ఉద్యోగులతో సజ్జల మైండ్ గేమ్?!

Publish Date:Feb 5, 2022

Advertisement

ఓపెన్ మైండ్ తో ఉన్నాం.. చర్చలకు రండి.. రండి.. అంటూ ఉద్యోగులకు బహిరంగ ఆఫర్ ఇస్తున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఓ పక్క క్రమశిక్షణ చర్యలు తప్పవని బెదిరిస్తూనే.. మరోపక్క చర్చల పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నారంటున్నారు. ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ ఉద్యోగుల పీఆర్సీ విషయంలో  వేలుపెట్టి రాష్ట్రం అధోగతి పాలు కావడానికి ప్రత్యక్షంగానూ.. పరోక్షంగానూ ఆయనే కారణమంటూ ఉద్యోగులు సజ్జలపై ఫైరవుతున్నారు. అయినా.. సీఎం జగన్ రెడ్డి మాత్రం మళ్ళీ మళ్లీ ఆయన్నే చర్చలకు పంపడం వెనుక పరమార్ధం ఏంటని కింది స్థాయి ఉద్యోగులు గుస్సా అవుతున్నారు.

ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ లాగానే ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ తెచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆటలు ఇక సాగేట్టు కనిపించడం లేదు. రివర్స్ టెండరింగ్ అని చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేశారు. ఉద్యోగులను కూడా అలాగే కన్ఫ్యూజ్ చేయాలని అనుకున్నట్టున్నారు కాబోలు సజ్జల.ఆయన వ్యూహం బెడిసికొట్టింది. పీఆర్సీపై ఒక వైపున జీఓలు ఇచ్చి, వాటి ప్రకారమే జీతాలు వేసి.. చర్చలకు మేం సిద్ధంగా ఉన్నాం రండి అంటూ సజ్జల ఆడుతున్న మైండ్ గేమ్ ఉద్యోగులను మరింత రెచ్చగొట్టేలా ఉందంటున్నారు. అర్ధరాత్రి తీసుకొచ్చిన జీఓను రద్దు చేయాలని ఉద్యోగులు, సంఘాలు మొత్తుకున్నా ఆ దిశగా అడుగులు వేయడంలేదు. సరికదా చర్చలకు రండి అంటూ కాలయాపన చేస్తు న్న సజ్జల కమిటీ ఉద్యోగుల సమస్యలపై పెద్ద కుట్ర చేస్తున్నారని అర్ధమవుతుందంటున్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఆర్థిక మంత్రి, చీఫ్ సెక్రటరీ నేత్రుత్వంలో చర్చలు జరపాలి. అలా కాకుండా ఏ సంబంధమూ లేని ప్రభుత్వ సలహాదారు సజ్జల ఇందులో వేలుపెట్టడం వల్లే ఇంత రచ్చ కు దారి తీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో జర్నలిస్టు గా పనిచేసిన సజ్జల.. ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగ చట్టాలపై అనేక కథనాలు రాశారు. అలాంటి సజ్జల ఉన్నట్టుండి ప్రభుత్వ సలహాదారు కావడంతో ఇప్పుడు గతం గుర్తుకు రావడం లేదా అని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఇప్పటికీ పీఆర్సీపై పట్టుదలతో ఉంటూ ఉద్యోగులను రకరకాలుగా ఆందోళనకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు.

అయితే.. ఉద్యోగులు కూడా పీఆర్సీ సాధన విషయంలో అదే ఉడుంపట్టుతో ఉన్నారు. సజ్జల కమిటీ చెప్పే వింత వాదనలకు సమాధానం చెబుతూనే.. ఉద్యమ కార్యాచరణను ముందుకు నడిపిస్తున్నారు. ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పీఆర్సీ సమస్య పరిష్కరించకపోతే ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామని అంతకు ముందే నోటీసులు కూడా ఇచ్చారు. మరోపక్కన శుక్రవారం పెన్ డౌన్, సర్వర్ డౌన్ చేసి సమ్మె తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సలహాదారు సజ్జల తీరు ఇప్పటికైనా మారకపోతే ఏపీలో ఆందోళన మరింత ఉధృతం అయ్యేలా ఉంది. సమ్మె అనివార్యం అవుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సమ్మె జరిగితే.. వ్యవస్థలు పనిచేయకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలవడమే కాకుండా ప్రజలు మరిన్ని ఇబ్బందులు పడక  తప్పదంటున్నారు. ఉద్యోగుల సెంటిమెంట్ తో గెలుక్కుని ఎంత చేటు చేస్తున్నావు సజ్జలా అంటూ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందిప్పుడు.

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.