రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం
Publish Date:Jul 1, 2026
Advertisement
రాజస్థాన్ లో బుధవారం (జులై 1) తెల్లవారు జామున జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ, ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణికులతో వెడుతున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నియంత్రణ కోల్పోయి ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు అతి వేగంగా వెడుతుండటంతో.. ప్రమాద తీవ్రతకు ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగి చూస్తుండగానే బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. హరిద్వార్ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెడుతున్న ఈ బస్సులో ప్రమాదం జరిగిన సమయంలో 39 మంది ప్రయాణీకులు ఉన్నారని చెబుతున్నారు. ప్రమాద సమయంలో ప్రయాణీకులంతా గాఢ నిద్రలో ఉండటంతో బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
http://www.teluguone.com/news/content/seven-burnt-alive-in-accident-36-224707.html





