Publish Date:Feb 17, 2025
వంశీ కనుసన్నలలోనే టీడీపి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ కిడ్నాప్ జరిగిందనడానికి పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారా? ఆయన కిడ్నాప్ నకు సంబంధించి సీసీ ఫుటేజీల ఆధారంగా వంశీ ప్రమేయాన్ని నిర్థారించుకున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. ఇప్పటికే పోలీసులు సత్యవర్థన్ ను రాయదుర్గంలోని వల్లభనేని వంశీ నివాసానికి తీసుకువెళ్లన సంఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీని సేకరించారని చెబుతున్నారు. రాయదుర్గంలోని వల్లభనేని వంశీ నివాసం నుంచి సత్యవర్థన్ ను విశాఖ తరలించడం, అక్కడ నుంచి విజయవాడ కోర్టుకు తీసుకురావడం వరకూ పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉందని అంటున్నారు. వంశీ అనుచరులు సత్యవర్థన్ ను విశాఖ నుంచి విజయవాడ కోర్టుకు తీసుకురావడం, సత్యవర్థన్ కారు దిగి కోర్టులోకి వెళ్లి.. తిరిగి రావడం, అతడు వచ్చే వరకూ కోర్టు ఆవరణలోనే వంశీ అనుచరులు వేచి ఉండటానికి సంబంధించి సీసీ ఫుటేజీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో వల్లభనేని వంశీ ప్రమేయానికి సంబంధించిన లింకుల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వల్లభనేని వంశీని అరెస్టు చేసినప్పటికీ అతడి ఫోన్ ఇంకా పోలీసులకు చిక్కలేదు. అటు రాయదుర్గంలోని వంశీ నివాసంలోనూ, ఇటు వంశీ వద్దా ఆ ఫోన్ లేదు. రాయదుర్గంలోని వంశీ నివాసం నుంచి అతడిని అదుపులోనికి తీసుకోవడానికి ముందు వంశీ ఫోన్ లో చాలా సేపు మాట్లాడారు. ఆ తరువాత ఆ ఫోన్ మాయం అయ్యింది. దీంతో ఈ కేసులో అత్యంత కీలకమైన రంగా, కొట్లు, రాము అనే వ్యక్తుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ కేసులో 12 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. మరీ ముఖ్యంగా రంగా, కొట్లు, రాము అనే వ్యక్తులను దొరకబుచ్చుకంటే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. వీళ్లందరి ఫోన్లూ స్విచ్ఛఫ్ అయ్యి ఉండటంతో.. పోలీసులు వారి బంధువులు, స్నేహితులకు వచ్చే కాల్స్ పై నిఘా పెట్టారు.
ఇలా ఉండగా సత్యవర్థన్ తన కిడ్నాప్ నకు సంబంధించి ప్రతి విషయాన్నీ పూసగుచ్చినట్లు పోలీసులు వివరించాడు. ఈ నేపథ్యంలో ఈ కేసులో వంశీ పూర్తిగా ఇరుక్కున్నట్లేనని న్యాయ నిపుణులు అంటున్నారు. అన్ని విషయాలనూ శాస్త్రీయంగా విశ్లేషించి, పక్కా ఆధారాలతోనే వంశీని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/satyavardhan-kidnap-police-have-evidence-of-vallabhaneni-vamshi-link-39-193003.html
Publish Date:Mar 12, 2026
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.