జ‌గ‌న్‌కు ఎక్కుపెట్టిన బాణమా.. జగన్ వదిలిన బాణమా!?

Publish Date:Sep 5, 2023

Advertisement

వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల తన వైఎస్ఆర్టీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం ఖాయమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షర్మిల ఏపీకి వెళ్తారా?, తెలంగాణలోనే రాజకీయం చేస్తారా? తెలంగాణలోనే షర్మిల రాజకీయాలంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒప్పుకుంటారా? అసలు షర్మిల అన్నతో విభేదిస్తే పార్టీ పెట్టాల్సింది ఏపీలోనే కదా.. మరి తెలంగాణ పార్టీ ఎందుకు పెట్టారు? ఇప్పుడు తెలంగాణలో ఆమెకి ప్రోత్సాహకం, ఆదరణ లేక కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నప్పుడు మళ్ళీ ఆమె తెలంగాణ రాజకీయాలలోనే ఉండడం ఎందుకు? ఏపీకి చెందిన వైఎస్ఆర్ కుమార్తె, ఏపీ సీఎంకు సొంత సోదరి తెలంగాణ రాజకీయాలలోనే ఉండాలని పట్టుబట్టడం వెనక మతలబు ఏంటి? కాంగ్రెస్ పెద్దలు ఏపీకి వెళ్ళమంటే షర్మిల ఎందుకు ఇష్టపడడం లేదు? షర్మిల ఏపీలోకి వద్దని వైసీపీ పెద్దలే బెదిరిస్తున్నారా? లేక విభేధాలున్నా అన్న మీద మమకారంతోనే షర్మిల ఏపీకి వెళ్లేందుకు ఇష్టపడడం లేదా? గత మూడు నెలల నుండి ఇలా ఎన్నో విశ్లేషణలు సాగిపోతున్న సంగతి తెలిసిందే.

షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం ఖరారు కాగా ప్రస్తుతానికి అయితే దాదాపుగా ఆమె తెలంగాణ రాజకీయలకి పరిమితం కానున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో కర్ణాటక నుండి షర్మిలను రాజ్యసభకు పంపడం కూడా ఖాయమేనని రాజకీయ వర్గాలు బలంగా చెప్తున్నాయి. అయితే, ఆమె ఏపీకి వెళ్ళమన్నా వెళ్లకుండా.. కాంగ్రెస్ లో విలీనానికి మొగ్గు చూపడం వెనక ఇప్పుడు కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. షర్మిల కాంగ్రెస్ లోకి చేరి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకుంటే వైసీపీకి భారీ నష్టం తప్పదని ఇప్పటి వరకూ విశ్లేషణలు సాగిన సంగతి తెలిసిందే. షర్మిల కాంగ్రెస్ లో ఉంటే వైసీపీలోని పాత కాంగ్రెస్ నేతలు కొందరు తిరిగి సొంత గూటికి వస్తారని, వైసీపీ క్యాడర్ లో అసంతృప్తులు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని.. తద్వారా ఏపీలో వైసీపీ ఐదు నుండి పది శాతం ఓటు బ్యాంకు నష్టపోవాల్సి వస్తుందని అంచనా విశ్లేషణలు సాగాయి.

