నిందితులకే ఓదార్పులూ, పరామర్శలూ.. జగన్ తీరుపై మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు.!

Publish Date:Aug 8, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్  మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ  అధినేత  జగన్  నిర్వహిస్తున్న ఓదార్పు, పరామర్శ యాత్రలపై రాష్ట్ర ఆఱోగ్య శాఖ మంత్రి అనగాని సత్యకుమార్ ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పించారు.  సాధారణంగా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు బాధితులను పరామర్శించడం సంప్రదాయమేననీ, కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితులను వదిలేసి నిందితులను పరామర్శిస్తున్నారనీ, ఓదారుస్తున్నారనీ అన్నారు. నిజంగానే నిందితులను పరామర్శించి, ఓదార్చే ఓ విచిత్ర సంస్కృతికి జగన్ తెరలేపారని ఎద్దేవా చేశారు.   

ధర్మవరంలో  నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ సభలో పాల్గొన్న  మంత్రి.. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పరామర్శల తీరు అత్యంత  భిన్నంగా, విడ్డూరంగా ఉందటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏదైనా ప్రాంతంలో అన్యాయం లేదా హింస జరిగినప్పుడు ఆ ఘటనలో  నష్టపోయిన బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించడం, అండగా ఉంటానంటూ భరోసా ఇవ్వడం బాధ్యత కలిగిన నాయకులు చేసే పని అన్న మంత్రి సత్యకుమార్ యాదవ్..  అయితే  వైసీపీ అధినేత  జగన్ మాత్రం బాధితుల వేదనను,   కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు. మంత్రి సత్యకుమార్ జగన్ పరామర్శల తీరును ఎండగడుతూ సంధించిన వ్యంగ్యాస్త్రాలతో  సభా ప్రాంగణమంతా నవ్వులతో మార్మోగిపోయింది.   సత్యకుమార్ ప్రసంగం వీడియోలు సామాజిక మాధ్యమ వేదికలలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.  

మొత్తానికి ధర్మవరం చేనేత దినోత్సవ సభ వేదికగా జగన్ పరామర్శల తీరుపై మంత్రి సత్యకుమార్ చేసిన సెటైర్లు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ప్రజా సమస్యలు, నిజమైన బాధితుల వేదన కంటే రాజకీయం చేసేందుకు ప్రతిపక్షం ఆరాటపడుతోందనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ వ్యాఖ్యలు తోడ్పడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులోనూ పరామర్శలు, రాజకీయ పర్యటనల చుట్టూ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత శృతిమించే అవకాశం ఉంది.

Satya Kumar Yadav, YS Jagan Mohan Reddy, Satya Kumar Comments on Jagan, Dharmavaram Handloom Day, AP Political News TeluguOne

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.