మహేష్ బాబు ఇంటర్వ్యూ బై హీరోయిన్ సమంత
Publish Date:Nov 30, 2014
Advertisement
హూద్ హూద్ తుఫాను బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు తెలుగు చిత్రపరిశ్రమ ‘మేము సైతం’ అంటూ ఏకధాటిగా 12గంటల పాటు అనేక వినోద, క్రీడా కార్యక్రమాలు నిర్వహించింది. యావత్ చిత్రసీమ అందులో పాల్గొనేందుకు స్వచ్చందంగా ముందుకు కదిలి వచ్చింది. ఆ కార్యక్రమాలలో భాగంగా టాలీవుడ్ అందాల తార సమంత ప్రిన్స్ మహేష్ బాబు మరియు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లను ఇంటర్వ్యూ చేసారు. ఆమె అడిగిన ఒక ప్రశ్నకు త్రివిక్రమ్ బదులిస్తూ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా నిరాడంబరంగా ఉంటారు. వారిద్దరూ కూడా చాలా అల్ప సంతోషులు. వారికి లగ్సరీ కార్లు, విలాసవంతమయిన బంగ్లాలు కావాలనుకోరు. వేసుకోవడానికి ఓ రెండు జతలబట్టలు, తల దాచుకొనేందుకు ఒక చిన్న ఇల్లు, చదువుకొనేందుకు బ్యాగులో ఓ రెండు పుస్తకాలు ఉంటే చాలు వారికి మరేమీ అవసరం ఉండదు. ఒకసారి కధ విని ఒకే చెప్పేసిన తరువాత ఇక షూటింగులో ఎటువంటి ప్రశ్నలు వేయకుండా నిశబ్దంగా చెప్పిన పని చేసుకుపోతారు. వారిలో ఆ గొప్ప లక్షణాలే నన్ను వారికి దగ్గరగా చేర్చాయని భావిస్తున్నాను,” అని అన్నారు. అప్పుడు మహేష్ బాబు మాట్లాడుతూ, “ఒకసారి దర్శకుడు చెప్పిన కధ విని ఒప్పుకొన్న తరువాత మధ్యలో మళ్ళీ సందేహాలు లేవనెత్తడం మంచిపద్ధతి కాదని నా అభిప్రాయం. దర్శకుడికి తన కధను సినిమాగా ఎలా మలచాలో అందరికంటే బాగా తెలుసుటుంది కనుక ఆయన చెప్పినట్లు ఫాలో అయిపోవడమే మంచిది. అలాగని సినిమా ఫెయిల్ అయితే ఆయన ఒక్కడినే తప్పు పట్టడం కూడా సరికాదు. ఎందుకంటే సినిమా అనేది అందరి సమిష్టి కృషి కారణంగా తయారయినది,” అని అన్నారు. సమంత అడిగిన ఒక ప్రశ్నకు మహేష్ బదులిస్తూ, “నేను రీమేక్ సినిమాలలో నటించడానికి ఎందుకు ఇష్టపడను అంటే, సినీ నిర్మాణం అనేది ఒక సృజనాత్మక రంగం. అందులో నిత్యం ఏదో ఒక కొత్తదనం కోసం ప్రయత్నం అవసరమని నేను భావిస్తాను. అప్పటికే రిలీజ్ అయ్యి కొన్ని లక్షలమంది చూసేసిన సినిమాను మళ్ళీ తీయడం అందులో నేను ఎవరినో ఊహించుకొంటూ నటించడం నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే నేను రీమేక్ సినిమాలలో నటించడానికి ఇష్టపడను,” అని అన్నారు. త్రివిక్రమ్ అడిగిన ప్రశ్నకు సమంతా జవాబిస్తూ, “నేను దక్షిణాదిన అందరో అగ్ర హీరోలతో కలిసి పనిచేసాను. బేసిక్ గా కొన్ని గొప్ప లక్షణాలు అందరిలో ఒక్కలాగే ఉండటం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నిరాడంబరంగా ఉండటం, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా కష్టపడి పనిచేయడం, చేసేపని పట్ల పూర్తి శ్రద్ద, ఎటువంటి బేషజాలు లేకుండా సెట్స్ లో అందరితో కలిసిపోవడం వంటివన్నీ వారిని ఈ స్థాయికి తీసుకువచ్చి నిలిపాయని నేను భావిస్తున్నాను. వారెవరిలో కూడా తాము ఒక పెద్ద హీరో అనే ఫీలింగ్ లేకుండా చాలా నిరాడంబరంగా, దర్శకుడు చెప్పినట్లుగా క్రమశిక్షణతో పనిచేయడమే వారి విజయ రహస్యమని నాకు అర్ధమయింది. “ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ప్రతీ సినిమాను మొదటి సినిమాగానే భావించి అందులో నుండి కొత్త విషయాలు నేర్చుకొంటూ ఉండాలి” అని హీరో సూర్యా చెప్పిన సలహా నేటికీ నా బుర్రలో అలా మెదులుతూ నన్ను ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేట్లు చేస్తుంటుంది,” అని అన్నారు.
http://www.teluguone.com/news/content/samantha-32-40730.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.