ఒక రోజు ముందే పెన్షన్లు.. చంద్రబాబు సర్కార్ నిర్ణయం

Publish Date:Aug 29, 2024

Advertisement

ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి, ప్రజలకు సుపరిపాలన అందించాలన్న సంకల్పం ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే పాలన ఎలా సాగుతుంది అనడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన చేతలలో చూపుతున్నారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో ఉద్యోగులు ఏనాడూ నెలలో మొదటి తేదీన వేతనాలు అందుకున్న పరిస్థితి లేదు. అలాగే పెన్షనర్లు తమ పెన్షన్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి. అయితే జగన్ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు వేతనాలు మొదటి తేదీనే అందుతున్నాయి. పెన్షన్ల పంపిణీ కూడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నెల మొదటి తేదీనే జరిగిపోతున్నది.   ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం   కూటమి ప్రభుత్వం సుపరిపాలన దిశగా  కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు దిశగా ఒక్కో పథకం ప్రవేశపెడుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, పథకాలకు సంబంధించి అనేక చర్యలు చేపడుతోంది.  

 ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం గత ప్రభుత్వం రూ.3 వేలు పెన్షన్ ఇస్తే.. చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దాన్ని మరో రూ.వెయ్యి పెంచి రూ.4 వేలు అందిస్తోంది.

ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెన్షన్ల విషయంలో  చంద్రబాబు ప్రభుత్వం చాలా పద్ధతిగా వ్యవహరిస్తోంది. ఎన్నికల హామీల్లో భాగంగా మొదట పెన్షన్ల పెంపును అమలు చేయగా.. ప్రతినెల 1వ తేదీన ఠంఛనుగా పెన్షన్‌లను అందించే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి సెప్టెంబర్ నెల పెన్షన్ ను నెల మొదటి తేదీ కంటే ఒక రోజు ముందే.. అంటే ఆగస్టు 1వ తేదీనే అందించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసింది. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో లబ్ధిదారులకు   ఒక రోజు ముందుగానే ఆగస్టు 31నే  అర్హులందరికీ పెన్షన్లను అందజేయాలని నిర్ణయించింది.  

  ఏదైనా కారణంగా ఈ నెల 31వ తేదీనన పెన్షన్లు అందకపోతే.. సెప్టెంబర్‌ 2వ తేదీన సోమవారం రోజున అందించనున్నట్లు తెలిపింది. ఇక గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం.. వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పెన్షన్లు అందించేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ ఉద్యోగుల ద్వారా మాత్రమే పెన్షన్లను పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలోనే సచివాలయ ఉద్యోగులు.. ఇంటింటికీ వెళ్లి.. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నారు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.