ఏపీ కేబినెట్ భేటీకి జనసేన మంత్రుల గైర్హాజర్: అసలేం జరుగుతోంది.?
Publish Date:Oct 11, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం శనివారం (అక్టోబర్ 10) జరిగింది. కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవడమే లక్ష్యంగా జరిగిన ఆ కేబినెట్ భేటీకి జనసేన మంత్రులు ముగ్గురు గైర్హాజర్ కావడం పొలిటికల్ గా సంచలనంగా మారింది. స్థానిక ఎన్నికల వేళ సీట్ల సర్దుపాట్లే ఇందుకు కారణమన్న ప్రచారం జోరుగా సాగింది. మొత్తం మీద కేబినెట్ భేటీకి జనసేన మంత్రుల సామూహిక గైర్హాజర్ హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రరాజకీయ సమీకరణాల్లో మార్పు అంటూ రాజకీయవర్గాలలో ఊహాగాన సభలు కూడా జరిగాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ గైర్హాజర్ పై పలు రకాల విశ్లేషణలు వెల్లువెత్తాయి. అయితే జనసేన మంత్రుల గైర్హాజరీ వెనుక రాజకీయ వివాదం కానీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి కానీ లేదని ఆ తరువాత స్పష్టమైంది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయం జనసేన మంత్రుల గైర్హాజర్ పై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చింది. మహాలయ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని పితృదేవతలకు సంప్రదాయబద్ధంగా నిర్వహించాల్సిన తర్పణాల విధుల్లో ఉదయం నుంచి ఆయన నిమగ్నమై ఉండటం వలనే మంత్రివర్గ సమావేశానికి జనసేన మంత్రులు హాజరుకాలేకపోయారని జనసేన వివరించింది. ఇటీవల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, నామినేటెడ్ పదవుల భర్తీ తదితర అంశాలపై కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయ చర్చలు జరుగుతున్న తరుణంలో, కేబినెట్ భేటీకి జనసేన మంత్రుల గైర్హాజర్ పలు సందేహాలకు తావిచ్చింది. జనసేన, తెలుగుదేశం మధ్య విభేదాలన్న చర్చ మొదలైంది. అయితే జనసేనాని కార్యాలయం ఓ ప్రకటన ద్వారా క్లారిటీ ఇవ్వడంతో ఆ చర్చకు ఫుల్ స్టాప్ పడింది.
[Janasena Ministers Abscent Cabinet Meeting, AP Cabinet Meeting, Pawan Kalyan, Chandrababu Naidu, Differences, Rumours,TeluguOne News]
http://www.teluguone.com/news/content/janasena-ministers-abscent-cabinet-meeting-39-234038.html




