యూట్యూబర్ పై శాంతి లైంగిక ఆరోపణలు
Publish Date:Oct 11, 2024
Advertisement
యూట్యూబర్ దాసరి విజ్ఞాన్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ ఎపి ఎండోమెంట్ కమిషనర్ శాంతి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను గత కొంత కాలంగా ఈ యూట్యూబర్ లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె పేర్కొన్నారు. మార్ఫింగ్ వీడియోలు పోస్ట్ చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. శాంతికి పుట్టిన బిడ్డ తన బిడ్గ కాదని శాంతి భర్త కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగించినట్లు ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే అసలు విషయం బయటపడుతుందని ఆయన హోంమంత్రి అనితను కల్సి వినతి పత్రం కూడా ఇచ్చారు. అయితే ఈ వివాదం సద్దుమణగకముందే యూట్యూబర్ దాసరి విజ్ఞాన్ విడుదల చేస్తున్న మార్ఫింగ్ వీడియోలు ఆమె పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేశారు.
http://www.teluguone.com/news/content/shanthi-sexual-allegations-against-youtuber-25-186665.html





