యూఎస్‌లో ప్రతిష్టాత్మక ఎఫ్ఐఏ అధ్యక్షుడిగా శీకాంత్ అక్కపల్లి

Publish Date:Dec 16, 2025

Advertisement

 

అమెరికాలో భారతీయులు.. అందులోనా తెలుగు వారు గొప్ప ఖ్యాతి గడిస్తున్నారు. అమెరికాలోని అతిపెద్ద భారతీయుల సమూహానికి వచ్చే ఏడాదికి గానూ తెలుగు వ్యాపారవేత్త శ్రీకాంత్ అక్కపల్లి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఇక ఈ పదవి దక్కించుకున్న తొలి తెలుగు వ్యక్తిగా కూడా ఆయన రికార్డుల్లోకి ఎక్కారు. గత 50 ఏళ్లుగా ఎఫ్ఐఏ అమెరికాలోని భారతీయులకు సేవలు అందిస్తోంది. ఈ సంస్థకు అమెరికన్ కాంగ్రెస్‌లో గుర్తింపుతోపాటు.. పలు అవార్డులు కూడా ఉన్నాయి.

 2026 ఏడాదికి సంబంధించి ఎఫ్ఐఏ కొత్త కార్యనిర్వాహక బృందాన్ని ప్రకటించింది. స్వతంత్ర ఎన్నికల కమిషన్ నేతృత్వంలో జరిగిన వార్షిక అంతర్గత సమీక్ష, ఎంపిక ప్రక్రియ తర్వాత.. ప్రముఖ వ్యాపారవేత్త అయిన శ్రీకాంత్ అక్కపల్లి 2026 ఎగ్జిక్యూటివ్ టీమ్‌కు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన ఎఫ్ఐఏ కొత్త అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఎఫ్ఐఏ స్వతంత్రంగా నియమించిన అలోక్ కుమార్, జయేష్ పటేల్, కెన్నీ దేశాయ్‌లతో కూడిన ఎన్నికల కమిషన్ 2026 నేతృత్వంలో జరిగిన వార్షిక అంతర్గత సమీక్ష, ఎంపిక ప్రక్రియ తర్వాత.. కమిషన్ సిఫార్సులకు ఎఫ్ఐఏ బోర్డు ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పడిన 2026 కార్యనిర్వాహక బృందం.. 2026 జనవరి 1వ తేదీ నుంచి బాధ్యతలు స్వీకరిస్తుంది. ఈ ఏడాది ఎఫ్ఐఏ పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. ఎన్నికల కమిషన్, ఎఫ్ఐఏ బోర్డు కలిసి కార్యనిర్వాహక బృందాన్ని క్రమబద్ధీకరించాలని.. ఈ కౌన్సిల్‌ను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాయి.

ఇక ప్రస్తుత ఎఫ్ఐఏ అధ్యక్షుడు సౌరిన్ పారిఖ్ తర్వాత శ్రీకాంత్ అక్కపల్లి ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. వైస్ ప్రెసిడెంట్‌గా ప్రీతి రే పటేల్.. జనరల్ సెక్రటరీగా సృష్టి కౌల్ నరులా కొనసాగనున్నారు. రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, మీడియా వంటి పలు రంగాల్లో అపార అనుభవం ఉన్న శ్రీకాంత్ అక్కపల్లి.. ఎఫ్ఐఏ సంస్థ ప్రాంతీయ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవిని పొందిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. 

50 ఏళ్లకు పైగా అమెరికాలో సేవలు అందిస్తున్న ఈ ఎఫ్ఐఏ స్వచ్ఛంద సంస్థకు కాంగ్రెషనల్ రికార్డ్‌లో గుర్తింపుతోపాటు.. ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు, రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు కూడా ఉండటం విశేషం.
ఇక ఎఫ్ఐఏ కొత్త అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి.. ఒక బిజినెస్‌మెన్. ఆయన బిజినెస్‌లు అమెరికాలోనే కాకుండా భారత్‌లోనూ విస్తరించి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్, టెక్నాలజీ, మీడియా, ప్రవాస భారతీయ భాగస్వామ్యం వంటి రంగాల్లో ఆయన వ్యాపారాలను విస్తరించారు. 

మల్టీ నేషనల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ట్రాన్సిట్ టెక్నాలజీ కన్సల్టింగ్, లైఫ్ సైన్సెస్, ఐటీ, క్లౌడ్ కంప్యూటింగ్, క్రీడా సామగ్రి తయారీ, ప్రీమియం ఫర్నిచర్ డిజైన్ వంటి విభిన్న రంగాల్లో ఉన్నాయి. ఇక ఎఫ్ఐఏ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మాట్లాడిన శ్రీకాంత్ అక్కపల్లి.. తనకు మద్దతు తెలిపిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

ఇది అదృష్టంగా భావిస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాలోని తూర్పు తీరంలో ఉన్న 8 రాష్ట్రాల్లో భారతీయ సమాజాన్ని ప్రతిబింబిస్తూ.. 1970లో లాభాపేక్ష లేకుండా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ యూఎస్‌ఏను ఏర్పాటు చేశారు. గత 50 ఏళ్లుగా అమెరికాలో ఈ సంస్థ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.

