Publish Date:Oct 17, 2024
వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావలసిందిగా సజ్జలకు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసు మేరకు సజ్జల మంగళగిరి పోలీసు స్టేషన్ కు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతకు ముందు బుధవారం విలేకరులతో మాట్లాడిన సజ్జల తనకు పోలీసులు నోటీసు ఇవ్వడాన్ని, తనపై లుక్ ఔట్ నోటీసు జారీ చేయడాన్ని తప్పు పట్టారు. కక్ష సాధింపు కాక మరోటి కాదన్నారు. పోలీసు వ్యవస్థను తెలుగుదేశం కూటమి నిర్వీర్యం చేసేసిందని విమర్శించారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ఇన్ని ప్రశ్నలు వేసినా సజ్జల నోటీసు అందుకుని పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాక తప్పలేదు. వాస్తవానికి సజ్జల సంధించిన ప్రశ్నలూ, చేసిన విమర్శలూ అన్నీ స్వయంగా తనను ఉద్దేశించి చేసుకున్నట్లుగా ఉన్నాయని పరిశీలకులు పరిశీలకులు అంటున్నారు.
గత ప్రభుత్వంలో అంటే జగన్ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ ముఖ్య సలహాదారు. ఆ పోస్టులో ఆయన పని ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం మాత్రమే. అంటే సజ్జల పాత్ర మొత్తం తెరవెనుకనే ఉండాలి. కానీ సజ్జల తెరముందుకు వచ్చేశారు. జగన్ సర్కార్ మంచి చెడ్డలన్నిటిలోనూ సజ్జల ప్రమేయం ఉంది. పాత్ర ఉంది. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆయన రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారు. సకల శాఖల మంత్రిగా అన్ని శాఖలపైనా పెత్తనం చెలాయించారు. అంతేనా జగన్ కు కళ్లూ, చెవులూ, నోరూ కూడా సజ్జలే అన్నట్లుగా సజ్జల హవా సాగింది. జగన్ అధికారంలోకి వచ్చింది లగాయతూ, ఘోర పరాజయం వరకూ జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుకా ఉన్నది సజ్జలేనని పార్టీ నేతలూ, క్యాడర్ ముక్తకంఠంతో చెబుతున్నారు.
అందుకే గతంలో జగన్ తన మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు భగ్గుమన్న అసమ్మతి నేతలంగా సజ్జలనే నిందించారు. అలాగే ఎన్నికలలో టికెట్లు దక్కని నేతలూ సజ్జలపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుని భయంభయంగా తిరుగుతున్నవారు సైతం తమ ఈ పరిస్థితిని సజ్జలే కారణమని ఆయనపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేనా ఇప్పుడు సజ్జల విచారణకు హాజరు కావడానికి కారణమైన తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి వెనుక ఉన్నది కూడా సజ్జలేనని, ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన వారు వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. అందుకే ఇప్పుడు సజ్జల కూటమి ప్రభుత్వంపై సంధిస్తున్న విమర్శలను పార్టీ శ్రేణులే పట్టించుకోవడం లేదు. సజ్జలకు మద్దతుగా మాట్లాడేందుకు వైసీపీ నేతలెవరూ ముందుకు రావడం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sajjala-in-mangalagiri-police-station-25-186973.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.