సంజూ విశ్వరూపం.. ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ సునాయాస విజయం

Publish Date:May 5, 2026

Advertisement

ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 8 వికెట్ల తేడాతో చెన్నై చిత్తు చేసింది.  టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు సంజూ శాంసన్ అజేయ అర్ధసెంచరీతో చెలరేగడంతో..  చెన్నై సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.  

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. చెన్నై బౌలర్ల ధాటికి ఢిల్లీ టాపార్డర్   కుప్పకూలింది. అయితే, మధ్య ఓవర్లలో సమీర్ రిజ్వీ  40 నాటౌట్,  స్టబ్స్ 38 పరుగులతో  బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లతో రాణించి ఢిల్లీని కట్టడి చేశాడు.

అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 6 పరుగులు, , ఉర్విల్ పటేల్ 17 పరుగులు చేసి త్వరగా పెవిలియన్ చేరారు.  అయితే సంజూశాంసన్, కార్తీక్ శర్మను సమయోచితంగా ఆడి ఇన్నింగ్స్ ను కుదుట పరిచారు. మొదట మెల్లిగా మొదలెట్టినా ఆ తరువాత సంజూ శాంసన్ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగాడు. కేవలం 52 బంతుల్లోనే ఏడు ఫోర్లు, అరడజను సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సంజూకు చక్కిటి సహకారం అందించిన కార్మీక్ శర్మ 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి మూడో వికేట్ కు అజేయంగా 114 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఫలితంగా 156 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే ఛేదించిన చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది.  

By
en-us Political News

  
ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రంప్ కు స్వాగతం పలికేందుకు చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్ స్వయంగా విమానాశ్రయానికి రావడమే చైనా అగ్రరాజ్యాధినేత పర్యటనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నది అవగతమౌతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈల పాత్ర అత్యంత కీలకమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ పెవిలియన్‌లో మెగా గ్రోత్ కారిడార్ ప్రణాళికలపై ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు సీఎం చంద్రబాబు తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించారు.
రాష్ట్రాన్ని ఆర్ధికంగా మరింత పటిష్ట పరిచేందుకు వ్యవస్థలో సామర్ధ్య పెంపు జరగాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.
ప్రజాస్వామ్యం వచ్చింది. పాలకుండలాంటి ఓటు హక్కును తెచ్చింది.
నీట్ యూజీ–2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు దర్యాప్తు నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ వ్యవహారంలో చిక్కుకుని చివరకు సస్పెన్షన్‌కు గురయ్యాడు.
గచ్చిబౌలి ప్రాంతంలో లిఫ్టులు ఇరుక్కుని చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బంగారాన్ని బ్యాంకింగ్ రంగంలోకి తీసుకొచ్చి, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది.
అనంతబాబు సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్నది ప్రధాన ఆరోపణ. కేసులోని కీలక సాక్షులను ప్రలోభపెట్టడమే కాకుండా, తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన బెదిరించినట్లు పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.