వెంకన్నదేవుడిపై ఎందుకింత కక్ష.. టీటీడీ చైర్మన్ గా నాస్తికుడికి మళ్లీ అవకాశమా?

Publish Date:Aug 7, 2023

Advertisement

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతన చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి నియమితులయ్యారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరసగా రెండు పర్యాయాలు టీటీడీ చైర్మన్‌ పదవిలో కొనసాగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియడంతో అయన స్థానంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పేరును ఖరారు చేశారు. 

నిజానికి గతంలో వైవీ నియామకం విషయంలో చెలరేగిన దుమారం  నేప్యంలో ఈసారి అయినా  హిందూ ధర్మం పట్ల పూర్ణ విశ్వాసం ఉన్న వారికి  టీటీడీ చైర్మన్ పదవి దక్కుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి   టీటీడీ చైర్మన్ పదవి ఆశించిన ముగ్గురిలోంచి భూమనను ఎంపిక చేశారు. భూమన గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ ఛైర్మన్‌గా పని చేశారు. జగన్ రెడ్డి మరో మారు ఆయనకు ఆవకాశం కల్పించారు.  టీటీడీ చైర్మన్ రేసులో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, సిద్ధ రాఘవరావు పేర్లు కూడా వినిపించాయి. చివరకు దేవుని దయతో భూమనకు పదవి వరించింది.

అయితే అదేమీ పాపమో, అదెక్కడి శాపమో కానీ, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు (2006 నుంచి 2008 వరకు) టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా ఉన్నప్పుడే, ఆయనపై అనేక ఆరోపణలొచ్చాయి. నిజ నిజాలు ఏమో కానీ, ఏడుకొండల పవిత్రతను రెండు కొండలకు కుదించాలనే   సంకల్పం భూమన కరుణాకర రెడ్డిదే అంటారు. అలాగే, మిగిలిన్ ఐదు కొండలపై చర్చిలు నిర్మించాలనే   సంకల్పం విషయంలోనూ భూమన భూమిక ఉందనే ఆరోపణలు వచ్చాయి. అలాగే భూమన పై టీటీడీ నిధుల దుర్వినియోగం  వంటి ఇతరత్రా ఆరోపణలు అనేకం ఉన్నాయి. అన్నిటినీ మించి  ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి  బాబాయ్ టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి కొండపై యధేచ్చగా సాగుతున్న అన్యమత ప్రచారం, ఆస్తులు విక్రయం, నిధుల కైంకర్యం, తిరుమలను ఆధ్యాత్మిక స్థాయిని దిగజార్చి, వ్యాపార కేంద్రంగా మార్చేందుకు సాగుతున్న ప్రయత్నాల వంటి అనేక ఆకృత్యాలకు  భూమన కరుణాకర రెడ్డి ఆద్యుడనే అరోపణలున్నాయి.

అందుకే ఇప్పడు కూడా ప్రతిపక్షాలతో పాటుగా,  హిందూ ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థలు కరుణాకర రెడ్డి నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  అన్నిటినీ మించి, భూమనపై అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ వినిపించే ప్రధాన ఆరోపణ  ఆయన నాస్తికుడు.    వెంకన్న స్వామినే కాదు, అసలు దేవుడినే నమ్మని వ్యక్తి గా ముద్ర వేసుకున్నారని అంటారు.  కోట్లాది మంది భక్తులు కొలిచే వెంకన్న దేవుడు  భూమన వారి దృష్టిలో కేవలం ఓ  నల్ల రాయి . అంతే కాదు,  మండే ఎండలో అయినా చెప్పులు లేకుండా కాలినడకన కొండనెక్కే భక్తులనూ అదే తీరుగా అవహేళన చేసిన చరిత్ర భూమనకుందని ఆయన ఒకప్పటి మిత్రులు ఇప్ప్సు సోషల్ మీడియాలో  పాత సంగతేలపే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. 

అలాగే సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వ  మాజీ ప్రధాన కార్యదర్శి, ఐవైఆర్ కృష్ణా రావు మొదలు అనేక మంది భూమన నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు  భూమన నియామకం వెనక  రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సేవా కార్యక్రమల పేరిట తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను దారి మళ్ళించి పందేరం చేసిన విధంగా, రేపటి ఎన్నికలలో గెలిచేందుకు టీటీడీ నిధులను సేవ  పేరున పందేరం చేసే కుట్ర దాగుందనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.మరో వంక   స్వామీ నీ కొద్దీ అన్యమత నాస్తిక చైర్మన్  యాష్ ట్యాగ్ తో భూమన నియామకానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో భక్తులు తమ మొర స్వామి వారికే వినిపించుకుంటున్నారు. అలాగే శాపనార్ధాలు పెడుతున్నారు.  

By
en-us Political News

  
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.