బ్లోఅవుట్ ముప్పు ఎదుర్కొంటున్న కోనసీమ జిల్లా మలికిపురం మండలంఇరుసుమండలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అక్కడ పరిస్థితులు నెమ్మదిగా కుదుటపడుతున్నాయి. గ్రామస్తులు పునరావాస కేంద్రాల నుంచి గృహాలకు చేరుకుంటున్నారు. ఇరుసుమండలో పాఠశాలలు కూడా మళ్లీ తెరుచుకున్నాయి. ఇరుసుమండలోని ఓఎన్జీసీ సైట్ లో బ్లో ఔట్ సంభవించి భారీగా మంటలు ఎగసిపడిన సంగతి తెలిసిందే.
మూడు రోజులు అవుతున్నా మంటలు అదుపులోనికి రాలేదు కానీ, బుధవారం (జనవరి 7) నాటికి మంటల తీవ్రత తగ్గింది. అగ్నికీలలపై 3 వైపుల నుంచి తీవ్ర ఒత్తిడితో కూడిన వాటర్ అంబ్రెల్లా ప్రక్రియతో నీటిని వెదజల్లుతుండడంతో మంటలు కొద్ది కొద్దిగా అదుపులోకి వస్తున్నాయి. మంటలు పూర్తిగా ఆగిపోవడానికి వారం రోజుల సమయం పడుతుందని కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. బ్లో అవుట్ వల్ల ఎలాంటి ముప్పు లేదని ఓఎన్‌జీసీ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా వెల్లడించారు.
బ్లో అవుట్‌కు కారణమైన డీప్ ఇండస్ట్రీస్ నిర్లక్ష్యంపై విచారణ జరపాలని ఎంపీ హరీష్ మాదుర్ కోరారు. ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ చేసే ప్రతి సైట్ వివరాలు ప్రజలకు తెలియజేయాలని ఎంపీ, ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. పాత గ్యాస్ పైపులైన్లు మార్చాలని కూడా కోరుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/schools-reopend-in-irusumanda-36-212149.html
హైదరాబాద్ నగర శివారులోని మీర్‌పేట్ ప్రాంతంలో చోటు చేసుకున్న విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు.
పక్క రాష్ట్రంతో సయోధ్య లేకుండా తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రాదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డికి హైకోర్టులో కీలక ఊరట లభించింది.
పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల్లో ఆయన మాట్లాడారు.
ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న గవర్నర్‌కు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగింది. గవర్నర్ కార్యాలయానికి ఈ- మెయిల్ అందగానే ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు.
గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డ్రగ్స్ కేసులో నవదీప్‌ను నిందితుడిగా చేర్చడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఈ కేసుపై విస్తృతంగా వాదనలు విన్న హైకోర్టు.. నవదీప్ వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలూ స్వాధీనం కాలేదని స్పష్టం చేసింది.
టాలీవుడ్ హీరో నవదీప్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పేరుతో...ఫేక్ నెంబ ర్ తో..ఆయన ఫొటోతో వాట్సాప్ క్రియేట్ చేసి మెస్సేజ్ లు పంపిస్తున్నారని వెల్ల డైంది.
జగన్ హయాంలో డాక్టర్ సుధాకర్ ప్రభుత్వ వైద్యులకు కరోనా మహమ్మారి నుంచి రక్షణకు కనీసం మాస్కులు కూడా ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించడమే జగన్ ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టడానికి కారణమైంది. ప్రభుత్వ డాక్టర్ అని కూడా చూడకుండా.. విశాఖపట్నం వీధుల్లో ఆయనను అర్థనగ్నంగా చేసి, చేతులు వెనక్కి విరిచి కట్టి పోలీసులు ఈడ్చుకెళ్లిన దృశ్యాలు అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.
న్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పశ్చిమబెంగాల్ లోని ఐప్యాక్ ప్రధాన కార్యాలయంలో జరిపిన సోదాలలో.. గతంలో ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఎన్నికల వ్యూహాలపై సహకారం అందించిన సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీల గుట్టు బయటపడింది. ఆ ఆర్థిక అవకతవకలపై కూడా ఇప్పుడు ఈడీ దృష్టి సారించినట్లు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఆ పరిస్థితి లేకుండా చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై టోల్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసింది.
ఆవకాయ అన్నది కేవలం ఆహారం కాదనీ, అది మన సంప్రదాయం సాంస్కృతిక వైభవానికి చిహ్నమనీ చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ హోటళ్లు ఉన్నా, అక్కడ ఏపీ షెఫ్ లు ఉంటారనీ, అదీ ఆంధ్రా వంటలకు ఉన్న ప్రత్యేకత అనీ చెప్పారు.