ఏడాది పాటు సస్పెండ్.. హాస్టల్ నుంచి అవుట్.. మెడికోస్ ర్యాగింగ్‌పై యాక్షన్
Publish Date:Jan 4, 2022
Advertisement
మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ టూమచ్ చేశారు. డాక్టర్ కోర్సు చదివేవాళ్లు వెదవల్లా బిహేవ్ చేశారు. ఫుల్‌గా మందేసి.. జూనియర్‌ను అర్థరాత్రి వరకూ ర్యాగింగ్ చేశారు. గంటల తరబడి మోకాళ్లపై నిల్చోపెట్టారు. రాత్రంతా సెల్యూట్ చేయించుకున్నారు. బయోడేటా పేరుతో ఇంట్లోని ఆడవాళ్ల గురించి గుచ్చిగుచ్చి అడిగారు. బట్టలు విప్పించారు.. వీడియో తీశారు.. గుండు చేసే ప్రయత్నం చేశారు.. వేధించారు.. టార్చర్ చేశారు. సూర్యాపేట మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ర్యాగింగ్ దారుణం గురించి ఆ బాధిత విద్యార్థి బయటపెట్టడంతో తీవ్ర కలకలం రేపింది. గతంలోనే కాలేజీ ప్రిన్సిపల్‌కు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో.. ఆ స్టూడెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అంతా ఉలిక్కిపడ్డారు. వెంటనే మెడికల్ కాలేజీ వాళ్లు సీరియస్ యాక్షన్ మొదలుపెట్టారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్‌ను ర్యాగింగ్ చేసిన ఘటనలో ఆరుగురు వైద్య విద్యార్థులను సస్పెండ్ చేశారు. 2019- 20బ్యాచ్‌కు చెందిన ఆ ఆరుగురు స్టూడెంట్స్‌ను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ డీఎంఈ రమేశ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సస్పెండ్‌తో పాటు కాలేజ్ హాస్టల్ నుంచి శాశ్వతంగా పంపించేస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే, బాధిత విద్యార్థి తనను 25మంది సీనియర్స్ రూమ్‌లో బంధించి తీవ్రంగా ర్యాగింగ్ చేశారని కంప్లైంట్ చేయగా.. విచారణ అనంతరం ఆ ర్యాగింగ్‌లో ముందున్న ఆరుగురిని ఇలా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. మరి, ర్యాగింగ్‌కు సహకరించిన మిగిలిన సీనియర్స్‌ను వదిలేసినట్టేనా? అని ప్రశ్నిస్తున్నారు జూనియర్స్.
http://www.teluguone.com/news/content/serius-action-on-medical-collage-raging-case-39-129599.html





