Publish Date:Nov 12, 2025
ఒకే రోజు మూడు సారీలు. లారీల నిండా సారీలు. వారిలో టాప్ ప్లేస్ కి చెందిన సారీ చెప్పిన వారు.. మంత్రి కొండా సురేఖ. ఈమె గతంలో అంటే తాను మంత్రి అయిన తొలి రోజుల్లో నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి ఒక అబాంఢం వేశారు. దీంతో నాగార్జున న్యాయాన్ని ఆశ్రయించారు కూడా. ఆపై సురేఖ మంత్రిపదవి ఊడిపోతుందేమో అన్నంతగా వ్యవహారం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే.. , బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారే అలా వెంట్రుక వాసిలో అప్పట్లో వేటు నుంచి కొండా సురేఖ తప్పించుకున్నారు. ఆమె మంత్రిగా ఉండి కూడా ప్రభుత్వంలో తమను తొక్కేస్తున్నారని ఆరోపణలు గుప్పించి కూడా పదవిని భద్రంగా కాపాడుకోగలుగుతున్నారు. అది వేరే విషయం. అప్పటి నుంచీ కూడా సురేఖ సైలెంట్ మోడ్ లో కి వెళ్లిపోయానని అంటారు. తానేదైనా అంటే అది మరొకటిగా రూపాంతరం చెందుతోందని.. ఫీలయ్యి మీడియాతో మాట్లాడ్డమే మానేశానని చెప్పుకొచ్చారీ మధ్య ఒక మీడియా చిట్ చాట్ లో. ఇప్పుడు కూడా సురేఖ.. ట్వీట్ చేసి సరిపుచ్చారు తప్ప.. మీడియా ముందుకు రాకుండా జాగ్రత్త వహించారు చూశారా!? దటీజ్ కొండంత సారీల సురేఖ అంటే.
ఇక రెండో బిగ్గెస్ట్ సారీ ఆఫ్ ద ఏపీ విషయానికి వస్తే.. మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్. ఒక సమయంలో షాడో సీఎం గా వ్యవహించారన్న పేరుండేది. అప్పట్లో ఇద్దరి పట్ల తాను ఎంతో దారుణంగా ప్రవర్తించాననీ ఆయన ఇప్పుడు తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇంతకీ వారెవరో చూస్తే మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు, ఐఆర్ఎస్ జాస్తి కిషోర్ కుమార్. ఈ ఇద్దరి పట్ల తాను అలా వ్యవహరించి ఉండకుండా ఉండాల్సిందన్న కోణంలో ఆయన చేసిన ఒక వీడియో ప్రెజంటేషన్ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. అప్పట్లో జగన్ ఏదంటే అది అన్న మాటకన్నా, ప్రవీణ్ ప్రకాశ్ ఏదంటే అదీ అన్న టాక్ వినిపించేది. ఒక దశలో ప్రవీణ్ ప్రకాశ్ మీద ఉపాధ్యాయులంతా కలసి కంప్లయింట్ చేశారంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. అలాంటి ప్రవీణ్ ప్రకాశ్ నుంచి సారీ.. అది కూడా ఇద్దరు ఉన్నతాధికారులకు అందింది.
ఒక మూడో సారీ.. నటుడు ప్రకాష్ రాజ్చెప్పారు. బేసిగ్గా ప్రకాష్ రాజ్ ఎంత అగ్రెసివ్ గా ఉంటారంటే.. జస్ట్ ఆస్కింగ్ పేరిట ఏకంగా ప్రధాన మంత్రినే ఏ ప్రశ్నలంటే ఆ ప్రశ్నలు అడిగే బాపతు. దేశంలో ఏ చిన్న విషయమైనా సరే ఆయన నిగ్గ దీసి అడుగు- ఈ సిగ్గులేని సమాజాన్ని అనే టైపు. అలాంటి ప్రకాశ్ రాజ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినందుకుగానూ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తనకే పాపం తెలీదంటే అది తప్పు అవుతుందని అన్నారు. అయితే.. తాను గతంలో చేసిన బెట్టింగ్ యాప్ ప్రచారానికిగానూ సారీ చెబుతున్నా! అంటూ మీడియా ముఖంగా చెప్పారు. దీంతో ఒకే రోజు ముగ్గురు ప్రముఖుల నుంచి మూడు సారీలు వెలువడ్డంతో ఇదో సరికొత్త రికార్డు సృష్టించింది. వీరంతా మామూలోళ్లు కారు. అలాంటి మొండి- జగమొండి ఘటాల నుంచి ఇలాంటి క్షమాపణల పర్వం ఈ సమాజం చూస్తుందనుకోలేదు. కాబట్టే ఇంత ఎగ్జయిట్ మెంట్. ఇందులో ఏదైనా తప్పుంటే సారీయే..!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/selebrities-sorry-39-209427.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.