ఫామ్ లోకి వచ్చిన శర్మ, సూర్య... నెదర్లాండ్స్ పై భారత్ విజయం

Publish Date:Oct 27, 2022

Advertisement

ఇద్దరు సూపర్ స్టార్స్ రెచ్చిపోయి ఆడితే ఎలా ఉంటుందో నెదర్లాండ్ ప్లేయర్లకు, ప్రేఓకులకు తెలి సింది. చాలా రోజుల తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ తన బ్యాటింగ్ పటిమను ప్రదర్శించాడు. మొన్న పాకిస్తాన్తో తలపడిన మ్యాచ్ లో త్వరలోనే పెవిలియన్ దారిపట్టిన కెప్టెన్ కొంత నిరాశ పరిచాడు. కానీ గురువారం నెదర్లాండ్ తో తలపడిన మ్యాచ్ లో తన పాత ఫామ్ లోకి తిరిగి వచ్చానని అభిమానులకు తన అర్ధసెంచరీ ఢమాకాతో తెలియజేశాడు. మరో వంక కింగ్ కోహ్లీ మళ్లీ తన డాషింగ్ ప్లేను ప్రదర్శించి మరో అర్ధ సెంచరీ చేశాడు. ఓపెనర్ రోహిత్ శర్మ  తన ఫామ్‌పై విమర్శలు చేసేవారికి ధీటుగా బదులి చ్చాడు. కెప్టెన్ శర్మ 39 బంతుల్లో 53 పరుగులు చేసి రాణించాడు. విరాట్ కోహ్లీ మ్యాచ్‌లో కూడా కింగ్ కోహ్లీ  44 బంతుల్లో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.  భారత్ 56 పరుగుల తేడాతో నెదర్లాండ్స్  పై గెలిచింది. ముందు బ్యాట్ చేసిన  భారత్  2 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 179 పరుగులు చేయగా, నెదర్లాండ్స్ 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. 

పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో నిరాశపరిచిన సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. 25 బంతుల్లో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్ సూపర్ 12 మ్యాచ్ ల్లో భాగంగా గత వారం పాక్ తో తలపడిన టీమ్ నే నెదర్లాండ్ తో తలపడేందుకు దించారు. పాక్ తో జరిగిన మ్యాచ్ చివరి బంతి వరకూ ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో భారత్ కు ఘన విజయాన్ని చ్చిన కింగ్ కోహ్లీకి నెదర్లాండ్ మ్యాచ్ కి రెస్ట్ ఇస్తారనే అనుకున్నారు. కానీ కోహ్లీ జట్టులో ఉండడమే కాకుండా మళ్లీ అదే ధాటి ప్రదర్శించి 44 పరుగుల చేయడంలో ప్రేక్షకులను అలరించాడు. కాగా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా రెచ్చిపోయి ఆడటం భారత్ జట్టు వీరాభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చింది.  సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.  

గత మ్యాచ్ లో ఇద్దరి వైఫల్యం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. కాగా, గురు వారం మ్యాచ్ లో  ఓపెనర్ కె.ఎల్. రాహుల్ ఊహించనివిధంగా వెనుదిరిగాడు.  తన వ్యక్తిగత స్కోర్ 9 పరుగుల వద్ద లెగ్ బిఫోర్ అయ్యాడు. అయితే ఏ మాత్రం రివ్యూ కోసం ఆగకుండా వెళిపోవడమే పెద్ద పొరపాటయిందనాలి. నిజానికి తర్వాతి క్షణంలో థర్డ్ అంపైర్ రివ్యూనిపరీక్షించగా అతను నాట్ అవుట్ అని తేలింది. కానీ అప్పటికే రాహుల్ వెళిపోయాడు. ఆ విధంగా రాహుల్ మంచి స్కోర్ చేసే అవకాశం కోల్పోయాడనాలి. నెదర్లాండ్ బౌలర్లను అతను సునాయాసంగా ఎదుర్కొనగలడన్న నమ్మకం కెప్టెన్ శర్మకీ  ఉంది గనుకనే రాహుల్ అలా వెళిపోవడం శర్మను ఆశ్చర్యపరిచింది. 

180 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ కు ఓపెనర్లు విక్రమ్ జిత్ సింగ్, మాక్స్ డౌడ్ నిరాశ పరిచారు. వారిద్దరూ ఘోరంగా విఫలమయ్యారు. విక్రమ్ కేవలం ఒక్క పరుగు తీసి భువనేశ్వర్ కి దొరికి పోయాడు. అలాగే డౌడ్ కూడా 16 పరుగులు మించి చేయలేకపోయాడు. లెఫ్టీ అక్షర్ పటేల్కి చిక్కి పెవిలి యన్ దారి పట్టాడు. చూస్తుండగానే భారత్ భౌలర్ల ధాటికి నెదర్లాండ్ బ్యాటర్లు క్యూ కట్టడంతో  పది ఓవర్లకు 70 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది.  

18వ ఓవర్ చివరికి ఎట్టకేలకు వంద పరుగులు దాటింది. కానీ అప్పటికే 8 వికెట్లు కోల్పోయి విజయా వకాశాలు కోల్పోయింది. భారత్ యువ పేసర్ అర్ష్ దీప్ సింగ్ 18 వ ఓవర్లో చివరి రెండు బంతుల్లో  రెండు వికెట్ల తీశాడు. దీంతో 20వ ఓవర్లో హ్యాట్రిక్ సాధిస్తాడని మళ్లీ అతన్నే కెప్టెన్ బౌలింగ్ కి పిలిచాడు. కానీ హాట్రిక్ సాధించలేకపోయాడు.  నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ లో  అత్యధికంగా  టిమ్ ప్రింగ్లే 20 పరుగులు, షారి జ్ అహ్మద్ 16 పరుగులు చేశారు. షారిజ్, మెకరిన్ అజేయంగా నిలిచారు. 

By
en-us Political News

  
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.