విజయ్ కు భద్రత ఉపసంహరణ
Publish Date:May 6, 2026
Advertisement
కోలీవుడ్ స్టార్ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌కు తమిళనాడు ప్రభుత్వం అనూహ్య షాక్ ఇచ్చింది. గత కొంతకాలంగా ఆయనకు కల్పిస్తున్న ప్రత్యేక భద్రతను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ముఖ్యమంత్రి స్థాయి ప్రోటోకాల్‌తో కూడిన సెక్యూరిటీని తొలగిస్తూ హోంశాఖ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయ, సినీ పరిశ్రమలోనూ పెద్ద చర్చకు దారితీసింది. గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ వద్ద ఉన్న గన్‌మెన్లను వెనక్కి పిలిపించినట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించి, తొలి ప్రయత్నంలోనే అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీవీకే తాజా ఎన్నికలలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే ఆయనకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన వై కేటగరి భద్రత యథావిధిగా కొనసాగుతోంది. ఈ పరిణామంపై అటు ప్రభుత్వం కానీ, ఇటు విజయ్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు.
http://www.teluguone.com/news/content/security-withdrawn-to-vijay-25-219106.html





