ప్రధాని మోడీకి మతి తప్పింది? అమిత్ షా అన్నారన్న గవర్నర్ కామెంట్లతో కలకలం..

Publish Date:Jan 4, 2022

Advertisement

ప్రధాని నరేంద్ర మోడీకి మతి తప్పిందా? ఆయనకు ఆహంకారం ఎక్కువా ? బీజేపీ కీలక నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారా? అంటే.. మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతోంది. హర్యానాలోని చర్ఖీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సత్యపాల్.. ప్రధానమంత్రి నరేంద్రమోడీపై  సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల విషయమై చర్చించేందుకు ఇటీవల తాను మోడీని కలిసినప్పుడు... రైతుల మరణాలపై ప్రధాని అహంకారంగా మాట్లాడారని అన్నారు సత్యపాల్ మాలిక్. 

ప్రధానితో భేటీ అయిన ఐదు నిమిషాలకే తమ మధ్య వాగ్వివాదం మొదలైందని చెప్పారు సత్యపాల్ మాలిక్. ఆందోళనల్లో 500 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని తాను ఆయన దృష్టికి తీసుకెళ్తూ.. కుక్క చనిపోయినా సంతాపం తెలుపుతారు కదా, మరి రైతుల మరణాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించానని పేర్కొన్నారు. దానికి మోదీ.. ‘‘వారేమైనా నా కోసం చనిపోయారా?’’ అని అహంకారంగా సమాధానమిచ్చారని గుర్తు చేశారు. అప్పుడు తాను ‘‘అవును.. మీరే పాలకులు కాబట్టి’’ అని సమాధానమిచ్చానని చెప్పుకొచ్చారు. చివరికి ఆ సమావేశం వాగ్వివాదంతోనే ముగిసిందని పేర్కొన్నారు. 

తర్వాత అమిత్ షాను కలవమని చెప్పారని పేర్కొన్న మాలిక్.. ఆయనతో జరిగిన సమావేశంలో ఏం జరిగిందో కూడా వెల్లడించారు. షా తనతో మాట్లాడుతూ..  మోడీకి మతి తప్పింది. కొందరు ఆయనను తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పారన్నారు. ఏదో ఒక రోజు ఆయనకు వాస్తవం అర్థమవుతుంది..మీరు మాత్రం ఇవేమీ పట్టించుకోకండని తనకు సూచించారన్నారు మేఘాలయ గవర్నర్. మమ్మల్ని కలుస్తూ ఉండండని అమిత్ షా అని తనతో చెప్పారని సత్యపాల్ మాలిక్ వివరించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన రైతులపై నమోదు చేసిన కేసులన్నింటినీ ప్రభుత్వం ఉపసంహరించాలని కూడా మాలిక్‌ డిమాండ్‌ చేశారు. రైతులకి అన్యాయం జరిగినా, వారి పట్ల అతిగా ప్రవర్తించినా ఆందోళన మళ్లీ మొదలవుతుంని  మాలిక్‌ స్పష్టం చేశారు.

జమ్మూకశ్మీర్‌ను రెండుగా విడగొట్టినప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్‌గా సత్యపాల్‌ మాలికే ఉన్నారు. ఆ తర్వాత ఆయనను గోవా గవర్నర్‌గా పంపించారు. ప్రస్తుతం మేఘాలయ గవర్నర్‌గా ఆయన పనిచేస్తున్నారు. ఇటీవలి కాలంలో మోీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తాజాగా సాగు చట్టాలు, ప్రధాని మోడీ వ్యవహారశైలి, అమిత్ షా రియాక్షన్ కు సంబంధించి సత్యపాల్ మాలిక్ చేసిన కామెంట్ల వీడియో వైరల్ గా మారింది. దేశ రాజకీయాల్లో ప్రకంపనలు స్పష్టిస్తోంది. దీంతో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు సత్యపాల్ మాలిక్. రైతుల సమస్యలపై తాను చెప్పేది వినేందుకు మోదీ ఇష్టపడక అమిత్ షాను కలవమన్నారని అన్నారు. మోడీ అంటే అమిత్ షాకు చాలా గౌరవమని చెప్పారు. మోడీపై చెడుగా షా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, రైతులపై తన ఆందోళన అర్థమైందని మాత్రమే ఆయన చెప్పారని గవర్నర్ మాలిక్ చెప్పుకొచ్చారు. 

మరోవైపు  ప్రధాని నరేంద్ర మోడీకి అహంకారం ఎక్కువని మాలిక్‌ అన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆ అహంకారమే ప్రజాస్వామ్యంలో ఆందోళనకు కారణమని పేర్కొంది. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు.  గవర్నర్‌ చెప్పినా సరే, నిజాలు వినేందుకు మోదీ సిద్ధంగా లేరు.. ఆయనకు కావాల్సింది పొగడ్తలేనని విమర్శించారు. 

By
en-us Political News

  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.