సీన్ రివర్స్.. నాడు పొగడ్తలు నేడు తెగడ్తలు

Publish Date:Aug 31, 2023

Advertisement

దేనికైనా టైమ్ రావాలంటారు. అలాంటి టైమ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీఅధినేత జగన్‌కు వచ్చింది.. కాదు.. కాదు ఆయన సొంత చెల్లెలు షర్మిల తీసుకువచ్చారన్న ప్రచారం  పోలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది.   జగన్ జైల్లో ఉంటే..  జగనన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి.. జగనన్న గద్దెనెక్కితే రాజన్న రాజ్యం వస్తుందంటూ..  హోరెత్తించేసిన షర్మిల జగనన్న అధికారంలోకి రావడం కోసం పాదయాత్ర సైతం చేశారు.  ఆమె ప్రచారం ఫలితంగా  2019 ఎన్నికల్లో జగన్ పార్టీ 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని ఏపీలో అధికారం చేపట్టింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికల ఫలితాలతో   జగన్ ఎంతగా ఉక్కిరిబిక్కిరి అయ్యారో తెలియదు కానీ..  జగనన్న కళ్లలో ఆనందం చూసి.. షర్మిల మాత్రం ఓ రేంజ్‌లో  సంతోషపడ్డారనడంలో సందేహం లేదు. 

అయితే అలా అధికార పగ్గాలు చేపట్టిన  జగన్‌కి నాటి నుంచి గుడ్ టైమ్ మొదలైతే.. ఆయన సోదరి  షర్మిలకు మాత్రం బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ నేటికీ సాగుతోంది. అయితే సోదరుడు   జగన్ గద్దెనెక్కిన తర్వాత ఒక సారి మాత్రమే వైయస్ షర్మిల రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టారనీ,  ఆ తర్వాత వీరి మధ్య గ్యాప్ రావడంతో.. ఆమె తన తల్లిని తీసుకొని పక్క రాష్ట్రం తెలంగాణ వెళ్లిపోయి కొత్త పార్టీ పెట్టుకున్నారు.  ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలన్నీ అందరికీ తెలిసినవే. 

అలా సోదరుడు  జగన్‌కి వైయస్ షర్మిల దూరం జరిగితే.. మరోవైపు  జగన్‌ని  గతంలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వారు.. అంటే జగన్ కేబినెట్‌లోని పలువురు మహిళా మంత్రులు.. ఆర్కే రోజా, విడదల రజినీ తదితరులు  సీఎం జగనన్నకు రాఖీ కట్టి ఆయనను తమ సోదరుడని చెప్పుకుంటున్నారు.. గతంలో  రోజా టీడీపీలో ఉన్నప్పుడు.. మహానేత  రాజశేఖర్ రెడ్డిని ఎన్ని మాటలన్నారో అందరికీ తెలిసిందేనని... అలాగే ఇక విడదల రజినీ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు.. 2017లో విశాఖ వేదికగా జరిగిన మహానాడులో మాట్లాడుతూ.. నరకాసురులు ఎవరంటే   జగన్‌,  ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలను చూపించాలంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత వీరిద్దరు వైసీపీలో చేరి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చక్రం తిప్పుతున్నారు.  

అందలం ఎక్కిన వారు.. అందలం ఎక్కించిన వారిని దూరం చేసుకొంటే.. ఆ తర్వాత ఏ ఎండుకా గొడుగు, ఏ రోటి దగ్గర ఆ పాట పాడే.. భజన బ్యాచ్ అన్ని చోట్ల... అన్ని వేళలా రెడీగా ఉంటుందనీ, ఆ బ్యాచ్ గాని రంగంలోకి దిగితే... ఆ తర్వాత.. మళ్లీ ఎన్నికల వేళ.. మన కోసం కష్టపడే వారి కోసం దుర్భిణీ వేసి వెతుక్కోవాల్సి ఉంటుందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎందుకంటే.. భజన చేసే వాళ్లు, రాఖీ కట్టే వాళ్లు ఈ రోజు ఉండవచ్చు.. కానీ రేపు అధికారం  దూరం అయితే.. వీళ్లంతా స్వతంత్ర అభ్యర్థుల్లాగా కోతి కొమ్మచ్చి ఆటలతో మరో పార్టీలోకి జంప్ చేసే అవకాశాలు నూటికి నూరుశాతం  ఉన్నాయనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌ వాడివేడిగా కొనసాగుతోంది. ప్రస్తుతం జగన్ సోదరి షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ రాజకీయాలలో కీలక పాత్ర పోషించనున్నారన్న వార్తతో జగనన్న నాడు వదిలిన బాణం ఇప్పుడు రివర్స్ లో  వస్తోందనీ, ఇది జగన్ కు కచ్చితంగా ఇబ్బంది కలిగించే అంశమేననీ అంటున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.