బండి యాత్ర, భైంసా సభ తుస్సు.. షర్మిల ఎపిసోడే హైలైట్.. కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్సేనా?

Publish Date:Nov 29, 2022

Advertisement

బీజేపీ అంటేనే గోరంత చేసి కొండంత ప్రచారం పొందే పార్టీ అన్నది రాజకీయ వర్గాలలో బాగా నానుతున్న ప్రచారం. అలాంటిది తెలంగాణలో తాజా ఘటనల నేపథ్యంలో బీజేపీ ఆ ప్రచారం పొందడం సంగతి అటుంచి.. అసలు ఎంతో ఆర్భాటం చేసి మరీ ప్రారంభమైన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఐదో విడత పాదయాత్ర.. ఆ సందర్భంగా భైంసాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అసలు గుర్తింపే లేకుండా పోయింది.  

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల అరెస్టు, తదననంతతర పరిణామాలు. తెలుగు రాష్ట్రాలలో మీడియా అటెన్షన్ నే కాదు.. ప్రజల అటెన్షన్ ను తన వైపు లాగేసుకుంది. షర్మిల అరెస్టు, న్యాయమూర్తి ముందు హాజరుపరచడం, వెంటనే వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల కావడం మొత్తం పోలిటికల్ హైడ్రామా నడిచింది.   మంగళవారం (నవంబర్ 29) ఉదయం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి షర్మిల ప్రగతి భవన్ ముట్టడి పేరుతో నిరసన కార్యక్రమం తలపెట్టారు.ఈ కార్యక్రమానికి సోమవారం(నవంబర్ 28) నర్సంపేటలో టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడిలో పాక్షికంగా ధ్వంసమైన తన కారును స్వయంగా నడుపుకుంటూ ఆమె ప్రగతి భవన్ వైపు వచ్చారు.

దీంతో, పోలీసులు ఆమెను పంజాగుట్ట సర్కిల్ వద్ద అడ్డుకుని.. వాహనంలో నుంచి దిగాలని కోరారు. అందుకు ఆమె నిరాకరించి డోర్ లాక్ చేసుకొని కారులోనే ఉండిపోయారు. వైఎస్సార్‌టీపీ ఆందోళనతో పంజాగుట్ట మార్గంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో  షర్మిల కారును పోలీసులు క్రేన్ సాయంతో లాక్కెళ్లారు. ఆ సమయంలో కూడా షర్మిల  వాహనంలోనే ఉన్నారు. పంజాగుట్ట నుంచి అమీర్‌పేట, మైత్రివనం మీదుగా ఆమె వాహనాన్ని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఆమెను అదుపులోకి తీసుకొని ఎస్సార్‌నగర్ పీఎస్‌లోకి తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించి, జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

 నాంపల్లి కోర్టులో షర్మిలకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు అయింది. ఇక, ఆమెను పరామర్శించేందుకు షర్మిల తల్లి విజయమ్మ వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమెను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో విజయమ్మ లోటస్‌పాండ్‌లోని నివాసంలో నిరశన దీక్షకు దిగారు. షర్మిలను అరెస్టు చేసిన విషయం ఆమె భర్త అనిల్ కుమార్‌కు కూడా సమాచారం ఇచ్చారు.  ఈ మొత్తం వ్యవహారంలో..  బండి సంజయ్ పాదయాత్ర, భైంసా సభ ఎవరూ గుర్తించని కార్యక్రమంలా మిగిలిపోయింది.

 సీఎం కేసీఆర్ ను వ్యతిరేకించినందుకే షర్మిలను అరెస్ట్ చేశారని కొందరంటుంటే.. ఇది పక్కా టీఆర్ఎస్ ప్రణాళిక అంటే మరి కొందరు అంటున్నారు.    భైంసాలో బండి సంజయ్ పాదయాత్ర, బీజేపీ బహిరంగ సభ జరిగింది. అయితే షర్మిల అరెస్ట్ తో ఉదయం నుండి మీడియాలో, సామాజిక మాధ్యమంలో షర్మిల అరెస్టు, విజయమ్మ ఆందోళనకు సంబంధించిన సమాచారంతో నిండిపోయింది.  మరికొందరు కామెంట్లతో పెద్ద వార్ నడుస్తుంది.

 మొత్తం మీద   మీడియాను, సామాజిక మాధ్యమాన్ని వాడుకుని నిత్యం వార్తలలో ఉండటం ద్వారా పాపులర్ అవుతుండే బీజేపీకి షర్మిల ఎపిసోడ్ దారుణంగా ఫెయిలయ్యింది.  తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిర్మల్ జిల్లాలో మొదలుపెట్టిన 5వ విడత పాదయాత్రను షర్మిల  ఎపిసోడ్ కారణంగా ఎవరూ పట్టించుకోలేదు. మరో వైపు రాష్ట్రంలో నిర్విరామంగా అలసట లేకుండా పాదయాత్ర చేస్తున్నా.. పాదయాత్రలో మూడు వేల కిలోమీటర్ల మైలు రాయిని దాటేసినా రాని గుర్తింపు షర్మిలకు మంగళవారం నాటి అరెస్టుతో  వచ్చేసింది. అయితే పరిశీలకులు మాత్రం షర్మిల అరెస్టు వ్యవహారమంతే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహ రచన ప్రకారమే జరిగిందని అనుమానిస్తున్నారు.

ఇన్ని రోజులూ లేనిది ఇప్పుడు ఎందుకు షర్మిల పాదయాత్రపై దాడి జరిగింది?.. అలాగే ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన షర్మిలను అత్యంత నాటకీయంగా కారులో ఉండగానే క్రేన్ తో కారును లాక్కెళ్లి మరీ అరెస్టు చేయాల్సిన అవసరమేమొచ్చింది అని ప్రశ్నిస్తున్నారు. అలాగే షర్మిల అరెస్టుకు నిరసనగా విజయమ్మ దీక్ష కూడా మీడియా కవరేజ్ ను బండి యాత్ర, భైంసా సభ నుంచి డైవర్ట్ చేసింది. ఇదంతా కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జరిగిందన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. 

By
en-us Political News

  
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.