మోడీకి పవార్ సవాల్.. మారుతున్న ఈక్వేషన్స్..
Publish Date:Jan 12, 2022
Advertisement
దేశ రాజకీయాలలో శరద్ పవార్ స్థానం ప్రత్యేకం. ఆయనకు అన్ని పార్టీల నాయకులతోనూ దగ్గర సంబంధా లున్నాయి. ప్రధా ని నరేంద్ర మోడీ సైతం పవార్ 'ను సీనియర్ నాయకుడిగా గౌరవిస్తారు. గడచిన ఏడేళ్లలో ప్రధానితో ఎక్కువసార్లు భేటీ అయినా ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవారే కావచ్చును. అనేక కెలక సమస్యల విషయంలో పవార్ సలహారాలు తీసుకుంటానని, మోడీనే ఆయనకు కితాబు నిచ్చారు.. అలాగే, కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియాగాంధీ , ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు పవార్' ను గౌరవిస్తారు. అదే సమయంలో పవార్, రాజకీయ చతురత సామాన్య మైనది కాదు. తిమ్మిని బమ్మిని చేయగల సమర్ధుడు. అయితే, అందుకే పవార్ ఎంత మంచి మిత్రుడో అంత గొప్ప శతృవు కూడా అంటారు. అయినా అయన ప్రధాన్యతను ఎవరు కాదనలేరు. మహా రాష్ట్రలో, మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఇంకా మనుగడ సాగిస్తోందంటే , అందుకు పవాఁ ర్ రాజకీయ చతురతే కారణం. అందుకే కావచ్చు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కేంద్రంలో బీజేపీకి ప్రత్యాన్మాయం ఏర్పాటు ప్రయత్నాలను పవార్ తోనే ప్రారంభించారు. ఆప్రయత్నాల సంగతి ఎలా ఉన్నా, ఇప్పుడు పవార్ మరోసారి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంగా ఉత్తర ప్రదేశ్' లో అధికార బీజేపీ సంక్షోభంలో పడిన వెంటనే పవార్ తెరమీదకు వచ్చారు. సంచలన ప్రకటన చేశారు. మంత్రి స్వామి ప్రసాద మౌర్య ఆయన తో పాటుగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో పవర్ బీజేపీ నుంచి మొత్త్తం 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని, యూపీలో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అఖిలేష్ యాదవ్ కంటే గట్టిగా చెప్పారు. అలాగే, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీతో కలిసి పోటీ చేయనున్నట్లు శరద్ పవార్ ప్రకటించారు. అలాగే, ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ సహా మరి కొన్ని చిన్న పార్టీలతో కలిసి బరిలోకి దిగనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బీజేపీకి అతిపెద్ద సవాల్‌గా మారిన ఎన్సీపీ, యూపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడంతో పాటు ఎస్పీతో జతకడతామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
అలాగే మరో వంక గోవా లోనూ పావులు కదిపారు. గోవా శాసన సభ ఎన్నికల్లో పొత్తుల కోసం కాంగ్రెస్, టీఎంసీలతో చర్చిస్తున్నట్లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ చెప్పారు. తమకు కావలసిన స్థానాల జాబితాను ఆ పార్టీలకు అందజేశామని చెప్పారు. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. గోవాలో మార్పు అవసరమని చెప్పారు. బీజేపీ ప్రభుత్వాన్ని మార్చాలన్నారు. కలిసికట్టుగా పోటీ చేయాలనే అంశంపై ఎన్సీపీ, కాంగ్రెస్, టీఎంసీ మధ్య చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ తాజా పరిణామాలను గమనిస్తున్న రాజకీయా పరిశీలకులు బీజేపీ, కాంగ్రెస్లోయేతర ప్రత్యాన్మాయ కూటమి ఏర్పాటు జరిగితే, నాయకత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు పవార్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు ` భావిస్తున్నారు ,
http://www.teluguone.com/news/content/sharad-pawar-political-game-against-bjp-39-130081.html





