భద్రతా లోపాలు.. భారత్ జోడో యాత్ర కుదింపు?
Publish Date:Jan 19, 2023
Advertisement
రాహుల్ భారత్ జోడో యాత్రను కుదిస్తారా? అనంతనాగ్ ప్రాంతంలో పాదయాత్ర కాకుండా జోడో యాత్ర వాహనాలలో సాగుతుందా? అంటూ కాంగ్రెస్ వర్గాలు ఔననే అంటున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ జోడో యాత్రను కుదించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. అనామక వ్యక్తులు జోడో యాత్రలోని అకస్మాత్తుగా వచ్చి చేరుతున్నారని కాంగ్రెస్ అనుమానిస్తోంది. రాహుల్ ను హగ్ చేసుకోవడానికి ఒక వ్యక్తి భద్రతా వలయాన్ని ఛేదించుకుని రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. రాహుల్ భద్రత విషయంలో సరైన ప్రమాణాలు పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే.. ఆయన సెక్యూరిటీ మాత్రం రాహుల్ గాంధీ భద్రత పరమైన ప్రొటోకాల్ ను పాటించడం లేదని అంటున్నది. ఈ నేపథ్యంలోనే అనంతనాగ్ కు రాహుల్ జోడో యాత్ర చేరుకోగానే పాదయాత్రగా కాకుండా రాహుల్ వాహనంలో ప్రయాణించేందుకు అవసరమైన ఏర్పాట్లను కాంగ్రెస్ చేస్తోంది. అలాగే రూట్ మ్యాప్ లో కూడా మార్పులు చేయాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం రోజుకు పాతిక కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుందడా..దానిని కూడా తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే శ్రీనగర్ లో లాల్ చౌక్ లో భారత జెండా ఆవిష్కరణ కార్యక్రమం రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీ అక్కడ కాకుండా మరో చోట రాహుల్ జాతీయ జెండా ఆవిష్కరిస్తారని చెబుతోంది.
http://www.teluguone.com/news/content/security-lapses-in-rahul-padayatra-25-150226.html





