అప్పుడు బేడీలు.. ఇప్పుడు ధర్నాలా! తెలంగాణ సీఎంపై నెటిజన్ల సెటైర్లు 

Publish Date:Dec 7, 2020

Advertisement

నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం మరింత తీవ్రమైంది. రైతు సంఘాలు పిలుపిచ్చిన భారత్ బంద్ కు  దేశంలోని పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా  రైతుల సమరానికి సపోర్ట్ చేశారు. భారత్ బంద్ లో టీఆర్ఎస్ కార్యకర్తలంతా భారీగా పాల్గొనాలని కేసీఆర్ పిలుపిచ్చారు.  కేంద్రం తెచ్చిన కొత్త బిల్లులు, ఢిల్లీ సరిహద్దులో రైతులకు అడ్డుకోవడంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు మద్దతుగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తెలంగాణలో నిరసనలను ఉక్కుపాదంతో అణిచివేస్తూ.. ఇప్పుడుఢిల్లీ సరిహద్దులో  రైతులను అడ్డుకోవడాన్ని తప్పుపట్టడంపై నెటిజన్లు ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు. ఢిల్లీ సరిహద్దుతో అన్నదాతలు చేస్తున్న పోరాటానికే మద్దతు ఇస్తూనే.. గతంలో రైతుల పట్ల కేసీఆర్ వ్యవహరించిన తీరును ఎండగడుతున్నారు.

 

2017 ఏప్రిలో లో  ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర పంటను కొనుగోలు చేయాలంటూ ధర్నాకు దిగిన మిర్చి రైతులకు బేడీలు వేసి.. 12 రోజుల  పాటు  జైలుకు పంపిన విషయం తెలంగాణ ముఖ్యమంత్రి మర్చిపోయినట్లు ఉన్నారని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. అప్పుడు రిమాండ్‌లో ఉన్న రైతులకు  బేడీలు వేసి పోలీసులు  కోర్టుకు తీసుకువచ్చారు. రైతులను కరుడుగట్టిన నేరస్తుల తరహాలో సంకెళ్లతో తీసుకురావడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 2017 ఖమ్మం ఘటనపై సీఎం కేసీఆర్ ముందు రైతులకు క్షమాపణ చెప్పాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.  మక్కజొన్నలు కొనాలంటూ ఉత్తర తెలంగాణ రైతులు.. సన్నాలకు మద్దతు ధర ఇవ్వాలంటూ దక్షిణ తెలంగాణ రైతులు ఆందోళనలు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదని కేసీఆర్ ను సోషల్ మీడియా వేదికగా  నిలదీస్తున్నారు. రైతుల ఉద్యమాలకు తెలంగాణలో ఒక న్యాయం. ఢిల్లీలో మరో న్యాయం ఉంటుందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

 

2017 ఏప్రిల్  28న ఖమ్మం మార్కెట్‌కు సుమారు 2 లక్షల మిర్చి బస్తాలు వచ్చాయి. ఇదే అదనుగా వ్యాపారులు, ఏజెంట్లు కుమ్మక్కై మిర్చిధరను ఒక్కసారిగా తగ్గించేశారు. దీంతో రైతులంతా ఆందోళనకు దిగారు.  ఆగ్రహంతో మార్కెట్‌ కార్యాలయం, చైర్మన్‌ చాంబర్, ఈనామ్‌ కార్యాలయాల్లో ఫర్నీచర్, కంప్యూటర్లను, ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో  అప్పుడు  టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న  సండ్ర వెంకటవీరయ్యతో  పాటు పదిమంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రిమాండ్‌లో ఉన్న రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడం తీవ్ర దుమారం రేపింది. దేశ వ్యాప్తంగా రచ్చగా మారడంతో  పోలీసు ఉన్నతా ధికారులు స్పందించి.. రైతులకు బేడీలు వేసి తీసుకువచ్చిన ఇద్దరు ఏఆర్‌ ఎస్సైలను సస్పెండ్‌ చేశారు. 12 రోజుల తర్వాత  బెయిల్ రావడంతో  పది మంది రైతులు.. 2017 మే 12న విడుదలయ్యారు. 2017లో ఖమ్మంలో జరిగిన ఘటనలు ఉదహరిస్తూ .. ఇప్పుడు కేసీఆర్ ను కడిగి పారేస్తున్నారు సోషల్ మీడియా వారియర్లు . 

 

గత యాసంగిలో నియంత్రిత సాగు విధానం అమల్లోకి తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులతో సంప్రదించకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. నియంత్రిత సాగు విధానం ప్రకారం తాము చెప్పినట్లు సాగు చేస్తేనే... ఆ పంటను కొంటామని ప్రకటించింది. యాసంగిలో మొక్కజొన్న వేయవద్దని సూచించింది.  కొందరు రైతులు మాత్రం స్థానిక పరిస్థితులు. భూమి రకం ఆధారంగా మొక్కజొన్న సాగు చేశారు. అయితే వాళ్ల పంటను కొనుగోలు చేయడానికి అధికారులు నిరాకరించారు. దీంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయినా మక్కలను కొనుగోలు చేయడానికి నిరాకరించింది టీఆర్ఎస్ సర్కార్. అన్నదాతలు ఎంతగా ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. అంతలోనే దుబ్బాక ఉప ఎన్నిక రావడంతో.. తమకు ఎక్కడ ఇబ్బంది అవుతుందోమోనన్న భయంతో దిగొచ్చి మక్కల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. సన్నాలకు మద్దతు ధర కోసం కొన్ని రోజులుగా రైతులు ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించ లేదు. దీంతో తాము పండించిన పంటతో తమకు గిట్టుబాటు కావడం లేదంటూ కొందరు రైతులు తం పంటలకు నిప్పు కూడా పెట్టుకున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను తమ పోస్టులకు జత చేస్తూ కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. 

 

తెలంగాణలో కొంత కాలంగా ఎలాంటి ఆందోళనలు, నిరసనలకు అనుమతి ఇవ్వడం లేదు. హైదారాబాద్ లో దశాబ్దాలుగా ధర్నా పాయింట్ గా ఉన్న ఇందిరా చౌక్ ను ఎత్తివేసింది కేసీఆర్ ప్రభుత్వం. దీనిపై విపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించినా కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగానే వ్యవహరించింది. ధర్నా చౌక్ తో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు కోరడం వల్లే ధర్నా చౌక్ ను ఎత్తివేశామని కవరింగ్ చేసుకుంది. అయితే ప్రజా సంఘాలు కోర్టుకు వెళ్లి ఇందిరా చౌక్ లో ధర్నా పాయింట్ ను పునరుద్దరించుకున్నాయి. ఇలా  ఇంతగా తెలంగాణలో నిరసనలపై నిర్భంధాలు పెడుతున్న కేసీఆర్ పార్టీ.. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటానికి మద్దతుగా హడావుడి చేయడం రాజకీయ దివాళుకోరుతనానికి నిదర్శనమని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
 

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.