By
en-us Political News

  
అర్ధరాత్రి  దాటిన తర్వాత కూడా భారీ శబ్దాలు వచ్చేలా టపాసులు కాలుస్తూనే ఉన్నారని పేర్కొన్న రేణూ దేశాయ్ పండుగ రోజుల్లో తాను ఏదైనా మాట్లాడితే అనవసరంగా తనను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేస్తారనే భయంతోనే  దీపావళి రోజు తాను మౌనంగా ఉన్నానన్నారు.,
. తామిరువురం పరస్పర అవగాహనతో ఒకరిపై ఒకరుసంపూర్ణ గౌరవంతో విడిపోతున్నామని వారా ప్రకటనలో పేర్కొన్నారు.   తమ వివాహ బంధం ఒక ముగింపునకు వచ్చిందని పవన్, అన్నా ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. భార్యాభర్తలుగా తమ విడిపోయినప్పటికీ స్నేహితులుగా  కలిసే ఉంటామని పేర్కొన్నారు.
మీమ్ పేజీలు, మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు,  సోషల్ మీడియా యూజర్లు ఎవరైనా సరే ఈ వైరల్ కంటెంట్‌ను రీపోస్ట్ చేయడం, అప్‌లోడ్ చేయడం,  షేర్ చేయడం తక్షణమే ఆపాలని సురేఖ వాణి  పేర్కొన్నారు.
అమెరికాలో వైద్యులను సంప్రదించకుండా చాట్‌జీపీటీ సలహా మేరకు మూర్ఛ మందుల మోతాదును తగ్గించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బోవెన్ వాన్ ఆకస్మిక మృతి చెందింది. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు OpenAIపై వేసిన సంచలన దావా వివరాలు.
హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వారిరువురూ బేగంపేటలో  ఐటీసీ కాకతీయ హోటల్‌లో సోమవారం (నవంబర్ 2)న కలిశారు.  ఈ సందర్భంగా వారు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న  సైబర్ సవాళ్ల ను వివరించారు. ప్రధానంగా ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం, డీప్ ఫేక్, మార్ఫింగ్ ద్వారా సినీ ప్రముఖుల ఫొటోలు, వీడియోలను అసభ్యకరంగా, అనుచిత రీతిలో అభ్యంతరకరంగా సామాజిక మాధ్యమంలో ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా చిరంజీవి అమిత్ షాకు తెలిపారు.
భారతదేశానికి జంబుద్వీపం అనే పేరు ఎలా వచ్చింది? పూజల సంకల్పంలో జంబుద్వీపం అని ఎందుకు అంటారు? పురాణాలు మరియు చరిత్ర తెలిపే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.
Before choosing a group health insurance plan, you should consider the eligibility criteria and check whether the insurer has a smooth claim processing. Let us explore what are the group health insurance benefits in more detail.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వనరులు, లావాదేవీలపై ఐటీ   ప్రత్యేక దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా పెద్ద మొత్తంలో జరిగిన నగదు లావాదేవీలకు సరైన లెక్కలు లేకపోవడం, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉండటమే ఈ దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అలాంటి అరుదైన, విలక్షణమైన వన్యప్రాణుల జాబితాలో ఇండోనేషియాలోని సులవేసి ద్వీపానికి చెందిన  మ్యాక్రోసెఫాలోన్ మెలియో పక్షి  జాతి ఒకటి. సాధారణ పక్షుల వలె చెట్లపై గూళ్లు కట్టుకుని, గుడ్లను పొదిగే సంప్రదాయ పద్ధతికి ఇది పూర్తి భిన్నం. ఈ పక్షి జీవన శైలి  అడవి కోడిని పోలి ఉంటుంది.
ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వాతావరణ రాడార్లు అందుబాటులోకి రాకముందే..   పూర్వీకులు చెట్లను, జంతువులను, కీటకాలను గమనించి రానున్న విపత్తులను అంచనా వేశారు. ఆ అంచనాలు దాదాపు కచ్చితంగా ఉండేవి. పర్యావరణంలో వచ్చే చిన్న చిన్న మార్పులను,  భూగర్భంలో జరిగే అలజడిని మనుషుల కంటే ముందుగా వృక్షజాలం పశుపక్ష్యాదులు పసిగడతాయని శాస్త్రీయ అధ్యయనాలుచెబుతున్నాయి.
ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు జీవిత విశేషాలు, ఆయన అవలంబించిన వ్యాపార విధానాలు మరియు ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డి.ఎన్. ప్రసాద్  తెలుగువన్ ది జర్నలిస్ట్ మూడో  ఎపిసోడ్‌లో  తెలుగువన్ ఎండీ  రవిశంకర్ తో పంచుకున్నారు.  
ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు కుంటకు వెళ్లిన ముగ్గురు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
న్యూయార్క్ సమీపంలోని ఆల్బనీ ప్రాంతంలో  నివాసముంటున్న ఆమె అమెరికా కాల మానం ప్రకారం గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఖమ్మంలో ఉన్న తన తండ్రి నల్లమల్ల ఆనంద్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే  గుండె నొప్పితో కుప్పకూలిపోయారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.