయన్స్ పై ఇటువంటి  ఆరోపణలే చేశాడు. అప్పట్లో రిలయన్స్ షోరూలంపై దాడులు కూడా జరిగిన సంగతి విదితమే. ఇంత కాలం తరువాత ఇప్పుడు ఇప్పుడు మళ్లీ షర్మిల మళ్లీ తన తండ్రి మరణం వెనుక కుట్ర.. ఆయనది హత్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడానికి ఆమె పార్టీని కానీ, ఆమె యాత్రను కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడమే కారణమని అంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 2 వేల కిలోమీటర్లు నడిచినా (పాదయాత్ర) ఫలితం లేకపోవడం.. ప్రజలే కాదు.. పార్టీలూ పట్టించుకోకపోవడం టీఆర్ఎస్ అధినేత, నేతలను తీవ్ర పదజాలంతో విమర్శించినా వారి నుంచి స్పందన లేకపోవడంతో    షర్మిల సంచలనం కోసం, గుర్తింపు కోసం వైఎస్ మరణం అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారంటున్నారు.  వైఎస్ఆర్ ను చంపారని.. తనను చంపడానికి కుట్ర చేస్తున్నారని  ఆరోపణలు చేశారు.   

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.