కోరికలుంటే మా వద్దకు రమ్మన్నసెక్స్ వర్కర్ ...వైరల్ అవుతోన్న వీడియో

Publish Date:Aug 22, 2024

Advertisement

కోల్కతా వైద్యురాలిపై రేప్ సంఘటన యావత్ దేశాన్ని కదిలించింది. రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా స్టేట్ మెంట్ ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. కానీ కోల్ కతా లో ని ఒక సెక్స్ వర్కర్ సమాజాన్ని ఆలోచింపజేసింది. 
సోనాగచ్చి.. కోల్‌కతా పరిచయం ఉన్న వారికి ఈ పేరు సుపరిచితం. ముంబైలోని రెడ్‌లైట్ ఏరియాలనే ఇది కూడా బాగా పేరుమోసింది. నిజానికి ఇలాంటి ప్రాంతాలపై పోలీసులు తరచూ దాడులు చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతాల పేరు ఎత్తడానికి కొందరు జంకితే.. మరికొందరు అటువైపు వెళ్లలేకుండా ఉండలేని స్థితిలో ఉంటారు.
కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార ఘటన తర్వాత సోనాగచ్చికి చెందిన ఓ సెక్స్ వర్కర్ చేసిన వ్యాఖ్యలు సమాజంలోని పోకడలకు అద్దం పడుతున్నాయి. సోనాగచ్చి లాంటి ప్రాంతాలు ఎందుకు ఉండాలో చెప్పిన ఆమె వ్యాఖ్యల వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. 
ఓ మీడియా ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ ‘‘మీ కోరికను తృప్తిపరుచుకోవాలంటే సోనాగచ్చి రండి. ఇలా చదువుకున్న అమ్మాయిలు, పనిచేసుకుంటున్న మహిళలపై దారుణాలకు పాల్పడాల్సిన అవసరం ఏముంది? 20, 30 రూపాయలు ఇచ్చినా పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ల వెంటపడి ఉసురు తీస్తారు ఎందుకు?’’ అని ప్రశ్నించింది. సోనాగచ్చి లాంటి ప్రాంతాలు ఉండగా ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతుండడాన్ని ఆమె వ్యాఖ్యలు ఎత్తిచూపాయి.
నిజానికి సోనాగచ్చి లాంటి ప్రాంతాలు ఎప్పటికీ వివాదాస్పదమే. ఇవి సమాజాన్ని నాశనం చేస్తున్నాయన్న అభిప్రాయం చాలామందిలో నెలకొంది. ప్రభుత్వాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉంటాయి. ఇలాంటివి లేకపోతే సమాజంలో జరిగే అరాచకాలను ఊహించుకోలేరని ఆమె వ్యాఖ్యలు చెప్పకనే చెప్పాయి. రెడ్‌లైట్ ఏరియాలు అక్కడక్కడా ఉండడం వల్లే మహిళలకు కొంతైనా భద్రత లభిస్తోందన్న భావన ఆమె మాటల్లో వ్యక్తమైంది.
కామవాంఛ గల పురుషుల నుంచి ఇలాంటి ప్రాంతాలు మహిళలను రక్షిస్తూనే ఉన్నాయని చెప్పుకొచ్చింది. నిజానికి సోనాగచ్చి లాంటి వాటిని చెడుగా చూస్తారు. ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపాలనుకుంటున్న ప్రభుత్వాలు ఆమె ప్రశ్నకు ఏమని సమాధానం చెబుతాయన్న ప్రశ్న అందరిలోనూ మొదలైంది. పురుషులకు రెడ్‌లైట్ ఏరియాలు ఎందుకు అవసరమన్న మరో ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. రెడ్ లైట్ ఏరియాలు లేకుండా మహిళలు బతకగలిగినప్పుడు.. పురుషులు ఎందుకు ఆ పనిచేయలేరు.. అని ప్రశ్నించి సామాజిక రుగ్మతలను సవాలు చేసింది. ఆమె వ్యాఖ్యలతో ఆయా రాష్ట్రాల్లో పాలకులు రెడ్ లైట్ ఏరియాలకు అనుమతులిస్తారని అనే వాదన వినిపిస్తోంది. 

By
en-us Political News

  
శారీరక వైకల్యాన్ని జయించి..అమెజాన్‌లో కొలువు కొట్టిన నిట్ గ్రాడ్యుయేట్.!
వాతావరణ మార్పుల ఎఫెక్ట్: కిడ్నీ ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.!
బతుకమ్మ సంబరాల నుంచి ఇంటికి వెళ్తుండగా విషాదం.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ వ్యక్తిగత జీవితంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.