వారణాసి సేవా సంకల్ప్ అభియాన్ లో ఏపీ సీఎం చంద్రబాబు.!

Publish Date:Sep 17, 2026

Advertisement

భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త మైలురాయిగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలు మరియు ఆయన ప్రజా జీవితంలో అప్రతిహతంగా పాతికేళ్లు  పూర్తి చేసుకున్న సందర్భంగా వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం (సెప్టెంబర్ 17) ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

 సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా ఒక నెల రోజుల పాటు కొనసాగే సేవ మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు  ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం కాశీ నగరంలో  గురువారం (సెప్టెంబర్ 17) శ్రీకారం చుట్టారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ జన్మస్థలమైన గుజరాత్‌లోని వడ్నగర్ నుండి వారణాసి వరకు  అలాగే వారణాసి నుండి వడ్నగర్ వరకు రెండు భారీ బైక్ ర్యాలీలను అగ్రనేతలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్రలు  10 రాష్ట్రాల గుండా ప్రయాణించి, 193 జిల్లాలు మరియు దాదాపు 1,159 గ్రాగాలను తాకుతూ అక్టోబర్ 7న ముగియనున్నాయి. ఈ బృహత్తర బైక్ ర్యాలీలు మొత్తం 40,000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనుండగా, ఇందులో  వెయ్యి మంది  భాగస్వాములు కావడం విశేషం.

ఈ  కార్యక్రమంలో  పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ నుండి బయలుదేరి వారణాసి  చేరుకున్నారు. అక్కడ తొలుత ప్రసిద్ధ శ్రీ కాశీ విశ్వనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, రుద్రాక్ష ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన సేవా యాత్ర ప్రారంభ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఇదే సమయంలో గుజరాత్‌లోని వడ్నగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తదితరులు వ్యతిరేక దిశ నుంచి సాగే బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ యాత్రల ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరవేయడంతో పాటు, ప్రజా భాగస్వామ్యం,  సామాజిక బాధ్యత ప్రాముఖ్యతను చాటిచెప్పాలన్నది  లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవైపు వారణాసిలో కాశీ విశ్వనాథ ధామ్‌లో పవిత్ర జలాలతో జలాభిషేకం చేసేందుకు దేశంలోని వివిధ నదుల నుండి నీటిని సేకరించి ఈ యాత్ర ద్వారా తరలిస్తున్నారు.  

నెల రోజుల పాటు సాగే  సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా రక్తదాన శిబిరాలు, ఆరోగ్య పరీక్షలు, స్వచ్ఛతా కార్యక్రమాలు, అట్టడుగు స్థాయి లబ్ధిదారుల సన్మానం,  వికసిత్ భారత్-2047 లక్ష్యంగా పలు యువజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమై, దేశ ప్రధాని స్థాయి వరకు సాగిన మోదీ పరిపాలనా ప్రస్థానాన్ని, సంక్షేమ పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. 

[Seva Sankalp Abhiyan, PM Modi birthday, Chandrababu Naidu Varanasi, Yogi Adityanath, Vadnagar Varanasi bike rally, NDA leaders Varanasi, Telugu One]

By
en-us Political News

  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.