శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ‘హై అలర్ట్’.. అడుగడుగునా నిఘా..!
Publish Date:Aug 11, 2026
Advertisement
శంషాబాద్ విమానాశ్రయం... ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం.... వేలాది మంది ప్రయాణికులు.. వందలాది వాహనాలు.. నిత్యం రాక పోకలతో సందడిగా ఉండే ప్రదేశం అది..... కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి కాస్త భిన్నంగా మారింది. ఆగస్టు 15 నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా భద్రతా బలగా లను రెట్టింపు చేశారు. సీఐఎస్ఎఫ్‌తో పాటు స్థానిక పోలీసులు కూడా ప్రత్యేక బందోబస్తులో నిమగ్నమయ్యారు. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తు న్నారు. ప్రయాణికుల లగేజీని స్కానర్లతో పరిశీలిస్తున్నారు. అనుమానం కలిగించే వ్యక్తులపై ప్రత్యేకంగా ఆరా తీస్తు న్నారు. ఎయిర్‌పోర్ట్ సందర్శకులకు పాసుల జారీపై కూడా ఆంక్షలు విధించారు. టెర్మినల్, పార్కింగ్ ప్రాంతాలు, పరిసరాల్లో అనుమానిత వస్తువులు ఏమైనా ఉన్నాయా అని బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా కొనసాగుతోంది. అనుమా నాస్పద కదలికలు, వస్తు వులపై భద్రతా సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించారు. ప్రయాణికులు తమ లగేజీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు అప్ప గించవద్దని అధికారులు సూచించారు. అనుమా నాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే భద్రతా సిబ్బందికి సమా చారం ఇవ్వాలని కోరారు. Shamshabad Airport on high alert, CISF, Independence Day Celebration, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand,Telangana police
ఆగస్టు 15 నేపథ్యంలో ప్రారంభమైన ఈ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిధిలో అడుగడుగునా భద్రతా సిబ్బంది అప్రమ త్తంగా వ్యవహరిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/shamshabad-airport-on-high-alert-36-228695.html