కాగా, ఇప్పుడు అసలు షర్మిల జగనన్న వదిలిన బాణంగానే కాంగ్రెస్ లోకి చేరారా.. అన్నకు మేలు చేసేందుకే షర్మిల కాంగ్రెస్ గూటికి వెళ్తున్నారా? వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్న ఓటర్లు ప్రతిపక్షాల వైపు వెళ్లకుండా తన వైపుకు తిప్పుకోనేందుకే షర్మిల కాంగ్రెస్ పల్లకి ఎత్తుకున్నారా అనే అనుమానాలు మొదలవుతున్నాయి. అన్నతో విభేదాలున్నాయని, అందుకే షర్మిల కొత్త పార్టీ పెట్టుకున్నారని అందరూ చెప్పుకొన్నదే. తల్లి విజయమ్మ కూడా కుమారుడు జగన్ చేసిన అన్యాయాన్ని సహించలేకనే వైసీపీకి రాజీనామా చేసి షర్మిలతో ఉంటున్నారని కూడా రాజకీయ వర్గాలలో పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఇంత జరుగుతున్నా షర్మిల ఇప్పటి వరకు అన్న జగన్ ను ఒక్క మాట అన్న దాఖలాలు లేవు. నేరుగా జగన్ ను విమర్శించిన దాఖలాలూ లేవు. దీంతో షర్మిల రాజకీయాలు కూడా అన్న జగన్ వ్యూహాలలో భాగమేనా అన్న కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకూ కేంద్రంలో బీజేపీతో తెరవెనక  మైత్రి సాగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఏపీలో పొత్తులు ఖరారైతే బీజేపీతో వైసీపీ స్నేహం వదులుకోవాల్సిందే. మరోవైపు కేంద్రంలో అసలు బీజేపీ ప్రభుత్వం వస్తుందా లేదా అన్న అనుమనాలు కూడా రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి రోజురోజుకూ పుంజుకుంటున్నదని పరిశీలకులు విశ్లేషణలతో సహా చెబుతున్నారు. ఒకవేళ కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే కాంగ్రెస్ నుండి గత జ్ఞాపకాల వేధింపులు మళ్ళీ పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఈ క్రమంలో చెల్లి షర్మిల కాంగ్రెస్ లో ఉంటే కేంద్రంలో ఇండియా కూటమి వచ్చినా జగన్ మోహన్ రెడ్డికి అండా దండా దొరకడం ఖాయం. ఈ వ్యూహాలతోనే షర్మిల జగనన్న వదిలిన బాణంగానే కాంగ్రెస్ పంచన చేరారా అన్న అనుమానాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. మరి ఇందులో ఏది వాస్తవమో? ఏది ఎవరి వ్యూహమో? ఎవరు ఎవరికి శత్రువులో? ఎవరు ఎవరి పక్షాన ఉన్నారో ముందుముందు చూడాల్సి ఉంది.

ఇలా ఉండగా..  ఏపీ సీఎం జగన్.. ఆయన సోదరి షర్మిల మధ్య ఏమైనా విభేదాలు ఉంటే గింటే అవి వారి తండ్రి వైఎస్ ఆస్తుల విషయంలోనేనని వైఎస్ కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారిరువురి మధ్యా సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ నాయకుడు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రంగంలోకి దిగారని చెబుతున్నారు. ఏపీ సీఎం జగన్ తరఫున తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, షర్మిల తరఫున డీకే శివకుమార్ లు రంగంలోకి దిగి వారిరువురి మధ్యా రాజీ కుదిర్చారని రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  తెలంగాణలో ఉన్న భూములు, అలాగే నగదు పంపిణీల విషయంలో ఇరువురి మధ్యా రాజీ కుదిరిందనీ, ఈ డీల్ పట్ల షర్మిల సంతృప్తి వ్యక్తం చేశారనీ కూడా అంటున్నారు. దీంతో షర్మిల తన పార్టీ వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినా ఆమె తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు దూరంగా ఉండేలా డీల్ కుదిరిందని చెబుతున్నారు.

అంటే షర్మిలకు కాంగ్రెస్ లో కీలక పదవి ఇచ్చి సముచిత స్థానం ఇస్తారనీ, అయితే ఆమె కోరుకున్నట్లుగా తెలంగాణ రాజకీయాలలో చురుకుగా ఉండే అవకాశం ఉండదనీ, అలాగే ఆమె డిమాండ్ చేస్తున్న విధంగా పాలేరులో పోటీకి అవకాశం ఉండదనీ చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ లో ఆమె పోషించే పాత్ర రెండు తెలుగు రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.