ఈ రక్షాబంధనం.. ఈ ఇద్దరికీ శిక్షాబంధనం!

Publish Date:Aug 19, 2024

Advertisement

సోమవారం నాడు దేశమంతటా రక్షాబంధన వేడుకలు ఆనందోత్సాహాలతో జరుగుతున్నాయి. సోదర, సోదరి ప్రేమకు, అనురాగానికి, ఆప్యాయతలకు తార్కాణంగా నిలిచే ఈ రక్షాబంధనం రోజున సోదరీమణులు సోదరులకు రాఖీ కట్టడం, సోదరులు బహుమతులు ఇచ్చి వారిని సంతోషపరచడం సంప్రదాయం. అసలు రక్షాబంధనం అంటే, సోదరుడి చేతికి రక్ష కట్టే సోదరికి, ఆ సోదరుడు రక్షగా నిలుస్తాడు అనే సందేశాన్ని ఇవ్వడం. ఈరోజు దేశంలో చాలామందికి రక్షాబంధనం.. కానీ ముఖ్యంగా ఇద్దరికి మాత్రం ఈరోజు ‘శిక్షాబంధనం’. ఆ ఇద్దరు ఎవరో కాదు... ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్.

జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల, కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత ప్రతి ఏడాదీ తమ అన్నలకు రాఖీలు కట్టేవారు. ఆ ఫొటోలను మీడియాకి విడుదల చేసేవారు. ఆ ఫొటోల్లో అన్నాచెల్లెళ్ళ అనుబంధం చూసి అందరికీ కడుపు నిండిపోయేది. ‘‘ఒక కొమ్మకు పూచిన పువ్వులం.. అనురాగం మనదేలే! ఒక గూటికి చెందిన గువ్వలం మమకారం మనదేలే... అన్నయ్యా.. చెల్లెమ్మా...’’ అనే పాట అందరి చెవుల్లోనూ మార్మోగేది. కానీ ఈ ఏడాది మాత్రం ఈ రెండు కాంపౌండ్లలో అలాంటి సందడి ఏమీ వినిపించని పరిస్థితి.

ఈ ఏడాది షర్మిల తన సోదరుడు జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టే పరిస్థితి లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవర్ని అడిగినా చెబుతారు. జగన్మోహన్‌డ్డి రాష్ట్రంలో  మహిళలందర్నీ నా అక్కచెల్లెళ్ళు అంటారుగానీ, సొంత చెల్లి చేత మాత్రం ఛీ కొట్టించుకున్నారు. మొన్నటి ఎన్నికలలో జగన్ ఓడిపోవడానికి గల అనేక కారణాలలో చెల్లెమ్మ షర్మిలమ్మ ఫ్యాక్టర్ కూడా ఒకటి. ఆస్తి గొడవలు, బాబాయ్ హత్య, రాజకీయంగా ఎంతో ఉపయోగపడిన షర్మిలను పక్కన పెట్టడం.. ఇవన్నీ అన్నాచెల్లెళ్ళ మధ్య బంధాన్ని తెంచేశాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అందరికంటే పెద్ద శత్రువులైన అన్నాచెల్లెళ్ళు ఎవరయ్యా అంటే వినిపించే పేర్లు జగన్, షర్మిల. 

ముఖ్యమంత్రిగా వున్నంతకాలం చెల్లెలి విలువ తెలియని జగన్ ఆమెని ఎంతమాత్రం లెక్కచేయలేదు. ఓడిపోయిన తర్వాత మాత్రం చెల్లెలి మీద జగన్‌కి ఆప్యాయత, అనురాగాలు ముంచుకొచ్చాయి. షర్మిల తనకు దూరంగా వుంటే వచ్చే ఎన్నికలలో కూడా డేంజరేనని అర్థం చేసుకున్న జగన్, ఆమెతో అనుబంధాన్ని మళ్ళీ పెంచుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. కానీ, షర్మిల జగన్‌ని ఎంతమాత్రం నమ్మడం లేదు. అన్నయ్యకి దగ్గరయ్యే ఆలోచన చేయడం లేదు. గతంలో ఎన్నోసార్లు షర్మిలతో సఖ్యత కోసం ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిన జగన్, రాఖీ పండుగ సందర్భంగా మరోసారి తన తల్లి విజయమ్మతో రాయబారం నడిపినట్టు తెలుస్తోంది. చెల్లి ఈసారి తనకు రాఖీ కడితే, మళ్ళీ గతంలో లాగా వుందాం. ఆమె డిమాండ్లను నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను అంటూ  విజయమ్మతో షర్మిలమ్మకి జగన్ రాయబారం పంపినట్టు తెలుస్తోంది. అయితే, ఈసారి కూడా షర్మిల రాజీ ప్రతిపాదనను తిరస్కరించినట్టు సమాచారం. రక్షాబంధనాన్ని తిరస్కరించడం ద్వారా షర్మిల జగన్‌కి తగిన శిక్ష విధించిందని భావించవచ్చు.

ఇక మరో అన్నాచెల్లెళ్ళు కేటీఆర్, కల్వకుంట్ల కవిత. పాపం ఈ ఏడాది కవితకు ‘రక్షాబంధన’ కాకుండా ‘శిక్షాబంధన్’ అయి కూర్చుంది. ఆమె ఈ ఏడాది పుట్టినరోజు చేసుకున్న మర్నాడే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేసి తీహార్ జైల్లో వేశారు. ఆమె ప్రతిసారీ బెయిల్ అప్లికేషన్ పెట్టుకోవడం.. అది రిజెక్టు కావడం టీవీ సీరియల్ తరహాలో కొనసాగుతోంది. తీహార్ జైల్లో అంతులేని ఆవేదనలో వున్న కవిత ఈసారి రాఖీ పండుగ చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్‌ని రాఖీ పండుగ కోసం జైలుకు రావొద్దని కూడా చెప్పినట్టు సమాచారం. కవిత ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక జైల్లో వున్నానన్న బాధతోపాటు, తనను త్వరగా విడుదల చేయించడం కోసం తన అన్న కేటీఆర్ పెద్దగా కృషి చేయడం లేదన్న ఆవేదన కూడా కారణమని తెలుస్తోంది. 

By
en-us Political News

  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.