టీటీడీ బోర్డు సభ్యుడిగా శరత్ చంద్రారెడ్డి ప్రమాణం

Publish Date:Sep 5, 2023

Advertisement

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా పి. శరత్ చంద్రారెడ్డి మంగళవారం ( సెప్టెంబర్ 5)న ప్రమాణ స్వీకారం చేశారు.  అయితే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల నియామకంలో నేరచరితులకు స్థానం కల్పించడం వివాదాస్పదంగా మారింది. ఈ నియామకాలను సవాల్ చేస్తు ఏపీ హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది.  నేరచరిత్ర, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్న వారిని టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడం సరి కాదని చింతా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. టీటీడీ బోర్డు సభ్యులుగా  ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డి నియామకాలను ఆయన ఆ పిటిషన్ లో సవాల్ చేశారు. ఈ ముగ్గురిరీ టీటీడీ సభ్యులుగా తొలగించాలని పిటిషన్‌లో రోరారు.

 తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల నియామకం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉందని అటువంటి బోర్డులో నేర చరితులు, మద్యం వ్యాపారులకు స్థానం కల్పించడం సరికాదని  పేర్కొన్నారు.  అదలా ఉండగా కలియుగ   దైవం తిరుమల శ్రీవారి దేవస్థానం విషయంలో ఏపీ ప్రభుత్వం లెక్కలేని తనంగా నిర్ణయాలను తీసుకుంటున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  టీటీడీ చైర్మన్‌  వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియగానే ఆ స్థానంలో భూమన కరణాకర రెడ్డిని కూర్చోబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి.   నాస్తికుడైన భూమనకు టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టడం ఏంటని ఆరోపణలు వెల్లువెత్తాయి.

భక్తులపై చిరుతల దాడులు, నడక మార్గంలో వన్య ప్రాణుల సంచారం, భక్తుల భద్రతకు టీటీడీ చర్యలు తీసుకోలేదంటూ విమర్శలు వెల్లువెత్తగా.. కాలినడకన వెళ్లే భక్తులకు ఊత కర్రలు ఇచ్చి క్రూర మృగాలను తరమాలనడంపై కూడా  సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్స్ వచ్చాయి. ఆ విమర్శలు అలా కొనసాగుతుండగానే జగన్ సర్కార్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులను నియమించింది.  జగన్ సర్కార్ ప్రకటించిన బోర్డు సభ్యులలో ఇద్దరి నియామకం తీవ్ర వివాదాస్పందంగా మారింది.   వారిలో ఒకరు డిల్లీ లిక్కర్ స్కాంలో  అరెస్టై, అప్రూవర్‌గా మారి బెయిలుపై వచ్చిన శరత్‌చంద్రారెడ్డి కాగా, మరొకరు 2001లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఉంటూ అక్రమాలకు పాల్పడి అరెస్టై ఉద్వాసనకు గురైన  యూరాలజిస్ట్ డాక్టర్ కేతన్ దేశాయ్. వీరిరువురినీ టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడంతో టీటీడీ దొరికిపోయిన దొంగలకు పునరావాస కేంద్రంగా మారిందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 ఈ నేపథ్యంలోనే కేతన్ దేశాయ్ ఇప్పటికే టీటీడీ బోర్డు మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేయగా.. తాజాగా ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడికి స్వయానా సోదరుడు.

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.