144 ఏళ్ల సికింద్రాబాద్ ప్రింటింగ్ ప్రెస్ ఇక గత చరిత్ర..!

Publish Date:May 6, 2023

Advertisement

సికింద్రాబాద్ ప్రింటింగ్ ప్రెస్ మూతపడింది. 144 ఏళ్ల పాటు రైల్వేలకుసేవలందించిన ఈ ప్రెస్ చరిత్ర గర్బంలో కలసిపోయింది. సికింద్రాబాద్ లో 144 ఏళ్ల క్రితం నిజాం హయాంలో ఏర్పాటైన ప్రింటింగ్ ప్రెస్ అండ్ ఫామ్స్ డిపార్టమెంట్ ఇక గత చరిత్రగా మిగిలిపోనుంది.  రైల్వే రిజర్వుడు, అన్ రిజర్వుడు ప్రయాణ టికెట్లు, డైరీలు, క్యాలెండర్లు ముద్రించే ఈ ప్రెస్ ని  మూసివేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.

 బైకులా- ముంబయి (మధ్య రైల్వే), హావ్డ్ (తూర్పు రైల్వే), శకుర్ బస్తీ-దిల్లీ (ఉత్తర రైల్వే), రాయపురం-చెన్నై (దక్షిణ రైల్వే)ల్లోని ప్రింటింగ్ ప్రెస్ లనూ మూసివేయనుంది. రైల్వే బోర్డు డైరెక్టర్ గౌరవ్ కుమార్ ఆయా రైల్వేజోన్ల జనరల్ మేనేజర్లకు ఈ మేరకు ఉత్తర్వులు పంపించారు. రిలీవ్ చేసే ఉద్యోగులను ఇతర విభాగాల్లో నియమించాలని సూచించారు. రైలు టికెట్ల విధానం పూర్తిగా డిజిటలైజేషన్ అయ్యేంతవరకు రిజర్వుడు, అన్  రిజర్వుడు టికెట్ల ముద్రణను ఔట్సోర్సింగ్ కు ఇవ్వాలని పేర్కొన్నారు. 1870లో నిజాం స్టేట్ రైల్వే ఆవిర్భవించింది. 1879లో రైలు టికెట్ల ముద్రణ కోసం సికింద్రాబాద్ లో    ప్రెస్ ను ఏర్పాటుచేశారు.

ప్రారంభంలో 1,500 మంది వరకు ఉద్యోగులుండేవారు. స్వాతంత్య్రానంతరం నిజాం స్టేట్ రైల్వే... భారతీయ రైల్వేలో విలీనమైంది. రైల్వేశాఖ టికెట్ల జారీలో డిజిటలైజేషన్ తీసుకురావడంతో ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ 169కి చేరింది. ఆన్లైన్ టికెట్ల విక్రయం 80 శాతానికి చేరడమే రైల్వేశాఖ నిర్ణయానికి కారణం. ఆన్ లైన్ లో టిక్కెట్ల విక్రయం జరుగుతున్న కారణంగా.. ఇక టిక్కెట్ల కోసం ప్రత్యేకంగా ప్రెస్ ను నడపాల్సిన అవసరం లేదని.. రైల్వే బోర్డు భావించి ప్రెస్ ను మూసేసింది.  

అభివృద్ధి ఓ మార్పుకు నాంది.. అయితే అభివృద్ధి వెన్నంటే ..కష్టాలు, బాధలు కూడా ఉంటాయనే అమెరికన్ విద్వాంసుడు ఎమర్సన్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. 

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.