అక్రమాస్తుల కేసులో జగన్రెడ్డి సంస్థలకు సుప్రీం నోటీసులు
Publish Date:Jul 5, 2023
Advertisement
అక్రమాస్తుల కేసులో జగన్ సంస్థలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్, విజయసాయిరెడ్డికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. కాగా జగన్ అక్రమాస్తుల కేసులో తెలంగాణ హైకోర్టు నో డివిజన్ బెంచ్ తీర్పును ఈడీ సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. సెప్టెంబర్ 5లోగా సమాధానం చెప్పాలని జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్, ఈ కేసులో ఏ2 అయిన విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో తొలుత సీబీఐ చార్జిషీట్లపై తొలుత సీబీఐ చార్జి షీట్లపై తేల్చాలనీ, ఆ తరువాతే ఈడీ కేసుల విచారణ చేపట్టాలని పేర్కొంటూ గత ఏడాది సెప్టెంబర్ లో తీర్పు వెలువరించింది. ఒక వేళ సీబీఐ, ఈడీ సమాంతరంగా విచారణ జరిపినప్పటికీ సీబీఐ కేసులు తేలేవరకూ ఈడీ కేసులపై తీర్పు వెలువరించరాదని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ తీర్పులో పేర్కొంది. సీబీఐ, ఈడీ కేసులు వేర్వేరని.. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విచారణ చేపట్టవచ్చని గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. సీబీఐ కేసులు కనుక వీగిపోతే.. ఈడీ కేసులే ఉండవు కదా అని కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ తీర్పులో పేర్కొంది. కాగా ఈడీ తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది. ఈడీ పిటిషన్ పై విచారించిన సుప్రీం కోర్టు జగన్ సంస్థలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది.
http://www.teluguone.com/news/content/sc-notieces-to-jagan-companies-39-157886.html





