మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టు.. ముందుముందు మరింత మంది?

Publish Date:Apr 26, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆరవ నిందితుడిగా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డిని శుక్రవారం(ఏప్రిల్ 25) సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని  విజయవాడకు తరలించారు. శనివారం (ఏప్రిల్ 26) కోర్టులో హాజరు పరచనున్నారు.   ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డిని పోలీసులు ఇప్పిటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజ్ కసిరెడ్డి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు. 

వైసీపీ హయాంలో మద్యం క్రయ విక్రయాల్లో రూ.3,200 కోట్ల కుంభకోణం జరిగినట్లు సిట్ అధికారులు ధృవీకరించారు. ఈ లిక్కర్ స్కామ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఇటీవల టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభలో కోరడంతో పాటు ఇందుకు సంబంధించిన వివరాలను హోంమంత్రి అమిత్ షా‌ను కలిసి అందించారు. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. నిందితుల అరెస్టుపై దృష్టి సారించింది.  

అదలా ఉంటే మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తొలుత ఈ కేసులో వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సాక్షిగా విచారణకు పిలిచిన అధికారులు.. చార్జిషీట్ లో మాత్రం నిందితుడిగా చేర్చారు. దీనిని బట్టి విజయసాయిని అప్రూవర్ గా మార్చేందుకు అధికారులు రంగం సద్ధం చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి  విశ్లేషణలకు వాస్తవమేననడానికి చార్జిషీట్ లో తనను నిందితుడిగా చేర్చినట్లు తెలియగానే.. విజయసాయి మద్యం కుంభకోణానికి సంబంధించినంత వరకూ తనకు తెలిసిన ప్రతి విషయం, ఈ స్కాంతో సంబంధం ఉన్న అందరి  గురించీ చెబుతానంటూ ఓ ట్వీట్ చేశారు.  దీంతో మద్యం కుంభకోణం విషయంలో విజయసాయి అప్రూవర్ గా మారిపోయారనది అవగతమౌతోందంటున్నారు.  అయితే ఇప్పటికిప్పుడు విజయసాయిరెడ్డిని పోలీసు అధికారులు విశ్వసించే అవకాశాలు  లేవనీ, తాము దర్యాప్తులో కనుగొన్న అంశాలు, విజయసాయిరెడ్డి చెబుతున్న  అంశాలూ బేరీజు వేసుకున్న తరువాత మాత్రమే ఆయన నిజాలే చెబుతున్నారని నిర్ధారించుకున్న వరువాత మాత్రమే విజయసాయిని పోలీసులు విశ్వసించే అవకాశం ఉందంటున్నారు. 

ఇలా ఉండగా మద్యం కుంభకోణం కేసులో తాజాగా అరెస్టైన సజ్జల శ్రీధర్ రెడ్డికి సంబంధించిన సమాచారం విజయసాయి  రెడ్డి ద్వారానే పోలీసులకు అందిందంటున్నారు.  లిక్కర్ స్కాంలో సజ్జల శ్రీధర్ రెడ్డి  మద్యం కంపెనీల నుంచి ఉత్పత్తికి తగ్గట్లుగా   ముడుపులు వసూలు చేయడంలో   కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.  ఈ కేసులో ఇప్పటికే కసిరెడ్డి రాజ్ తో పాటు  ఏ8 చాణక్యను అరెస్టు చేశారు. ఇప్పుడు తాజాగా సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేశారు. రానున్నరోజులలో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందంటున్నారు.  

By
en-us Political News

  
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల అక్రమ దందా గుట్టురట్టు
బెంగళూరు నగరంలోని ఒక ప్రతిష్టాత్మక లగ్జరీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.