ఈనెల 12న ఢిల్లీకి షర్మిల.. విలీనం ఖాయమేనా?

Publish Date:Aug 9, 2023

Advertisement

మాజీ సీఎం వైఎస్ కుమార్తె, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ తో కలవబోతున్నారా? షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారా? అంటే తెలంగాణ రాజకీయ వర్గాలలో అవునని గట్టిగానే వినిపిస్తుంది.  షర్మిలను తమతో కలుపుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నదని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షర్మిల పార్టీ విలీనంపై ఆ మధ్య పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పుడెప్పుడో షర్మిల పార్టీ విలీనంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రాయబారం నడుపుతున్నట్లు చెప్పుకున్నారు. షర్మిల తన పార్టీని విలీనం చేస్తే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఎందుకో అది అప్పట్లో ప్రచారంగానే ఉండిపోయింది. జులైలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున సోనియా, రాహుల్ గాంధీలు కడప జిల్లాలోని ఇడుపులపాయకు వస్తారని.. అక్కడ వారు విజయమ్మతో భేటీ కానున్నట్లు కూడా కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరిగింది. అయితే, అది కూడా వర్క్ అవుట్ కాలేదు. 

కాగా, ఈసారి షర్మిల పార్టీ విలీనానికి ముహూర్తం ఖారైరైందంటూ మరో సారి రాజకీయవర్గాలలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ముందుగా షర్మిల సోనియా గాంధీతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. ఈనెల 12వ తేదీన షర్మిల ఢిల్లీకి వెళ్ళి పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో భేటీ అవుతారని చెబుతున్నారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపి విలీనం గురించి ప్రకటన వెలువడే  అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. కొంతకాలంగా షర్మిల పార్టీ విలీనం అవుతుందా? లేక పొత్తులతో ముందుకు వెళ్తారా అనే చర్చ అయితే విస్తృతంగా సాగుతుంది. మొదట్లో షర్మిల పొత్తుకు మొగ్గు చూపితే కాంగ్రెస్ నేతలు విలీనానికే పట్టుబట్టారు. అయితే రెండు పద్దతుల్లో లాభనష్టాలను బేరీజు వేసుకున్న తరువాత   షర్మిల కూడా విలీనానికే సిద్ధపడ్డారని కాంగ్రెస్, వైఎస్సార్టీపీ వర్గాలు చెబుతున్నాయి. 

షర్మిల తరపున కాంగ్రెస్ పెద్దలతో తెలంగాణ నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,   కర్ణాటక నుండి డీకే శివకుమార్ మాట్లాడుతుండగా.. ఈ భేటీతో ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉందని పరిశీలకులు చెబుతున్నారు. కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనం చేసేయాలని.. అందుకు ప్రతిఫలంగా ఆమెని రాజ్యసభకి పంపించడం.. కావాలంటే ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు కూడా షర్మిలకే అప్పగించడం వంటి ప్రతిపాదనలు కాంగ్రెస్ నుంచి వస్తున్నాయని అంటున్నారు.   కాంగ్రెస్ తో పొత్తుకి వస్తామని.. అది కూడా కేవలం తెలంగాణలోనే తన ప్రమేయం ఉంటుందని షర్మిల చెబుతున్నారని అంటున్నారు.   మరి ఈ రెంటిలో  ఏది ఫైనల్ అవుతుంది? కాంగ్రెస్ షర్మిలను విలీనానికి ఒప్పించగలుగుతుందా? ఒకవేళ షర్మిల ఒకే అంటే ఆమె ఏపీకి వెళ్తారా.. తెలంగాణలోనే ఉంటారా అన్నది ఈ భేటీతో తేలే అవకాశం కనిపిస్తుంది.

 నిజానికి షర్మిలను ఏపీ అధ్యక్షురాలిగా చేసి పార్టీ పగ్గాలను అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అలాగే ఆమెకు ఏపీ పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని నమ్ముతోంది. అయితే అందుకు షర్మిల అంగీకరించలేదనీ, తాను తెలంగాణకే పరిమితమౌతానని భీష్మించారనీ గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.   తన రాజకీయం ఇక తెలంగాణలో అంటూ షర్మిలనే స్వయంగా చెప్పిన సంగతి విదితమే.  ఈ నేపథ్యంలో మరో మూడు రోజులలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో షర్మిల భేటీ కానున్నట్లు  వస్తున్న వార్తలతో వైఎస్సార్టీపీ, కాంగ్రెస్ ల మద్య విలీనంపై ఒక అవగాహన కుదిరిందనే భావించాల్సి ఉంటుంది. కాగా, తెలంగాణ కాంగ్రెస్ లో ఒక వర్గం షర్మిల రాకను ఆహ్వానిస్తుంటే మరొక వర్గం ఆమెని ఏపీకి వెళ్లి రాజకీయం చేసుకోమని బహిరంగంగానే చెప్తున్నారు. ఇక పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఒక సందర్భంలో తాను ఉన్నంత వరకూ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాలలో షర్మిల వేలు కూడా పెట్టలేరని అన్నారు. ఆమె ఏపీలో రాజకీయం చేస్తే తెలంగాణ పీసీసీ అధినేతగా తాను ఆమెతో చర్చలు జరుపుతానని అన్నారు.

మరి ఇప్పుడు సోనియా గాంధీతో షర్మిల భేటీ అనంతరం షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం, ఆమె పార్టీలో చేపట్టబోయే బాధ్యతలపై స్పష్టత వస్తుందని అంటున్నారు. అన్నిటికీ మించి షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడం ద్వారా వైసీపీని దెబ్బతీయాలన్నది కాంగ్రెస్ హై కమాండ్ ఉద్దేశంగా చెబుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి జగన్ రాజకీయమే కారణమని కాంగ్రెస్ అగ్రనాయకత్వం గట్టిగా నమ్ముతోంది. షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగిస్తే జగన్ కు అది కచ్చితంగా ప్రతికూలంగా మారి వైసీపీకి పూడ్చుకోలేని నష్టం చేకూరుస్తుందని కూడా భావిస్తోంది. అదే సమయంలో షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే పరోక్షంగా తెలుగుదేశం కు ప్రయోజనం చేకూరుతుందని, తద్వారా  జగన్ కు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్న బీజేపీని  కూడా దెబ్బతీసినట్లు అవుతుందనీ కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానంతో షర్మిల బేటీ ఔట్ కమ్ ఎలా ఉంటుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి నెలకొని ఉంది. 

By
en-us Political News

  
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.