సజ్జల దారి జైలుకేనా?

Publish Date:Oct 16, 2024

Advertisement

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ముంబై విమానాశ్రయంలో సోమవారం ఇమిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. సజ్జలపై లుక్ ఔట్ నోటీసు ఉండటంతో ఆయన విదేశాలకు పారిపోకుండా ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని భావించాల్సి ఉంటుంది. మామూలుగా అయితే ఆయననున అక్కడే అరెస్టు చేయాల్సి ఉంటుంది. అయితే ఆయన   కోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు కోర్టు రక్షణ ఉన్నందున ఆరెస్టు చేయవద్దంటూ గుంటూరు జిల్లా ఎస్పీ సమాచారం పంపడంతో  సజ్జలను అరెస్టు చేయలేదంటున్నారు. ఇంతకీ సజ్జలపై లుక్ ఔట్ నోటీసు ఏ కేసులు జారీ చేశారన్నదానిపై క్లారిటీ లేదు.  

మంగళగిరిలోని తెలుగుదేశం  కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో  నిందితుల జాబితాలో సజ్జల పేరు కూడా ఉంది.  ఆ కేసును సీఐడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో సీఐడీ అధికారుల ఎప్పుడు పిలిస్తే అప్పుడు సజ్జల విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.  ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పానుగంటి చైతన్య కోర్టులో లొంగిపోయారు. 

సరే అదలా ఉంటే మంగళగిరిలోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో కంటే పెద్ద కేసులోనే ఆయనపై లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యి ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను అడ్డుకోవడంపై స్పందించిన సజ్జల తనపై అసలు కేసులే లేవు.. లుక్ ఔట్ నోటీసు ఎలా జారీ చేస్తారంటూ ప్రశ్నించడాన్ని పరిశీలకులు తప్పుపడుతున్నారు. కేసులే లేనప్పుడు యాంటిసిపేటరీ బెయిలు కోసం సజ్జల కోర్టును ఎందుకు ఆశ్రయించారంటున్నారు. 
ఇక ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు మీడియాతో మాట్లాడుతూ సజ్జలపై లుక్ ఔట్ నోటీసు ఉందనీ, ఆయన అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయనీ విస్ఫష్టంగా చెప్పారు.  వాస్తవానికి జగన్ అధికారంలో ఉన్నంత కాలం సజ్జల డీఫ్యాక్టో సీఎంగా వ్యవహరించారు. ప్రతి కీలక నిర్ణయం వెనుక ఉన్నదీ సజ్జలేనని వైసీపీ నేతలు కూడా చెబుతున్నారు.

పార్టీలో, ప్రభుత్వంలో ఆయన నంబర్ 2గా వ్యవహరించారు.  వైసీపీ హయాంలో జరిగిన ప్రతి తప్పిదానికీ, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులకూ సజ్జలే మాస్టర్ మైండ్ గా చెప్పుకోవాల్సి ఉంటుంది.  సినీ నటి కాదంబరి జత్వానీ వ్యవహారంలో కూడా స్క్రిప్ట్ మొత్తం ఆయనదేనని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సజ్జలను పోలీసులు అరెస్టు చేసే రోజు ఎంతో దూరంలో లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా ఉండగా తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డికి పోలీసులు బుధవారం (అక్టోబర్16) నోటీసులు ఇచ్చారు. గురువారం(అక్టోబర్ 17) ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులలో పేర్కొన్నారు.  

By
en-us Political News

  
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.