మీడియా ఎదుట సజ్జల తడబాటు.. యార్లగడ్డకు హిత వాచకాలు!

Publish Date:Aug 19, 2023

Advertisement

ఏపీ ప్రభుత్వ సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి యార్లగడ్డ సెగ గట్టిగానే తగిలినట్లు కనిపిస్తోంది. దీంతో ఆయన మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు. పార్టీలో , ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరిస్తున్న సజ్జలపై గతంలో కూడా ఎమ్మెల్యేలు, మాజిలైన మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అప్పుడెప్పుడూ లేని విధంగా యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలు సజ్జల రామకృష్ణారెడ్డిని ఇరుకున పడేశాయి.

 దీంతో ఆయన అనివార్యంగా మీడియా ముందుకు వచ్చి తనను తాను సమర్ధించుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్లు ఆయనను ఓ ఆట ఆడుకోవడానికి  మాత్రమే ఉపయోగపడుతున్నాయి. అదే సమయంలో ఆయన ఇచ్చిన వివరణ.. వైసీపీ ఎవరినైనా సరే యూజ్ అండ్ త్రో విధానంలోనే వాడుకుంటుందన్న విషయాన్ని మరో సారి తేటతెల్లం చేసేశాయి. ఇంతకీ వైసీపీని వీడుతూ యార్ల గడ్డ ఏమన్నారంటే..  అమెరికా నుంచి తీసుకొచ్చి జగన్ రెడ్డి తనను నడి సముద్రంలో వదిలేశారని ఆరోపించారు.  

తాను తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించారు.  చంద్రబాబు అవకాశం ఇస్తే గన్నవరం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగుతాననీ, గెలుస్తాననీ ధీమా వ్యక్తం చేశారు. అలా గెలిచిన తరువాతే.. ఒక వేళ పులివెందుల నుంచి జగన్ విజయం సాధిస్తే.. అప్పుడే అసెంబ్లీలో ఆయనను కలుస్తానన్నారు.  తాను పార్టీకి ఎంతో సేవ చేశాననీ, అయినా సజ్జల తనను కూరలో కరివేపాకులా తీసి పారేశారనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం అప్పాయింట్ మెంట్  కోరితే సజ్జల పడనివ్వలేదనీ, గట్టిగా అడిగితే  ఉంటే పార్టీలో ఉండు.. పోతే పో అన్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.  మూడేళ్లుగా సజ్జల తనను అవమానిస్తూనే ఉన్నారనీ, పంటి బిగువన భరించాననీ, కానీ ఇప్పుడు ఉంటే ఉండు పోతే పో అనడాన్ని మాత్రం సహించలేకపోయాననీ వెల్లడించారు.

 ఈ విషయాలన్నీ యార్లగడ్డ బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో సజ్జల మీడియా ముందుకు వచ్చారు. తానలా అనలేదని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సందర్భంగా ఆయన అన్న మరో  మాట ఆయన యార్లగడ్డను ఉంటే ఉండు, పోతే పో అన్నారనే అందరూ నమ్మడానికి దోహదం చేశాయి. ఇంతకీ ఆయనేమన్నారంటే.. ఎవరైనా ఇలాంటి విషయాలు బహిరంగంగా చెబుతారా? అలా చెప్పడం సమజసం కాదని అనడంతో  అంతా సజ్జల యార్లగడ్డకు పొగపెట్టారని నమ్మే పరిస్థితి ఏర్పడింది.  తాను యార్లగడ్డకు టికెట్ విషయంలో హామీ అయితే ఇవ్వలేదనీ, అలాగని వచ్చే ఎన్నికలలో పోటీకి చాన్స్ లేదని కూడా చెప్పలేదని వివరణ ఇచ్చారు.  గన్నవరంలో వంశీ, యార్లగడ్డలలో ఒకరిటే టికెట్ లభిస్తుందన్న కోణంలో మాత్రమే తాను ఆయనతో మాట్లాడానని చెప్పుకున్నారు.  అయినా ఇటువంటి చర్చలు పార్టీలో అంతర్గతంగా జరుగుతాయనీ, వాటిని ఇలా బహిర్గతం చేయడం మంచిది కాదంటూ యార్లగడ్డకు హితవు పలికారు.

నాలుగు గోడల మధ్య తానేం అన్నా భరించాలి అన్న చందంగా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయని నెటిజన్లు విమర్శలు  గుప్పిస్తున్నారు. సజ్జల తీరు చూస్తుంటే.. వల్లభనేని వంశీ కోసం యార్లగడ్డకు పొగబెట్టారనీ, ఆయన ఎదురు తిరగడంతో కంగారు పడుతున్నారనీ అర్ధమౌతోందని పేర్కొంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న అనుమానంతోనే నలుగురు ఎమ్మెల్యేలను బహిష్కరించిన వైసీపీ.. మాజీ ఎమ్మెల్యే మాటలకు ఎందుకు అంత ఉలిక్కి పడుతోంది. గన్నవరంలో వంశీకి అనుకూలంగా సజ్జల వ్యవహరించిన తీరు బూమరాంగ్ అవుతోందన్న భయం వెంటాడుతోందా? అన్న అనుమానాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.  అలాంటి భయమే లేకపోతే ఎన్నడూ లేనిది మీడియా ముందుకు వచ్చి.. నేనేం అనలేదు మహప్రభో అని వేడుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో బాలినేని వంటి వారు తనపై విమర్శలు గుప్పించినా స్పందిచని సజ్జల ఇప్పుడు ఎందుకు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవడానికి తహతహలాడారు అని నిలదీస్తున్నారు. 

By
en-us Political News

  
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.