చైతన్య కాలేజీ విషయంలో ఒకలా.. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో మరోలా!

Publish Date:Sep 18, 2022

Advertisement

 ఏపీలో జగన్ సర్కార్ ఇష్టారాజ్యం నడుస్తోంది. చట్టాలు, నిబంధనలనూ పట్టించుకోకుండా అసమదీయుల విషయంలో ఒకలా, ఇతరుల విషయంలో మరోకలా వ్యవహరించడం పరిపాటి అయిపోయింది. వడ్డించే వాడు మనవాడైతే  పంక్తిలో చివర కూర్చున్నా ఫరవాలేదు అన్నది నానుడి.. జగన్ పాలనలో దానిని మార్చి నేరం చేసిన వాడు మనవాడైతే ఫర్లేదు వదిలేయండి అన్నట్లుగా మార్చుకోవలసిన అవసరం కనబడుతోంది.

విజయవాడ చైతన్య కాలేజీలో ఓ టీచర్ విద్యార్థిని కొడుతున్ వీడియో ఒకటి బయటపడగానే జగన్ సర్కార్ ఆఘమేఘాలపై స్పందించింది. కాలేజీ గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. ఐదు రోజులలో వివరణ ఇవ్వాలని నోటీసులు పంపించింది. దాడి చేసిన లెక్చరర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని ఇంటర్‌బోర్డు ప్రకటించేసింది. విద్యార్థిని దారుణంగా కొట్టిన లెచ్చరర్ పై చర్యలు తీసుకోవాలన్న జగన్ సర్కార్ ను, ఆ కాలేజీ గుర్తింపు రద్దు చేయడానికైనా వెనుకాడని ప్రభుత్వ తీరును కచ్చితంగా స్వాగతించాల్సిందే. అదే సమయంలో అసభ్య వీడియోలో అడ్డంగా దొరికిపోయిన వైసీసీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో సర్కార్ ఈ వేగంతో ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

చర్యల సంగతి దేముడెరుగు.. అసలు ఆయనను సమర్థిస్తూ వైసీపీ రంగంలోకి దిగి.. ఆరోపణలు చేస్తున్న వారిపై ఎదురుదాడికి పాల్పడడమేమిటని నిలదీస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇంతకీ అసలు విషయమేమిటంటే.. సదరు కాలేజీలో లెచ్చర్ చేతిలో దెబ్బలు తిన్న విద్యార్థి కానీ, అతడి తల్లిదండ్రులు కానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.. కనీసం ఇంటర్ బోర్డు దృష్టికీ తీసుకు వెళ్లలేదు. కానీ వీడియో చూసి సర్కార్ కదిలిపోయింది. ఆ వీడియో ఫేకా, ఒరిజనలా అన్న మీమాంసే రాలేదు. వీడియో వైరల్ కాగానే చర్యలకు ఉపక్రమించేసింది. ఆ వేగాన్నికచ్చితంగా అభినందించాల్సిందే. కానీ అదే సమయంలో గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో విషయంలో జగన్ సర్కార్ లో ఆ వేగం ఎందుకు కనిపించలేదు అని సామాజిక మాధ్యమం వేదికగడా నెటిజన్లు నిలదీస్తున్నారు. గోరంట్ల మాధవ్ ఏమీ మామూలు మనిషి కారు. ఆయన ఓ ఎంపీ.. అందులోనూ అధికార పార్టీ ఎంపీ. అటువంటి వ్యక్తి సభ్య సమాజం ఏహ్యతతో ఉమ్మేసే లాంటి చర్యకు పాల్పడినప్పుడు... చర్య తీసుకోవలసింది పోయి.. ఆయనకు మద్దతుగా వైసీపీ నేతలు నిస్సిగ్గుగా మీడియా ఎదుట మాట్లాడడమేమిటి. పైగా గోరంట్ల మాధవ్ వీడియో మార్ఫింగ్ అని ఎవరూ అనే ధైర్యం చేయడం లేదు.

తెలుగుదేశం నాయకులు అయితే అది ఒరిజనల్ వీడియోయే అని అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును కూడా బయట పెట్టారు. ఎలాంటి ఫిర్యాదు, క్రాస్ చెకింగ్ లేకుండా విద్యార్థిని కొట్టాడన్న వీడియో ఆధారంగానే, విద్యారంగంపై  అచంచల విశ్వాసం, గౌరవంతో ఆ కేసును సుమోటోగా తీసుకుని, తానే స్వయంగా చర్యలకు దిగిన జగన్ సర్కార్.. తమ పార్టీ ఎంపీ అసభ్య వీడియో విషయంలో చర్యలు తీసుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, చట్టాన్ని లెక్కచేయకుండా మరీ తనంతట తాను చర్యల కొరడా ఝళిపించిన జగన్ సర్కారు  మిగిలిన కేసులలో ముఖ్యంగా గోరంట్ల మాధవ్ అసభ్య వీడియో విషయంలో ఎందుకు ఇంత చైతన్యరహితంగా ఉందని నెటిజన్లు నిలదీస్తున్నారు.

వైసీపీ ఎంపీ మాధవ్  అసభ్య వీడియోకు సంబంధించి మహిళల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తినా మహిళా నేతలు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసినా ఆయనపై జగన్ సర్కార్ చర్యలు తీసుకోలేదు సరికదా.. మాధవ్ తరఫు వారు ఇచ్చిన ఫిర్యాదుపైనే మాధవ్ ను విమర్శించిన వారిపై కేసులు పెట్టారు. మరి మాధవ్ పై ఎందుకు కేసు పెట్టలేదంటే.. ఆయనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని బదులిస్తున్నారు.  మరి చైతన్య కాలేజీ సంఘటనపై ఫిర్యాదు చేసిన వారెవరు? ఎవరూ లేకపోతే మరి ఫిర్యాదు లేకుండా ఎందుకు కేసులు పెట్టి నోటీసులు జారీ చేశారు అని సామాన్య జనం నిలదీస్తున్నారు.  

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.