Publish Date:May 14, 2026
కేరళం ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్‌ను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. దాంతో గత పది రోజులుగా కేరళం ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది కేరళం సీఎంగా సతీశన్ పేరును గురువారం (మే 14) ఏఐసీసీ ప్రకటించింది. సీఎం పదవి కోసం సతీషన్‌తో పాటు సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్ , రమేష్ చెన్నితాల పోటీపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు అధిష్ఠానం ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో ఆయనే సీఎం అవుతారని ప్రచారం జరిగింది. అయితే విధేయత లెక్కలు, సీనియర్టీల కన్నా కేరళం క్యాడర్ అభిష్టానానికి తలొగ్గిన కాంగ్రెస్ హైకమాండ్ చివరకు ప్రజా మద్దతున్న సతీషన్ వైపే మొగ్గుచూపింది. సతీషన్‌కు యూడీఎఫ్ భాగస్వామ్య పక్షం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా గట్టి మద్దతు ఇచ్చింది. కేరళ ఎన్నికలలో ఐయూఎంఎల్ 22 సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. భాగస్వామ్యపక్షం ఒత్తిడి కూడా ఈ విషయంలో పనిచేసింది.
ఎల్డీఎఫ్ హయాంలో వి.డి.సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. క్లిష్ట సమయలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. కేరళం కాంగ్రెస్ కేడర్‌లో కూడా ఇదే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సీఎంగా సతీశన్ ను ఎంపిక చేసింది.
వి.డి. సతీశన్ పూర్తి పేరు వడస్సేరి దామోదరన్ సతీశన్. 1964, మే 31న ఆయన జన్మించారు. ఆయన స్వస్థలం ఎర్నాకులం జిల్లాలోని నెట్టూరు. ఈయన తల్లిదండ్రులు విలాసిని అమ్మ, దామోదర మీనన్. భార్య లక్ష్మీప్రియ. సతీశన్ దంపతులకు కుమార్తె ఉన్నిమాయ ఏకైక సంతానం. నాయర్ల కుటుంబంలో పుట్టిపెరిగిన సతీశన్ ఉన్నత విద్యావంతుడు. సోషల్ వర్క్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు సతీశన్ కేరళ హైకోర్టులో పదేళ్లపాటు లాయర్ గా ప్రాక్టీస్ చేశారు. కమ్యునిస్టు కంచుకోటగా ఉన్న పరాపూర్ నుంచి వరుసగా ఆరు సార్లు.. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేరళ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 2001లో కేరళ శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన సతీశన్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు .
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/satheesan-journey-39-219805.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్‌కు, మీమ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.
దీంతో తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
Publish Date:Jun 30, 2026
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.