ఒక్క చాన్స్.. ఎరక్కపోయి ఇచ్చాము!

Publish Date:Apr 11, 2023

Advertisement

సహజంగా ఒక పార్టీ పేరున గెలిచిన ప్రజాప్రతినిధి ఎవరైనా ... లోపల ఎంత అశాంతి ఉన్నా, అంత త్వరగా బయట పడరు. అందులోనూ  రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు అయితే, అసలే పెదవి విప్పరు. కానీ, ఆంధ్ర ప్రదేశ్ లో  అధికార వైసీపీకి చెందిన సర్పంచులు పెదవి విప్పడం కాదు.. నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పేరు పెట్టి మరీ ... తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తున్నారు.   చివరకు, ముఖ్యమంత్రిని ఉద్దేశించి  ‘మీ పార్టీ తరఫున గెలిచామని చెప్పుకొనేందుకు సిగ్గుపడుతున్నాం. మీకు ఓటు వేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం. వైఎస్సార్‌ అంటే అభిమానం. ఆయన బిడ్డగా మిమ్మల్ని నమ్మాం. కానీ మీరు నట్టేట ముంచారు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారు. సర్పంచుల ఆత్మహత్యలు జరిగితే దానికి సీఎం జగనే కారణం” అంటూ ఆగ్రహాన్ని, ఆవేదననూ వ్యక్తం చేస్తున్నారు.  

విజయవాడలో సోమవారం (ఏప్రిల్ 10) జరిగిన ఉమ్మడి కృష్ణా జిల్లా సర్పంచుల సంఘం సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు .. వైసీపీ ప్రభుత్వం తమను నమ్మించి నట్టేట ముంచిందనే అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. అందులో భాగంగానే,  ప్రకాశం జిల్లా చినగానిపల్లె సర్పంచి (వైకాపా), సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్‌,  అందరి ముందూ తన చెప్పుతో చెంపల మీద కొట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. 

అలాగే, రాష్ట్రంలో 80 శాతం మంది సర్పంచులు వైకాపాకు చెందిన వారే ఉన్నారనీ, అందరినీ ఇంటింటికి వెళ్లి జగనన్నే మా భవిష్యత్తు అని చెప్పాలని ఆదేశాలు పంపుతున్నారని, అలా చెప్పాలంటే సిగ్గుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత డబ్బులు ఖర్చు చేసి సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మిస్తే బిల్లులు విడుదల చేయలేదని, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డామని రమేష్ వాపోయారు. అలాగే, మరో అధికార పార్టీ నేత, సర్పంచి కొండబాబు మాట్లాడుతూ  పాము పిల్లలను పామే తిన్నట్లు సీఎం జగన్‌ పరిస్థితి తయారైందని మండిపడ్డారు.  సర్పుంచులు సమస్యలు చెబితే కేసులు పెడుతున్నారు. ఏదైనా అడిగితే ఎదురు దాడి చేస్తున్నారు. సమాంతర వ్యవస్థలను పెట్టి మా విధులు, నిధులు లాక్కొన్నారు. సర్పంచిగా గెలిచి రెండేళ్లు అయింది. ఒక్క బిల్లు రాలేదు  అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా వైకాపా నాయకుడు, సంఘం గౌరవ సలహాదారుడు ఆచార్యులు మాట్లాడుతూ  జగనన్నే మా భవిష్యత్తు అని స్టిక్కర్లు వేయమంటున్నారు. కానీ పంచాయతీల భవిష్యత్తు ఏమిటి జగనన్నా అని మనం స్టిక్కర్లు వేయాలి’ అని పిలుపు నిచ్చారు.  

గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం పంచాయతీలకు ఇచ్చిన నిధులు రూ.2020 కోట్లు ఏమాయ్యయని సర్పంచుల సంఘం వ్యవస్థాపకుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ప్రశ్నించారు. సచివాలయాల కార్యదర్శులు, గ్రామ వాలంటీర్లతో సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసి పంచాయతీలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. నిజానికి, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఒక్కొక్క వ్యవస్థను నిర్వీర్యంచేస్తూ వస్తోందనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఎక్కడెక్కడి నిధులూ పట్టుకుపోయి, మీట నొక్కుడు ఖాతాలో..  కాదంటే ... సొంత ఖజానాలో వేసుకోవడమే కానీ, స్థానిక సంస్థల అవసరాలను తీర్చింది లేదు. అందుకే వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజాగ్రహం పతాక స్థాయికి చేరుకుంది. ఇప్పడు ఆ ఆగ్రహం అసంతృప్తి సర్పంచులను తాకింది...  చెప్పుతో కొట్టుకునే స్థితికి చేర్చింది. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు చెప్పుతో కొట్టుకోవలసిన పరిస్థితి వచ్చిందని సర్పంచులే కాదు సామాన్యులు కూడా వపోతున్నారని, జనవాక్యంగా వినిపిస్తోంది.

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.