విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సంచలన మలుపు!

Publish Date:Jun 25, 2026

Advertisement

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

విజయవాడ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న ఈ హైప్రొఫైల్ కేసులో తాజాగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజును పోలీసులు అరెస్టు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ మిస్సింగ్ ఉదంతం వెనుక ఉన్న భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో ఇటు లీగల్ వర్గాల్లోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసలు సాయికృష్ణ మిస్సింగ్ వెనుక ఏం జరిగింది, ఒక పోలీస్ అధికారి అరెస్ట్ వరకు ఈ వ్యవహారం ఎందుకు దారితీసింది అనే కోణంలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఈ పరిణామంపై ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. 

ఈ కేసు తీవ్రతను గమనించిన కోర్టు ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని గట్టిగా నిలదీసింది. సాయికృష్ణ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం, జూన్ 29వ తేదీ లోపు పూర్తి వివరాలతో కూడిన సమాధానాన్ని సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. మరోవైపు ఈ ఉదంతం దేశ రాజధాని ఢిల్లీకి సైతం చేరింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఎంపీలు తనూజ మరియు గురుమూర్తి ఇద్దరూ కలిసి   జాతీయ మానవ హక్కుల కమిషన్ కి అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు  స్థానిక పరిధిలోనే కాకుండా జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

 దీనిపై భరద్వాజ్.. సిఐ నాగరాజును అరెస్ట్ చేయకుండా తప్పించుకునే పరిస్థితి పోలీసు శాఖకు లేకుండా పోయిందన్నారు.   బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.  మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ సీఐ బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన తీరు ప్రజా బాహుళ్యంలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించిందన్నారు. అయితే ఈ సింపతీని పక్కదారి పట్టించడానికి ఒక వ్యూహాత్మక నెరేటివ్ కూడా తెరపైకి వచ్చిందన్న ఆయన.. సాయికృష్ణపై గతంలో ఉన్న 23 క్రిమినల్ కేసుల రికార్డును ఎస్టాబ్లిష్ చేస్తూ, అతనొక ప్రమాదకరమైన గంజాయి పెడ్లర్ అనీ.. అతని వల్ల సమాజానికి ముప్పని ప్రచారం చేయడం ప్రారంభించారు. కృష్ణలంక ప్రాంతంలో మహిళలు రోడ్ల మీదకు వచ్చి కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తూ సిఐ నాగరాజుకు మద్దతు తెలపడం ప్రత్యేకంగా గుర్తించాలన్నారు. గతంలో సురేంద్రబాబు  హయాంలో బుడ్డ శంతన్, పిల్లి దుర్గాప్రసాద్ ఎన్ కౌంటర్ల సమయంలో ఇలాంటి ప్రజా మద్దతు కనిపించినప్పటికీ, చట్టం ముందు ఇవేవీ నిలబడలేదని గుర్తు చేస్తూ ఇప్పుడూ అదే జరుగుతుందన్నారు.

కేవలం ఒక పాత నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బిడబ్ల్యూ) అమలు కోసం తీసుకొచ్చిన వ్యక్తిని పోలీస్ స్టేషన్‌లో ప్రాణాలు పోయేలా కొట్టడం వెనుక ఏదో బలమైన రాజకీయ ఒత్తిడి లేదా మాఫియా ప్రమేయం ఉందని భరద్వాజ్ అన్నారు. సాయికృష్ణ తీవ్రమైన ఇంటరాగేషన్ తట్టుకోలేక మరణించాడని, ఆ తర్వాత అతని మృతదేహాన్ని ఎక్కడో గుర్తుతెలియని బస్టాప్ సమీపంలో అనాథ శవంగా దహనం చేసేశారని ప్రచారం జరుగుతోందనీ. కనీసం తల్లికి బూడిద కూడా దక్కకుండా సాక్ష్యాధారాలను పూర్తిగా తుడిచిపెట్టేయడం వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘోరం వెనుక కేవలం సిఐ నాగరాజు ఒక్కరే లేరని, మొత్తం ఇంటరాగేషన్ టీమ్ కానిస్టేబుళ్లు కూడా ఉన్నారని, అయితే స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా సిఐ కేంద్రబిందువు అయ్యారని భరద్వాజ్ అన్నారు. 

ఈ మొత్తం వ్యవహారం వెనుక ఆంధ్రప్రదేశ్‌ను పట్టిపీడిస్తున్న గంజాయి, డ్రగ్స్ సిండికేట్ లింకులు ఉన్నాయన్నారు. కేవలం నైజీరియన్లు లేదా సినిమా వాళ్లే కాకుండా, స్థానిక పొలిటికల్ లీడర్ల అండదండలతో ఈ డ్రగ్ నెట్‌వర్క్ భారీ ఆర్థిక వనరుగా నడుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో గంగవరం పోర్టులో దొరికిన 4 కంటైనర్ల డ్రగ్స్ ఉదంతం లాగే, ఈ సాయికృష్ణకు కూడా కీలకమైన పొలిటికల్ డ్రగ్ లింకులు ఏమైనా తెలిసి, బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించడం వల్లే ఈ హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు సాగాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం  ఈ కేసును లోతుగా విచారించి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిజాలను బయటపెట్టాలని,  సిఐ నాగరాజు నుంచి నేర అంగీకార వాంగ్మూలం (కన్ఫెషన్ స్టేట్‌మెంట్) తీసుకుని, కేసును ఆయనతోనే ముగించేయడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు భరద్వాజ అనుమానం వ్యక్తం చేశారు. 

By
en-us Political News

  
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.